Publish Date:Aug 11, 2022
తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం (ఆగస్టు 11) మరి కొద్ది గంటలలో జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీలో మునుగోడు కేంద్రంగానే చర్చ జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్ సీరియస్ గా పట్టించు కోవడం లేదనీ, అది జస్ట్ ఉప ఎన్నికే అని వ్యాఖ్యానించారనీ పార్టీ వర్గాలు చెబుతున్న వేళ.. ఈ కేబినెట్ సమావేశంలో ప్రముఖంగా చర్చించే అంశాలేమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది. రష్ట్రంలో రాజకీయ వాతావరణం హీట్ ఒక వైపు.. ఆర్థిక ఇబ్బందులు మరోవైపు నెలకొని ఉన్న నేపథ్యంలో కేబినెట్ లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అంశాలపై పార్టీలోనే పలు అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో నిధుల సమీకరణ, పథకాల అమలు, ప్రాజెక్టులు, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రం ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపైనే ప్రధానంగా కేబినెట్ దృష్టి సారించే అవకాశం ఉందంటున్నారు. ఏందుకంటే 2022-2023 బడ్జెట్ లో ఏకంగా రూ. 45వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. ఈ లోటును పూడ్చుకోవడం ఎలా అన్నదానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని కొందరు మంత్రులు కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.
అలాగే పథకాల అమలు, ప్రాజెక్టుల పనులపై నా, ఆగస్టు 15 నుంచి కొత్తగా ఇవ్వనున్న పింఛన్లు, దళిత బంధు పథకం రెండో విడత అమలుపై తదితర అంశాలను చర్చించి కేబినెట్ ఆమోదిస్తుందని చెబుతున్నారు. ఇక జాతీయ రాజకీయాలపైన కేబినెట్ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఢీ అంటే ఢీ అన్నట్లుగా కేంద్రంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంను సైతం బహిష్కరిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. నీతి ఆయోగ్ సమావేశంకు బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం హాజరుకాకపోవటం, మరుసటి రోజే బీజేపీతో తెగదెంపులు చేసుకొని బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తదితర అంశాలపై కేసీఆర్ కేబినెట్ సహచరులకు వివరిస్తారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-telangana-cabinet-discuss-on-munugodu-39-141731.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.