Publish Date:Apr 18, 2022
ఇంత కాలం తమ పార్టీకి కొమ్ము కాసిన రైతులే ఇప్పుడుఈ ప్రభుత్వంలో తాము బతికే పరిస్థితి లేదు, మరణించడానికి అనుమతి ఇవ్వండి అంటూ ఏకంగా గవర్నర్ కు లేఖలు రాశారంటే... వైకాపా ప్రభుత్వానికి అధికారంపై తప్ప ఎవరి బాగోగులపైనా శ్రద్ధ లేదని అవగతమౌతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీకి చెందిన రైతులే గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇంతకీ వారెవరంటే....
గత తెలుగు దేశం ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి 33వేల ఎకరాలు సమీకరించింది. ఆ సమయంలో విపక్షంలో ఉన్న వైకాపా భూములు ఇవ్వొద్దంటూ రైతులను రెచ్చగొట్టింది. రైతులు భూ సమీకరణకు భూములు ఇవ్వకుండా ఉండేందుకు వారి చెవిన ఇల్లు కట్టుకు నచ్చ చెప్పింది. కుదరని చోట కన్నెర్ర చేసి బెదరించింది. అయినా రైతులు భూ సమీకరణ వైపే మొగ్గు చూపారు. అయితే వైకాపాకు చెందిన కొందరు రైతులు మాత్రం తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. అటువంటి వారి భూములన్నిటినీ గత ప్రభుత్వం క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండా యూ-1 జోన్ లో చేర్చింది. అంటే రిజర్వ్ జోన్ అన్నమాట. ఆ జోన్ లో ఉన్న భూములు అమ్మడానికి కానీ, కొనుగోలు చేయడానికి కానీ అవకాశం ఉండదు. సరే...వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యింది. జగన్ మాటలను నమ్మి తమ భూములు అప్పటి ప్రభుత్వానికి ఇవ్వకుండా భీష్మించిన రైతుల భూములు ఇప్పటికీ రిజర్వ్ జోన్ లోనే ఉన్నాయి. అంటే గత ఆరేళ్లుగా ఆస్తులు ఉండీ వాటిని అనుభవించలేని దుస్థితిలో రిజర్వ్ జోన్ రైతులు ఉన్నారన్నమాట. తాము నమ్మిన జగన్ అధికారంలోనికి వచ్చి కూడా తమ బాధలను పట్టించుకోవడం లేదన్న బాధను ఇంత కాలం పంటి బిగువున భరించిన ఆ రైతులు తాము మోసపోయామని ఇప్పటికి గ్రహింపునకు వచ్చారు. ప్రభుత్వంపై తిరుగు బావుటా ఎగుర వేశారు. కారుణ్య మరణ భిక్ష పెట్టమంటూ గవర్నర్ కు లేఖల రూపంలో వినతి పత్రాలు సమర్పించారు.
తాడేపల్లి, కలువకొలను, కుంచనపల్లి గ్రామాలకు చెందిన రైతులకు చెందిన 178 ఎకరాలు ఈ యూ-1జోన్ లో ఉన్నాయి. నాడు విపక్షంలో ఉన్న వైకాపాకు మద్దతుగా నిలిచిన ఈ రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాడు వారి వెన్నంటి ఉండి, భుజం తట్టి ప్రోత్సహించిన మంగళగిరి ఎమ్మెల్యే ఇప్పుడు వారి కేసి కన్నెత్తి చూడటం లేదు. పన్నెత్తి పలకరించడం లేదు. న్యాయం చేయాలని కోరుకుంటున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఆందోళన శిబిరాల కేసి చూసే నాథుడే కనిపించడం లేదు. మరో వైపు అమరావతి రైతుల శిబిరాలు పెద్ద సంఖ్యలో మద్దతు దారులతో కలకలలాడుతుంటే...వీరి శిబిరాలు వెలవెలబోతున్నాయి. తాము రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యామని మధన పడటం తప్ప ఏం చేయలేని పరిస్థితుల్లో యూ-1 జోన్ రైతులు ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/u1zone-farmers-pledge-governer-for-mercy-death-25-134550.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.