పీకే కాంగ్రెస్‌లో చేరినట్టేనా?.. కేసీఆర్‌కు హ్యాండ్ ఇచ్చినట్టేనా?
Publish Date:Apr 18, 2022
Advertisement
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు చాలా కాలంగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాలతో గతంలోనూ ఆయన అనేక మార్లు చర్చలు జరిపారు. అయితే, ఎందుకనో గానీ ఆ వ్యవహారం అంత సాఫీగా సాగినట్లు లేదు. కొంత గ్యాప్ వచ్చింది.పరస్పర విమర్శలు వినిపించాయి. నెహ్రూ గాంధీ కుటుంబ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోదని పీకే చేసిన ట్వీట్లు, రాహుల్ గాంధీని చులకన్ చేస్తూ చేసిన ట్వీట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్ళీ పీకే కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం లేక పోలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ ముఖ్యనేతలతో జరిపిన కీలక సమావేశంలో పీకే కూడా పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు, 2024 ఎన్నికల వ్యూహంపై ఆయన ప్రజెంటేషన్’ కూడా ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్’ ను పరిశీలించేందుకు, సోనియా గాంధీ ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని వేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పీకేతో ఎన్నికల వ్యూహం గురించి చర్చించడం బహుశా ఇదే తొలిసారి,కావచ్చును.గతంలోనూ సొనియా, రాహుల్, ప్రియాంక వాద్రాలతో ఉమ్మడిగా, విడివిడిగానూ కూడా పీకే సమావేశమయ్యారు. అయితే,ఆ సమావేశాలో ఇతర నాయకులు ఎవరూ పాల్గొన సమాచరం అయితే లేదు. అంతే కాదు, పార్టీ అధికారికంగా సమావేశం వివరాలను మీడియా ముందు ఉంచలేదు.ఆ విధంగా ప్రస్తుత సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుచరించవలసిన వ్యూహంపై చర్చించేందుకు మరో నెలరోజుల్లో కాంగ్రెస్ పార్టీ ‘చింతన్ శిభిర్’ నిర్వహిస్తున్న నేపధ్యంలో పీకే ప్రెజెంటేషన్ ఇవ్వడం, అదే విధంగా అదే సమావేశంలో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే, ఆయన కండిషన్లు ఒప్పుకుని పీకేను పార్టీలోకి తీసుకోవడానికి అంగీకరించని సీనియర్ నాయకులు ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో పీకే కాంగ్రెస్’లో చేరాలంటే తనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటుగా, పొత్తులు, ఎన్నికల వ్యూహాల విషయంలో పూర్తి సేచ్చ ఇవ్వాలనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు పీకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? లేక కేవలం ఎన్నికల వ్యూహ కర్తగా పనిచేసేందుకు మాత్రమే సోనియా గాంధీ, ఇతర సీనియర్ నాయకులతో చర్చలు జరిపారా అనే విషయంలో స్పష్టత లేదు. అయితే, కాంగ్రెస్ లో చరికపై ప్రశాంత్ కిశోర్ గత కొంత కాలంగా విభిన్న రీతుల్లో స్పందిస్తూ వచ్చారు. ఒక సందర్భంలో అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాను సిద్ధంగానే ఉన్నాన్ననని, అయితే, కొన్ని విషయాల్లో, ముఖ్యంగా కుటుంబ నాయకత్వం విషయంలో కొన్ని చిక్కుముళ్ళున్నాయని చెప్పు కొచ్చారు. అయితే, అదే సమయంలో కాంగ్రెస్ లేకుండా ఏర్పడే ఏ కూటమి అయినా బీజేపీన ఓడించలేదని చెప్పు కొచ్చారు. కాంగ్రెస్’లో చేరే విషయంగా పీకే ఇప్పటికే పలు మార్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. మరోవంక పీకే కండిషన్స్, షరతులు అంగీకరిస్తూ ఆయనను పార్టీలో చేర్చుకునే విషయమై కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటినుంచి అటూ ఇటూ అవుతోంది. ఇంతవరకు జరిగిన కథ ఇరివురికి కూడా, ‘కొంచెం ఇష్టం, కొంచెం కష్టం’ కథలానే సాగుతోంది. అయితే, కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో స్పష్టమైన నిర్ణయం వెలువరించాలని అధినేత్రి సోనియా డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతోపాటే చింతన్ బైఠక్ తీరుతెన్నులు, అజెండా, భేటీ తేదీలను చర్చించడానికే సోనియా శనివారం నాటి సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి పీకేను కూడా పిలవడం ద్వారా ఆయన చేరికపై అధినేత్రి పాజిటివ్ సిగ్నల్స్ పంపినట్లయిందని అంటున్నారు.మరోవంక తన రాజకీయ భవిష్యత్తుగా మే 6లోగా కచ్చితంగా ఏదోఒక నిర్ణయం తీసుకుంటానని ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ప్రకటించిన నేపధ్యంలో మరో 20 రోజుల్లో పీకే, కొత్త అవతారం ఏమిటో తేలిపోతుందని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/will-pk-joins-congress-25-134546.html





