తెరాస మద్దతు బీజేపీ కేనా?

Publish Date:Jun 16, 2022

Advertisement

ఈ దేశంలో బీజేపీని ,మోడీని ఎదిరించగల మగాడు కేసీఆర్, ఒక్కరే. ఈ మాట అన్నది ఎవరో వేరే చెప్పనక్కరలేదు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మూడు గంటలకు పైగా, భేటి అయిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, ఈ వ్యాఖ్య చేశారు. అంతే కాకుండా, కేసీఆర్ తో  మాట్లాడిన తర్వాతనే  బీజేపీ భయంకర రూపం తనకు అర్థం అయిందని చెప్పుకొచ్చారు. అలాగే, కేంద్రంలో బీజీపీ అధికారంలో కొనసాగితే దేశానికి జరగనున్న భయంకర ప్రమాదం గురించి, కేసీఆర్ బోధనలతోనే తనకు మరింతగా జ్ఞానోదయం అయిందని ఉండవల్లి, ఉద్ఘాటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేనే అనుకుంటే, నాకంటే కేసీఆర్ కరుడు గట్టిన బీజీపీ వ్యతిరేకి అని కితాబు నిచ్చారు. అసలు, బీజేపీ , మోడీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకతే మా ఇద్దరినీ  కలిపిందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. 

అయితే, ఇది నిజమా? నిజంగా కేసీఆర్ నరనరాన బీజేపీ వ్యతిరేకతను నింపు కున్నారా? కమల దళం పై ఆగ్రహంతో రగిలి పోతున్నారా? అంటే, అదంతా ఒట్టి నాటకం, అందులో నిజం లేదని, ఉండవల్లి మాజీ మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఉత్తమ కుమార్ రెడ్డి అంటున్నారు. అంతే కాదు, కేసీఆర్‌కు, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చేశారు.  నిజానికి, ఒక్క ఉత్తమ కుమార్ రెడ్డి మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి కూడా పదే పదే అదే ఆరోపణ చేస్తున్నారు.

అంతే కాదు, ఆ ఇద్దరి మధ్య రహస్య బంధం ఉంది కాబట్టే, కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై  మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఉత్తమ్, రేవంత్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అందుకు కౌంటర్ గా  బీజేపీ నాయకులు, కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడే, ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందని అంటారు. ఎన్నికల వరకు ప్రత్యర్దులుగా నటించినా, ఎన్నికల తర్వాత ఇద్దరు కలిసి పోతారని, కమల దళం నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే, కాంగ్రెస్, తెరాస ఒకే నాణ్యానికి రెండు పార్స్వాలని అంటారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినా  చివరకు చేరేది గులాబీ గూటికే అని, గతాన్ని గుర్తు  చేస్తారు. 

అయితే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తెరాస, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఉత్తమకుమార్ రెడ్డి ఆరోపించారు. నిజానికి, గతంలో పరిస్థితి అదే అయినా, ఇటీవల కాలంలో తెరాస, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనే అందరూ అంటున్నారు. అయినా, ఉత్తమ కుమార్ రెడ్డి మాత్రం,  రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని,అందుకే ప్రతిపక్షాలతో కలిసి రావడం లేదని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటుచేసిన ప్రతిపక్షాల సమావేశానికి తెరాస ఎందుకు హాజరు కాలేదని నిలదీశారు. అందులో కుట్ర దాగి ఉందని అన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఆరోపించారు. అంతే కాకుండా ఇప్పుడే కాదు,గత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు తెరాస మద్దతు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్ అనుకూల అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు రాష్ట్రపతిగా ఓటు వేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కరుడుగట్టిన బీజేపీ వాది వెంకయ్య నాయుడుకు అనుకూలంగా ఓటు వేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో అన్ని విషయాల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీకి టీఆర్ఎస్ దూరంగా ఉంటే ప్రతిపక్షాల అభ్యర్థికి టీఆర్ఎస్ ఓటు వేయాలి. లేదంటే టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని తెలంగాణ ప్రజలు అనుకుంటారని ఉత్తమ్ చెప్పారు.

నిజమే, ఉత్తమ కుమార్ చేసిన ఆరోపణలలో కొంత నిజం ఉంది,అయితే,అదే సమయంలో తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నా లేకున్నా ఆ రెండు రెండు పార్టీలు మధ్య రాజకీయ అవగాహన, సైధాంతిక సారుప్యతా ఉన్నాయనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని, విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.