టీడీపీ-బీజేపీ పొత్తు పొడిచేనా?

Publish Date:Jul 8, 2023

Advertisement

ఒకవైపు బీజేపీ దేశవ్యాప్తంగా మిత్రపక్షాలను కలుపుకుపోవాలని, పలు రాష్ట్రాలలో తమతో కలిసి వచ్చే కొత్త వారితో కూడా స్నేహం చేయాలని చూస్తున్నది. నిన్న మొన్నటి వరకూ కేంద్రంలో మూడో సారి అధికారంపై బీజేపీలో ఉన్న ధీమా  ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు దోస్తీకి సిద్ధమవ్వాలని శ్రేణులకు కూడా అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ పొత్తుపై చాలా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ముందు తన పాత మిత్రుడు టీడీపీతోనే బీజేపీ ఈసారి పొత్తుగా ముందుకు వెళ్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అనంతరం పొత్తు ఖరారైందని కూడా ప్రచారం జరిగింది. అయితే, దీనిపై అటు బీజేపీ ఇటు టీడీపీ ఎక్కడా అవునని చెప్పలేదు.. లేదని చెప్పలేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ పొత్తు వ్యవహారంపై సస్పెన్స్ నడుస్తుంది.

అదలా ఉండగానే  మాజీ మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిని చేశారు. దీంతో ఈ పొత్తు కుదురుతుందా లేదా అని అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే పురందేశ్వరికి టీడీపీతో కానీ.. ఆ పార్టీ అధ్యక్షుడితో కానీ ఎలాంటి సత్సంబంధాలు లేవన్నది తెలిసిందే. అందుకే ఆమె తెలుగుదేశం ను వీడి కాంగ్రెస ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీలో టీడీపీతో పొత్తు ఆశలు ఉన్నట్లయితే ఆమెని పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఎంపిక అయ్యేవారా  అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతేకాదు అసలు టీడీపీతో పొత్తు అనే అంశాన్ని పక్కన పెట్టేందుకే పురందేశ్వరిని ఫోకస్ లోకి తీసుకొచ్చారని.. ఇటు జనసేనకు సైతం టీడీపీతో పొత్తు లేదనే సంకేతాలను ఇచ్చేందుకే పురందేశ్వరిని ఎంపిక చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అదే నిజమై టీడీపీ-బీజేపీ పొత్తు లేకపోతే ఎన్టీఆర్ వారసురాలు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఢీ కొనాల్సి వస్తుంది. అందుకు పురందేశ్వరి సిద్ధమయ్యే పార్టీ పగ్గాలు అందుకుంటే రాష్ట్రంలో ఫ్యామిలీ పొలిటికల్ వార్ చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకవేళ పొత్తుకి సిద్ధమైతే పురందేశ్వరి, చంద్రబాబు పలు చోట్ల వేదికలు  పంచుకోవాలి.. కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కనుక ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనేనా అనిపిస్తున్నది. అయితే  దగ్గుబాటి ,నారా కుటుంబాల మధ్య అప్పుడు ఉన్నంత వైరం ఇప్పుడు లేదు. కాలంతో పాటు ఈ కుటుంబాల మధ్య దూరం కూడా తగ్గింది. ఆ మధ్య ఓ కుటుంబ వేడుకలో రెండు కుటుంబాలు కలిసి మెలిసి మెలిగిన ఫోటోలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. కనుక రాజకీయం రాజకీయమే.. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే కనుక ఏమైనా జరగవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది.

 మరోవైపు బీజేపీ పెద్దలు జగన్ మోహన్ రెడ్డితో కూడా సత్సంబంధాలను వదులుకోవడం లేదు. నిజంగా టీడీపీతో పొత్తు ఆశలు ఉంటే బీజేపీ ఇప్పటికే వైసీపీతో రహస్య బంధాన్ని తెగదెంపులు చేసుకునేది. కానీ, ఇప్పటికీ అదే సీక్రెట్ లైన్ మైంటైన్ చేసింది. ఈ మధ్యనే సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్ ఏమో తనకి సహకరిస్తే రాబోయే తన ప్రభుత్వంలో బీజేపీకి కూడా భాగస్వామ్యం కల్పిస్తానని ఆఫర్లు కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. దీంతో ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఏపీలో పొత్తు ఆలోచన చేస్తోందా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే బీజేపీ నేతృత్వంలో ఈ నెల 18న  ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది.  ఈ సమావేశానికి బీజేపీ తన పాత మిత్రులకు కూడా ఆహ్వానాలు పంపిందని జాతీయ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తున్నది. అందులో భాగంగానే టీడీపీకి సైతం ఆహ్వానం పంపినట్లు చెప్పుకుంటున్నారు. అయితే, ఈ ఆహ్వానం అందిన విషయాన్ని టీడీపీ ఇంకా ధృవీకరించలేదు. ఏది ఏమైనా ఈ సమావేశం తర్వాత కానీ ఏపీలో బీజేపీ-టీడీపీల అడుగులు ఎలా ఉండబోతున్నాయో తెలియదు.

By
en-us Political News

  
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.