వివేకా హత్య కేసు: ఈడీ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి.!

Publish Date:Oct 14, 2026

Advertisement

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.  వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  

వివేకా హత్యకు ముందు,  తర్వాత  పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు,  నిధుల బదిలీలు జరిగాయన్న అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే.  వివేకా హత్య కోసం  40 కోట్ల  రూపాయల డీల్ కుదిరిందనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం..  ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల ఆర్థిక మూలాలను గుర్తించేందుకు ఈడీ దర్యాప్తు చేస్తున్నది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, దాఖలు చేసిన చార్జిషీట్లలోని కీలక అంశాల ఆధారంగా ఈడీ ముందుకు సాగుతున్నది. 

ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితులను, సాక్ష్యులు, అప్రూవర్ లను ఈడీ విచారించింది.  గత కొన్నేళ్లుగా జరిగిన బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్‌లపై ఫోకస్ పెట్టింది.  గతంలో ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌,   కడప తదితర ప్రాంతాల్లో ఈడీ బృందాలు విస్తృత సోదాలు నిర్వహించాయి. ఆ తనిఖీల్లో   కీలక పత్రాలు, డిజిటల్  ఆధారాలు,  లెక్కల్లో చూపని నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది.  

ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈడీ విచారణకు పిలిచి విచారించడం సంచలనం సృష్టిస్తున్నది.   అవినాశ్ రెడ్డి విచారణ ద్వారా సేకరించిన సమాచారాన్ని గతంలో సేకరించిన ఆధారాలతో సరిపోల్చి చూసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో మరి కొందరు ప్రముఖులను కూడా ఈడీ విచారణకు పిలిచే అవకాశాలున్నాయని సమాచారం.   


[ED Interrogate YS Avinash Reddy,  ED Investigation, YS Vivekananda Reddy Murder Case, Money Laundering Probe, YCP MP Avinash Reddy, ED Interrogation Viveka Case, Telugu One]

By
en-us Political News

  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.