జగనన్న సురక్ష.. ఎందుకీ శిక్ష

Publish Date:Jul 8, 2023

Advertisement

ఎన్నికల ప్రయోజనాల కోసం హడావుడిగా ఆదరాబాదరా కార్యక్రమాలు, పథకాలను ప్రకటించేయడం.. క్షేత్ర స్థాయిలో వాటి అమలును పట్టించుకోకపోవడం జగన్ సర్కార్ కు పరిపాటిగా మారిపోయింది. రాబోయే ఎన్నికలే తమ ప్రభుత్వానికి రక్షణ కవచాలుగా  ఉపయోగపడతాయన్న భావనతో ఏపీ సర్కార్ తీసుకువచ్చిన  జగనన్న సురక్ష కార్యక్రమం కూడా అదే కోవలోకి చేరిపోయింది. ఆ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన సచివాలయ ఉద్యోగులే ఏమిటీ శిక్ష అని విసుగు చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగ వ్యవస్థ జగన్ మానస పుత్రిక అన్న సంగతి విదితమే. ఆ  గ్రామ, వార్డు సచివాలయ  ఉద్యోగులే  జగనన్న సురక్ష కార్యక్రమం పట్ల అనాసక్తిగా ఉన్నారు. అది తమకొక శిక్షగా భావిస్తున్నారు.  

ఈ కార్యక్రమం కింద అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా అందజేస్తామన్న ప్రభుత్వం అయితే ఆర్భాటంగా ప్రకటించేసింది. అయితే  క్షేత్రస్థాయిలో  మాత్రం ఈ పథకం పేరుతో  స్టేషనరీ దుర్వినియోగం తప్ప మరేం జరగడం లేదని జనం విమర్శిస్తున్నారు.  ఎవరికి ఏ సర్టిఫికెట్ అవసరమో అది మాత్రమే.. ఆ అవసరం అయిన వారికి ఉచితంగా అందజేయాలి.

అయితే క్షేత్ర స్థాయిలో  ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం ఏమిటి? అన్నది ఎవరికీ అర్ధం కాకుండా జరుగుతోంది. వాలంటీర్లు  ఇష్టారీతిగా దరఖాస్తులను తెచ్చి సచివాలయ ఉద్యోగులకు అందజేయడం.. క్షేత్ర స్థాయి పరిశీలనలో అవన్నీ నకిలీవనో, అవసరం లేకపోయినా ఏదో పని చేస్తున్నామని అనిపించుకోవడానికి తెచ్చిన దరఖాస్తులుగా తేలడం.. పై అధికారులు మాత్రం సచివాలయ ఉద్యోగులపై ఇదేంటి? అదేంటి? ఇంకా దరఖాస్తుల మేరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదా అంటూ ఒత్తిడి తేవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో జగనన్న సురక్ష కార్యక్రమం కాదు కానీ ఇదే మాకో శిక్షగా మారిపోయిందని సచివాలయ సిబ్బంది తలలు కొట్టుకుంటున్నారు.  

వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరిద్దామన్నా వారు వినే పరిస్థితిలో లేకుండా ఎంత సేపూ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావడమే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఇప్పటికైనా జిల్లా కలెక్టర్  జగనన్న సురక్ష పథకం పేర క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తంతును పరిశీలింది.. అవసరమైన వారి నుంచే వాలంటీర్లు దరఖాస్తులను స్వీకరించి తమకు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. 

By
en-us Political News

  
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.