కేటీఆర్ వివరణ న్యాయ పరీక్షలో నిలుస్తుందా?

Publish Date:Dec 20, 2024

Advertisement

మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ ఫార్ములా కార్ రేసు కేసు విషయంలో న్యాయపరమైన చిక్కులు తప్పవన్న భావన పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండటం కోసం, పెట్టుబడుల ఆకర్షణ కోసమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు సొమ్ము ఇవ్వాల్సి వచ్చిందన్న కేటీఆర్ వివరణ న్యాయ పరీక్షకు నిలబడే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు. ఈ కేసులో ఏసీబీ ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేటీఆర్ కు తాత్కాలిక ఊరట కల్పించింది.

అది పక్కన పెడితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఈ ఫార్ములా   రేసులో 55 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఏసీబీ  కేసు నమోదు చేసింది.  అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(ఏ),  13(2), అలాగే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్  409  (విశ్వాస ద్రోహం), 120(బి) (నేరపూరిత కుట్ర) కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అదే సమయంలో ఈడీ కూడా కేటీఆర్ పై కేసు నమోదు చేసింది.  . ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే అనివార్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు 55 కోట్ల రూపాయలు బదిలీ చేయాల్సి వచ్చిందని అంగీకరించారు. హైదరాబాద్ బ్రాండ్ ను కాపాడటం, పెట్టుబడుల ఆకర్షణ, అలాగే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం కోసం హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ జరగాలని తాను భావించాననీ, అయితే  స్పాన్సర్లు లేకపోవడం వల్ల హైదరాబాద్ నుండి వైదొలగాలని ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులు భావించడంతో   తాను చొరవ తీసుకుని 55 కోట్లు నిర్వాహకులకు బదిలీ అయ్యేలా చేశాననీ కేటీఆర్ వివరణ ఇచ్చారు.  ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనం ఉంటుందని పేర్కొన్న కేటీఆర్, అదే ఈ రేసు రద్దు అయితే  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని పేర్కొన్నారు. అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే నిర్వాహకులకు రూ.55 కోట్ల బదిలీ చేసినట్లు వివరించారు.  

అయితే కేటీఆర్ వివరణ వల్ల చట్టపరమైన చిక్కుల తొలిగిపోయే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు.   రూ. 10 కోట్లకు పైగా ఖర్చులకు ఆర్థిక శాఖ,  రాష్ట్ర ప్రభుత్వంనుంచి పరిపాలనా అనుమతి అవసరం. కానీ అలాంటి అనుమతులేవీ తీసుకోకుండానే విదేశీ సంస్థకు రూ.55 కోట్ల బదిలీ జరిగిపోయింది. దీనికి కేబినెట్ ఆమోదం కూడా లేదు. అసలీ బదలాయింపుపై  ఆర్థిక శాఖకు కనీస సమాచారం కూడా లేదు.ఇవేమీ లేకుండానే  ఫార్ములా ఇ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఇఒ) కు బదిలీ చేశారు. ప్రభుత్వం విదేశీ బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేసినప్పుడు ఆర్‌బిఐకి తెలియజేయాలి, కనీసం అది కూడా జరిగిన దాఖలాలు లేవు.  కాబట్టి, ఈ కేసులో కెటిఆర్‌ కు చట్టపరమైన, న్యాయపరమైన చిక్కులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది కచ్చితంగా విధాన లోపం,  నిధుల దుర్వినియోగం కిందకే వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.  

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.