ఇకపై దాడులు చేస్తే.. వాళ్లింటి కెళ్లి కొడతాం.. చంద్రబాబు

Publish Date:Aug 25, 2022

Advertisement

దాడులకు ప్రతి దాడులు తప్పవని వైసీపీకి చంద్రబాబు స్పష్టమైన హెచ్చరిక చేశారు. పోలీసుల అండతో దాడులు చేస్తుంటూ చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన పర్యటనలను అడ్డుకోవడం తప్ప జగన్ కు ఇంకే పని లేదని విమర్శించారు. పరిపాలన అంటే విపక్షాలపై దాడులు చేయడమేననుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు స్వరంలో స్పష్టమైన మార్పు కనిపించింది. గతానికి భిన్నంగా ఆయన పరుష పదజాలంతో వైసీపీపై విరుచుకు పడ్డారు. ఆయన స్వరం పెంచారు. విమర్శల్లో వాడి పెంచారు. కుప్పంలో వైసీపీ శ్రేణుల ఆరాచకత్వంపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేస్తారా అంటూ రెచ్చిపోయారు. అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కుప్పంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్వాంటిన్ వరకూ పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో వైసీపీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అన్న క్యాంటిన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన ఈ రోజు కుప్పం చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు.

అన్నం పెట్టే అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడాన్ని నీచమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ హయాంలో వీధికో రౌడీని తయారు చేసి ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. పోలీసులు తిన్నగా వారి విధులు నిర్వర్తిస్తే ఈ రోజు కుప్పంలో అన్న క్యాంటిన్ ధ్వంసమయ్యేదా అని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ పక్కనే ఉన్నా నిర్భయంగా దాడి చేసి క్యాంటిన్ ను ధ్వంసం చేశారంటే అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పని చేస్తోందా అన్న అనుమానం వస్తోందని అన్నారు. కుప్పం నడిబొడ్డున ఇంత  జరుగుతుంటే ఎస్పీ ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. మా వాళ్లూ దాడులకు దిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ 60 వేల మంది పోలీసుల అండతో  రెచ్చిపోతోందనీ, అదే మాకు (తెలుగుదేశం)కు 60 లక్షల కార్యకర్తల సైన్యం ఉంది జాగ్రత్త అని హెచ్చరించారు. అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేసిన వారిని పోలీసు స్టేషన్ కు కాకుండా వాళ్ల ఇళ్లకు తీసుకెళ్లి దిగబెట్టి వస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇకపై మాపై దాడులు చేస్తే వారి ఇళ్ల కెళ్లి కొట్టి వస్తామని హెచ్చరించారు.

వైసీపీ మూడేళ్ల పాలనలో పలు చోట్ల తన పర్యటనలను అడ్డుకోవడం తప్ప జగన్ ప్రభుత్వం ఏం చేసింది లేదని విమర్శించారు. దాడులు చేసి భయపెట్టి గెలవాలనుకుంటున్న వైసీపీ పన్నాగాలు పారవని హెచ్చరించారు. దాడులకు బయపడేది లేదన్నారు. వైసీపీపై, పోలీసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అలాగే వైసీపీ అరాచకాలపూ రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. వైసీపీ ఆగడాలపై జనం గళమెత్తాలని పిలుపునిచ్చారు. జనం మౌనంగా ఉంటే వైసీపీ రౌడీలు వారి ఇళ్లపైకి వస్తారని అన్నారు. తన తీరు ఇప్పటి వరకూ ఒక లెక్క..ఇకపై ఒక లెక్కగా ఉండబోతోందని చంద్రబాబు అన్నారు. తన శైలికి భిన్నంగా ఇకపై కఠినంగా ఉండక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు.

తాను సొంత నియోజకవర్గంలో పర్యటనకు వస్తే సిగ్గులేని ప్రభుత్వం బస్సులను నిలిపివేసింది. పాఠశాలలకు సెలవు ఇచ్చేసింది. ఏమిటి.. ఈ సర్కార్ ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. వైసీపీ దాడులు, అరాచకాలపై ఇంకా తెలుగుదేశం కార్యకర్తలను కట్టడి చేయడం సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. వైసీపీ వాళ్లు కూల్చిసిన దగ్గరే అన్న క్యాంటిన్ లో బోజనం పెడుతున్నానని అన్నారు. అన్న క్యాంటిన్ ఇక్కడే కొనసాగుతుందని స్పష్టం చేశారు.  వైసీపీ శ్రేణులు కూల్చివేసిన అన్న క్యాంటిన్ ను అక్కడే ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన చంద్రబాబు అక్కడ నుంచి వెళ్లిన కొద్దివ్యవధిలోనే ఆ క్యాంటిన్ వద్దకే భోజనాలు చేయడానికి వైసీపీ కార్యకర్తలు వచ్చారు.

పుంగనూరు నుంచి తమను బస్సుల్లో తీసుకు వచ్చి కనీస ఏర్పాట్లూ కూడా చేయలేదని కుప్పం వైసీపీ నేతలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో ఉన్న వైసీపీ కార్యకర్తల బాధను చూసి తెలుగుదేశం శ్రేణులు వారికి అన్న క్యాంటిన్ లో భోజనాలు పెట్టారు. తాము కూల్చేసిన అన్న క్యాంటిన్ లోనే వైసీపీ కార్యకర్తలు భోజనాలు చేశారు.
 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.