కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరవుతారా లేదా అనేదానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. కమిషన్ నివేదికలో ప్రధానంగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. దీనిపై ఇప్పటికే కేసీఆర్ తనను కలసిన నేతల వద్ద మనోగతాన్ని వెల్లడించారు. అది కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ నివేదికని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఒకడుగు ముందుకు వేసి అరెస్ట్ లు కూడా జరగవచ్చని ప్రిడిక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీ లో చర్చకు హాజరవుతారా లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీకి హాజరుకాకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. ఒక వేళ అసెంబ్లీకి హాజరై చర్చలో పాల్గొంటే.. వెళితే తాను వివరణ ఇచ్చే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే కేసీఆర్ కూర్చోవాల్సి ఉంటుంది. దీనిని కేసీఆర్ భరించగలుగుతారా? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ ను పూర్తికాలం సభనుంచి సస్పెండ్ చేశారు. అదే రేవంత్ రెడ్డి సభానాయకుడి స్థానంలో ఉండగా కేసీఆర్ సభకు హాజరై కాళేశ్వరం కమిషన్ చర్చలో పాల్గొంటారా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. రేవంత్ కూడా కేసీఆర్ ను సభకు ఏదో రకంగా రప్పించాలనే వ్యూహంతో ఉన్నారు.
జానారెడ్డి, ఉత్తమ్, భట్టి లాంటి వాళ్లనే సభలో నోరు ఎత్తకుండా చేసిన కేసీఆర్.. నేడు సభకు వస్తే అదే సీను తనకు రిపీట్ అవుతుందన్న భయం కూడా కేసీఆర్ లో లేకపోలేదంటున్నారు. సభలో చర్చ కన్నా రచ్చే ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు వస్తారా ? రారా? అన్నది ఆసక్తిగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-kcr-attend-assembly-to-participate-in-kaleswaram-discussion-39-203533.html
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.