Publish Date:Oct 10, 2022
స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి అన్నారు అప్పట్లో శ్రీశ్రీ.. కొంచం అటూ ఇటూగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా ఇది వర్తిస్తుంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేసి కొత్త జాతీయ పార్టీ స్థాపించేశానని ఆయన సంబరపడిపోతున్నారు. సభలు చేసేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందే కానీ అది ఇంకా ప్రాంతీయ పార్టీయే. రంగూ, రుచీ, వాసనా అంతా ప్రాంతీయమే.
అసలు ముందుగా బీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభిస్తుందా అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దేశంలో బీఆర్ఎస్ పేరుతో రెండు రాజకీయ పార్టీలు రిజస్టర్ అయి ఉన్నాయి. వాటిలో ఒకటి బహుజన రాష్ట్ర సమితి(బీఆర్ఎస్). ఈ పార్టీ కేంద్ర కార్యాలయం వెస్ట్ మారేడ్ పల్లిలోని లలితా నగర్ లో ఉంది. బహుజన సమాజ్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఉంది. అలాగే దేశంలో బీఆర్ఎస్ పేరు మీద మరో పార్టీ కూడా రిజిస్టర్ అయి ఉందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేర కేసీఆర్ స్థాపించిన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభిస్తుందా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేస్తూ ఒక తీర్మానం ఆమోదించేసి.. గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపేయగానే పార్టీకి గుర్తింపు వచ్చేసినట్లు కాదని పరిశీలకులు అంటున్నారు.
తెరాస సర్వ సభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానం తో పాటు తెరాసను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ రాసిన లేఖను తీసుకుని మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి హస్తిన వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించి వచ్చారు. బీఆర్ఎస్ విషయంలో ఇప్పటి వరకూ పడిన అడుగు ఇదొక్కటే. అంత మాత్రానే జాతీయ పార్టీ ఆవిర్బవించేసిందనీ, ఇక జాతీయ స్థాయిలో చక్రం తప్పిడమే తరువాయి అన్నట్లుగా టీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న హడావుడి.. ఆలూ లేదు.. చూలూ లేదు అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. ఒక పార్టీ పేరు మార్చుకోవడానికి పెద్ద అభ్యంతరాలేమీ ఉండవని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఆ పేరు మార్పుతోనే జాతీయ గుర్తింపు వచ్చేసినట్లు కాదని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ గుర్తింపు రావాలంటే అందుకు అవసరమైన ఓట్ల శాతం, సీట్ల సంఖ్య ఉండాలని అప్పుడే జాతీయ గుర్తింపు వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పేరుతో మరో రెండు పార్టీలు ఉండటంతో కేసీఆర్ బీఆర్ఎస్ కు గుర్తింపు లభిస్తుందా అన్న విషయంలో తెరాస వర్గాలలో సైతం అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
అయితే పార్టీ పేరు వేరు, అబ్రివేషన్ వేరు అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు అయితే లభించే అవకాశాలు లేవనీ, నిబంధనల ప్రకారం అన్ని పారామీటర్స్ కు అనుగుణంగా ఉంటేనే బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం గుర్తింపు లభించే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-kcrs-brs-party-get-ec-recognisation-25-145190.html
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.