రాజస్థాన్ కాంగ్రెస్ ఇక గాడిన పడినట్లేనా?

Publish Date:Aug 25, 2023

Advertisement

రాజస్థాన్ లో పార్టీలో విభేదాలను చల్లార్చడానికి, రాష్ట్ర నేతలంతా ఐక్యంగా పని చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఫలిస్తుందా? సీడబ్ల్యుసిలోకి పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ను కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక కమిటీలోకి తీసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ సంవత్సరం చివర్లో (నవంబర్, డిసెంబర్ నెలల్లో) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం కూడా లేదు. మరోవంక  ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ఇప్పటికే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. హోం మంత్రి అమిత షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఇతర  నేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు.  బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు.

కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత సమస్యలతో సతమతమౌతోంది. రాష్ట్ర పార్టీలో ఉన్నత  స్థాయి నేతల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీఎన్నికల సన్నాహకాలకు అడ్డంకిగా మారాయి.  కాంగ్రస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాలు, గ్రూప్ రాజకీయాలు కొత్త కాదు.  రాజస్థాన్ లో అయితే  గత నాలుగు సంవత్సరాలుగా గెహ్లాట్,  పైలట్ వర్గాల విభేదాలు, తగవులు, ఘర్షణలు    డైలీ సీరియల్ లా ఎండ్ కార్డ్ అనేదే లేకుండా సాగుతున్నాయి. 

అవును, కథ పాతదే ...  గత నాలుగు సంవత్సరాలుగా వివిధ దశల్లో, వివిధ రూపాల్లో నడుస్తూనే ఉంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ మాజీ  అధ్యక్షుడు సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదేమీ రహస్యం కాదు. ఆ ఇద్దరి మధ్య గల శతృమిత్ర సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకరిని ఒకరు అనని మాట లేదు. ఒకరిపై ఒకరు చేయని ఆరోపణ లేదు. అశోక్ గేహ్లాట్ అయితే  సొంత పార్టీకి చెందిన పైలట్ ను ‘ద్రోహి’ అని దూషించారు. పైలట్ అదే మాటను ఇంకో భాషలో అన్నారు.

నిజానికి, గడచిన నాలుగు సంవత్సరాలలో ఆ ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు అనేకం పతాక శీర్షికలకు ఎక్కాయి. ఒకటి రెండు సందర్భాలాలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఇలా ఇద్దరి విభేదాలు తెరపైకొచ్చిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంది. అయినా, ప్రతి సందర్భంలోనూ గెహ్లాట్ దే పై చేయి అయింది. అన్ని సందర్భాలలో కాంగ్రెస్ అధిష్టానం, కారణాలు ఏవైనా,  గెహ్లాట్ కే జై కొట్టింది. చివరకు, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గెహ్లాట్ అధిష్టానం దూతలను (అందులో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆన్నారు) అవమానించి పంపినా ఆయన పై చర్యలు తీసుకునే సాహసం కాంగ్రెస్ అధిష్టానం, (సోనియా, రాహుల్) చేయలేక పోయింది. గత ఏడాది కాంగ్రెస్‌ అధ్యక్ష  ఎన్నిక సందర్భంగా గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు  అప్పగించి, పైలట్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. కానీ, గెహ్లాట్ అందుకు పైకి అంగీకారం తెలుపుతూనే  తెర వెనక చక్రంతిప్పారు. ఆఖరు నిముషంలో గెహ్లాట్  ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఏగరేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అధిష్టానంనిర్ణయాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ అధిష్టానం లొంగక తప్పలేదు. చివరకు గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పైలట్‌ డిమాండ్‌ కూడా నెరవేరలేదు. ఇదిగో అదిగో అంటూ చివరకు ఆ ఉదంతానికి  ముగింపు పలికారు. 

అందుకే ఇప్పుదు ఎన్నికల ముందు పైలట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పై మరోమారు యుద్దాన్ని ప్రకటించారు. ఆయన ఎత్తుకున్న రాగం, గత బీజేపీ ప్రభుత్వం హయాంలో, అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలనే డిమాండే అయినా, ఆయన టార్గెట్ మాత్రం ముఖ్యమంత్రి గెహ్లాట్ అనేది వేరే చెప్పనక్కరలేదు. అవును,గెహ్లాట్ టార్గెట్ గానే పైలట్  మిస్సైల్ ఫైర్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలను బేఖాతారు చేస్తూ, ముందు ప్రకటించిన విధంగా, ఏప్రిల్ 11న తమ మద్దతుదారులతో కలిసి ఒక  రోజు నిరసన దీక్షకు కూర్చున్నారు. 

గత ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ ఊసే ఎత్తకుండా రేపటి ఎన్నికల్లో ఏ ముఖంతో ప్రజలముందుకు పోగలమని సచిన్‌ ప్రశ్నిస్తున్నారు.  ప్రశ్న బానే వుంది, కానీ, నాలుగేళ్ళ తర్వాత, ఎన్నికలు తరుము కొస్తున్న సమయంలో పైలట్   రోడ్డెక్కడం ఏమిటీ ? ఎందుకు అంటే, అదేమీ బ్రహ్మ రహస్యం కాదు. గెహ్లాట్ ను ఆయనను వెనకేసుకువస్తున్న పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు పైలట్ వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారని వేరే చెప్పనక్కరలేదు. 

గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను అస్త్రాలుగా చేసుకుని ముఖ్యమంత్రి గెహ్లాట్ ను డిఫెన్సులోకి నేట్టే  వ్యూహంతోనే పైలట్  పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే, గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు భయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. గెహ్లాట్ అవినీతి ఎండగట్టేందుకు సచిన్ పైలట్  బీజీపీ భుజాలపై తుపాకీ పెట్టి గెహ్లాట్   పైకి తూటాలు గురి పెడుతున్నారు.  దీంతో ఎన్నికల సన్నాహాల విషయంలో రాజస్థాన్ కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే  అధిష్ఠానం ఓ రాజీ సూత్రంతో ముందుకు వచ్చింది. సచిన్ పైలట్ ను సీడబ్ల్యూసీలోకి తీసుకుని రాష్ట్ర కాంగ్రెస్ లో ఐక్యత సాధించేందుకు ఒక అడుగు వేసింది.   కాంగ్రెస్ అత్యున్న‌త నిర్ణాయ‌క విభాగం పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీలో చోటు ద‌క్క‌డం ప‌ట్ల రాజ‌స్ధాన్ కాంగ్రెస్ నేత స‌చిన్ పైల‌ట్  కూడా సంతోషం వ్యక్తం చే యడంతో ప్రస్తుతానికి రాజస్థాన్ కాంగ్రెస్ లో కుంపట్లు చల్లారాయనే భావించాల్సి ఉంటుంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.