చావనైనా చస్తా కానీ కాంగ్రెస్ లో చేరను.. గడ్కరీ

Publish Date:Aug 30, 2022

Advertisement

నితిన్ గడ్కరీ.. బీజేపీలో నిన్న మొన్నటి వరకూ ఓ వెలుగు వెలిగిన నేత. నాగపూర్ సంబంధాలతో పార్టీలో, ప్రభుత్వంలో మోడీతో సమానుడిగా అంతా భావించిన నాయకుడు. ఒక సమయంలో మోడీకి ప్రత్యామ్నాయం ఎవరన్న చర్చ వచ్చినప్పుడు నిర్ద్వంద్వంగా అంతా గడ్కరీ పేరే చెప్పారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న నాయకుడు నేడు బీజేపీలో ఎవరికీ కొరగాని నేతగా మారిపోయారు.

అందుకు మోడీషా మ్యాజిక్కే కారణమన్న విమర్శలు, అభిప్రాయాలూ వెల్లువలా వ్యక్తమయ్యాయి. అందుకు గడ్కరీ స్వయంకృతం కూడా కొంత వరకూ కారణమన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లోనే వ్యక్తమైంది. మోడీ కేబినెట్ లో స్వతంత్రంగా వ్యవహరించే ఏకైక మంత్రిగా గడ్కరీకి తిరుగులేని గుర్తింపు ఉంది. ఆ స్వతంత్ర వైఖరే మోడీ, షా ద్వయానికి రుచించలేదని పరిశీలకులు అంటారు. మోడీ ప్రమేయం లేకుండానే బీజేపీయేతర రాష్ట్రాలలో జాతీయ రహదారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం, రైల్వే లైన్లకు ఓకే చెప్పేయడం వంటి చర్యలతో మోడీ షా ద్వయానికి గడ్కరీ దూరమయ్యారని అంటారు.

ఆ కారణంగానే ఆయనకు ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోయింది. ఆ అసంతృప్తితోనే రాజకీయాలంటే అధికారమేనా, సేవ కాదా అంటూ నిర్వేదంతో వైరాగ్యం ఒలికేలా మాట్లాడారు గడ్కరి. దీంతో పార్టీలో ఆయన ఎగ్జిట్ కు ఆయనే బాటలు వేసుకున్నట్లైంది. అత్యంత కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం కోల్పోయారు. ఇది ఆయనలో అసంతృప్తిని మరింత పెంచింది.

ఈ నేపథ్యంలోనే గడ్కరీ పార్టీ మారుతారంటూ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతారన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. దీంతో గడ్కరీ ఆ ప్రచారానికి తెర దించాలని భావించారు. అందుకే తాను పార్టీ మారే ప్రశక్తే లేదనీ, బీజేపీలోనే కొనసాగుతాననీ స్పష్టం చేశారు. అయినా తాను పార్టీ మారడమేమిటి? మారితే అది కూడా కాంగ్రెస్ లో చేరడమేమిటని ఆశ్చర్యపోయారు. చావనైనా చస్తా కానీ కాంగ్రెస్ లో మాత్రం చేరనని కుండబద్దలు కొట్టేశారు. అయినా ఇప్పుడేమిటి..  దివంగత కాంగ్రెస్ నేత, తనకు స్నేహితుడు అయిన శ్రీకాంత్ జిచ్కార్ చాలా కాలం కిందటే తనను కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఆహ్వానించారని గడ్కరీ చెప్పారు. అప్పుడే ఆయనకు బావిలో దూకి చస్తాను కానీ కాంగ్రెస్ గూటికి మాత్రం చేరనని ఆయనకు స్పష్టం చేశానని గడ్కరీ వివరించారు.  కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తనకు నచ్చవన్నారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి, ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  

By
en-us Political News

  
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.