వైసీపీ ప్లీనరీ వేదికపై విజయమ్మ కనిపించేనా?

Publish Date:Jul 2, 2022

Advertisement

అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జూలై 8, 9 తేదీల్లో జరగనుంది. అందుకు సన్నాహాలు మొదలైనాయి. అయితే ఈ ప్లీనరీని సక్సెస్ చేసేందుకు పార్టీలోని కీలక నేతలంతా రంగంలోకి దిగారు. భారీగా నిర్వహించే ఈ ప్లీనరీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హాజరవుతారా? ఆమె ఆ పదవిలోనే కొనసాగుతారా? లేక ఆ పదవికి రాజీనామా చేసి.. మళ్లీ కుమార్తె వైయస్ షర్మిల వద్దకు వెళ్లిపోతారా? అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో హాట్‌హాట్‌గా నడుస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌కి ఆయన తల్లితో చెల్లితో బాగా గ్యాప్ పెరిగింది. ఇందుకు తార్కానమే షర్మిల  వైయస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం, తల్లి విజయమ్మ ఆమెతోనే ఉండటం. వైఎస్సార్టీపీ  అధ్యక్షరాలిగా   షర్మిల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  పాదయాత్ర చేస్తున్నారు. ఆమె పాదయాత్ర ఇటీవలే వంద రోజులు సైతం పూర్తి చేసుకొంది. అయితే తెలంగాణలో పార్టీ వద్దన్నా వినకుండా  పార్టీ పెట్టడంపై సీఎం జగన్ .. రగిలిపోతున్నారని అప్పట్లోనే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  వైఎస్సార్ టీపీ కారణంగానే  జగన్‌కు  విజయమ్మ, షర్మిలలతో సంబంధాలు చెడ్డాయని కూడా అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.  

ఈ పరిస్థితుల్లో  ఈనెల 8,9 తేదీలలో జరగనున్న వైసీపీ ప్లీనరీకి  వైయస్ విజయమ్మ అయినా హజరవుతారా?అన్న సందేహాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నాయి.  2017లో నాడు ప్రతిపక్ష పార్టీ హోదాలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు.. అదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలంటే.. జగన్ పరిపాలన ముచ్చటగా మూడేళ్లు నిండిన తర్వాత నిర్వహిస్తున్నది.   విపక్ష నేతగా జగన్   ఎప్పుడు దీక్షలు చేసినా.. ఎప్పుడు సభలు, సమావేశాలు నిర్వహించినా..   విజయమ్మ.. షర్మిల జగన్ కు అండగా నిలిచారు.

ముగ్గురూ ఒకే వేదికపై కూర్చుని ముచ్చట్లాడుకునే వారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  ముందు ముందు కూడా ఉంటుందన్న నమ్మకం లేదు.   అక్రమాస్తుల కేసులో జగన్ చంచల్ గూడ జైల్లో ఉన్న సమయంలో.. జగనన్న వదిలిన బాణాన్నంటూ  షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేశారు. అలాగే రాజన్న రాజ్యం కోసం.. తన బిడ్డకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ.. ఎన్నికల ప్రచారంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా  విజయమ్మ కోరారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కూడా వైసీపీతో కానీ, అధినేత జగన్ తో కానీ కనీసం కలవడానికి ఇష్టపడటం లేదు. జగన్ తో తల్లీ, సోదరిల విభేదాలు పార్టీకి ఒక విధంగా పెద్ద దెబ్బేనని వైసీపీ వర్గాలే అంటున్నాయి.  

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.