పిల్ల సజ్జలకు జైలేనా?

Publish Date:Feb 21, 2025

Advertisement

వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయనే డిఫాక్టో సీఎంగా రాజ్యమేలారు. జగన్ మాటలను ఆయన తన నోటితో వినిపించారు. ఆయన ఆదేశాలను తన చేతులతో అమలు చేశారు. జగన్ హయాంలో కేబినెట్ అన్నది నామమాత్రమే అయిపోయింది. మంత్రివర్గ శాఖల సమీక్షలు కూడా సజ్జలే చేశారు. మంత్రులకు బదులుగా మీడియా ముందుకూ ఆయనే వచ్చే వారు. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకునే సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను అప్పగించారు. 

పిల్ల సజ్జల చేతికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ పగ్గాలు వచ్చిన క్షణం నుంచి ఆయన పేనుకు పెత్తనం ఇస్తే.. అన్నట్లుగా చెలరేగిపోయారు. పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న సామెత చందంగా వ్యవహ రించారు.  తెలుగుదేశం పార్టీ,   ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీలోని మహిళా నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అత్యంత దారుణమైన, అసభ్యకరమైన పోస్లులతో రెచ్చిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి హయాంలో వైసీపీ సోషల్ మీడియా వెర్రి పుంతలు తొక్కింది. సరే వైసీపీ ఘోర పరాజయంలో ఆ పార్టీ సోషల్ మీడియా పాత్ర కూడా గణనీయంగానే ఉందనడంలో సందేహం లేదు. వైసీపీ పరాజయం తరువాత సజ్జల భార్గవ్ రెడ్డిని కేసుల నుంచి తప్పించేందుకు ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేయగలిగినంతా చేశారు. పార్టీ ఓటమి పాలు కాగానే చడీ చప్పుడూ లేకుండా ఆయనను సోషల్ మీడియా పదవి నుంచి తప్పించి.. రాష్ట్రం దాటించేశారు. ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా చేశారు.  ఎన్ని చేసినా చేసినా కర్మ ఫలం అనుభవించాల్సిందేగా?  

 సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో  తనపై నమోదైన కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం పిల్ల సజ్జల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  సజ్జల భార్గవ్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం ( ఫిబ్రవరి 21) విచారించింది. ఆ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే పిల్ల సజ్జలకు యాంటిసిపేటరీ బెయిలు లభించడం అనేమానమే అని న్యాయనిపుణులు చెబుతున్నారు.  పిల్ల సజ్జల కటకటాలు లెక్కించక తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. నెటిజనులు సైతం పిల్ల సజ్జలకు బెయిలా? జైలా అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  పిల్ల సజ్జల యాంటిసిపేటరీ బెయిలు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టింది.  వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్య పోస్టులు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే  సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నిరోధానికి చర్యల వివరాలను తమకు నివేదించాలని ఆదేశించింది. 

పిల్ల సజ్జల యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ పోలీసుల తరఫున వాదనలు వినిపించిన పీపీ లక్ష్మీనారాయణ  తప్పుడు పోస్టులు పెట్టేందుకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యాలయంలో 400 మందికి పైగా పని చేశారని తెలిపారు. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన పోస్టులు, ఫొటోలను వివిధ గ్రూపుల్లో పోస్టు చేసేవారని దానికి డబ్బులు చెల్లించేవారని నివేదించారు. అలాగే  నచ్చని   వ్యక్తిని, వర్గాన్ని వదిలిపెట్టకుండా ఇష్టారీతిగా చెలరేగిపోయారని,  న్యాయమూర్తులను, చివరికి దేవుడిని సైతం వదిలిపెట్టలేదని పేర్కొన్నారు. పిటిషనర్లు నిరక్షరాస్యులు కాదని, బాగా చదువుకున్న వారేనని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం, ప్రతిష్ఠలను దెబ్బతీయడం, అపకీర్తి పాలు చేయడం, బెదిరించడంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారని తెలిపారు. వాదనల తరువాత హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.  

By
en-us Political News

  
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.