బిగ్ బాస్ నాగ్ పొలిటికల్ ఎంట్రీ?

Publish Date:Sep 9, 2022

Advertisement

నిజానికి, అక్కినేని నాగార్జునకు అలాంటి ఆలోచన లేదు.   ఆ ఉద్దేశమూ లేదు. అయినా ఆప్పుడే, అంతా అయిపోయినట్లే ప్రచారం జరుగుతోంది. కనీసం వన్ సైడ్ లవ్ అయినా లేకుండానే, ఏకంగా ట్రైయాంగిల్ లవ్ స్టొరీ అల్లేసిన విధంగా, సోషల్ మీడియా క్రియేటివ్ రైటర్స్ జగన్, అక్కినేని నాగార్జున మధ్య  పొలిటికల్ లవ్ స్టొరీ ని అల్లేశారు.

 అవును మనం,మాట్లాడు కుంటోంది బిగ్ బాస్ నాగార్జున పొలిటికల్ ఎంట్రీ గురించే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఆయన ప్రేమలో పడ్డారంటూ వస్తున్న కథనాల గురించే. గత కొద్ది రోజులుగా, సోషల్ మీడియాలో కొంత వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇలాంటి వదంతులు బాగా షికారు చేస్తున్నాయి. నాగార్జున త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని, వైసేపీలో చేరుతున్నారని, అదే విధంగా విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని, వండి వార్చిన కథనాలు చాలానే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, గాలి కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే  వైసీపీ సోషల్ మీడియాలో ఈ ‘వంటక’ స్టొరీ బాగా వైరల్ అవుతోంది. 

అయితే, ఇందులో అంతా కాకున్నా కొంతైనా నిజం ఉందా అంటే, అసలే లేందంటున్నారు, ఆ ఇద్దరినీ ఎరిగిన సినీ, రాజకీయ రంగ ప్రముఖులు. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి, ముఖ్యంగా ఆయనకు సినిమా రంగం గురించి, సినిమా హీరోలు, నిర్మాతల గురించి ఉన్న ‘గౌరవ’ భావం తెలిసిన ఎవరు, ఆయనతో రాజకీయ సంబంధాలు పెట్టుకునే సాహసం చేయరని  అంటున్నారు. అలాంటిది, అందాల నటుడు,  అక్కినేని నాగేశ్వరరావు వారసుడు,అన్నిటినీ మించి,నాగేశ్వరరావు నుంచి నటనతో పాటు వ్యాపార సూత్రాలనూ బాగా వంట పట్టించుకున్న నాగ్  అలాంటి తప్పు అసలే చేయరని అంటున్నారు.  
నాగార్జున ప్రధానంగా నటుడే కావచ్చును,కానీ, అంతకు మించి ఆయన,ఓ మంచి బిజినెస్ మ్యాన్, అయన వేసే ప్రతి అడుగులో ‘నా కేంటి?’ అని ఒకటికి పది సార్లు బేరీజు వేసుకుని ఆ తర్వాతనే ముందడుగు వేస్తారని అంటారు. అన్నిటినీ మించి ఆయనకు రాజకీయ సొద అసలే గిట్టదని అంటారు.అలాగని ఆయనకు రాజకీయ సంబంధాలు లేవా అంటే ఉన్నాయి.. అయితే... అవన్నీ కూడా వ్యాపార సంబధాలతో ముడి పడిన రాజకీయ సంబంధాలే తప్ప, రాజకీయ రంగులు పూసుకునే సంబంధాలు కాదని అంటారు. కారల్ మార్క్స్, ‘మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే’ అంటూ చేసిన సూత్రీకరణను కమ్యూనిస్టులు ఎంతవరకు నమ్ముతారో ఏమో కానీ, అక్కినేని నాగార్జున మాత్రం పూర్తిగా నమ్ముతారని, ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఆడుకు ముందుకు వేయరని అంటారు. 

అవును, ఆయన వైఎస్  ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆరోగ్య‌శ్రీ ప్రకటనలో నటించారు. అలాగే జగన్ రెడ్డి పాద యాత్ర సమయంలోనూ ఆయన వైసేపీకి మద్దతు తెలిపినట్లు ప్రచారం జరిగింది కానీ, ఆయన ఎప్పుడూ బహిరంగంగా అలాంటి  ప్రకటన చేయలేదు. నాగర్జున, నాగ చైతన్య అభిమాన సంఘం అధ్యక్షుడి పేరున బి,రాము అనే వ్యక్తి చేసిన ప్రకటనను నాగార్జునకు ముడి పెట్టి వైసేపీ నాయకులు ప్రచారం చేసుకున్నారని అంటారు. నాగార్జున అప్పుడు గానీ, ఇప్పడు గానీ, ఎప్పుడూ ఒక్క వైసీపీ కనే కాదు ఏ పార్టీకి కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు. 

అదలా ఉంటే గతంలో రాజ్యసభ టికెట్’ కు సంబంధించి చిరంజీవితోనూ జగన్ రెడ్డి ఇలాంటి కథనే నడిపించారు. లంచ్ కి పిలిచి సోషల్ మీడియాలో రాజ్యసభ టికెట్ జరిపించారు.   చివరకు మెగా స్టార్ నవ్వుల పాలయ్యారు. మీడియా ముందు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు .ఇక పోసానీ, అలీ, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇదిగో అదిగో అంటూ నామినేటెడ్ పదవులను .. చూపించడమే కానీ.. ఇచ్చింది లేదని, చివరకు ఇచ్చినా వద్దనే స్థితికి వారిని నేట్టివేశారని అంటారు. 

అయితే ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు విజయవాడ నియోజక వర్గం నుంచి పోటీచేసేందుకు, వైసీపీకి సరైన అభ్యర్ధి లేరు. గత  (2019) ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి కేసీనేని నాని గెలిచారు. ఆయనపై పోటీచేసిన వైసీపీ అభ్యర్ధి పొత్తూరి వరప్రసాద్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాగే, 2014లో పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ కూడా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.సో .. అభ్యర్ధి వేటలో ఉన్న వైసీపీ  నాగార్జునను తెర మీదకు తెచ్చిందని అంటున్నారు. అయితే, సహజంగానే వ్యాపార రాజకీయాలు తప్పించి ప్రత్యక్ష రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదనే అంటున్నారు.

By
en-us Political News

  
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.