ఏఐ వ‌ల్ల ఐటీ జాబ్స్ పోతాయా? వ‌స్తాయా?

Publish Date:Apr 27, 2026

Advertisement

ఏఐ వ‌ర్సెస్ ఐటీ. ఐటీలో ఏఐ వ‌ల్ల ఉద్యోగాలు పోతాయా?  ప్ర‌స్తుతం పోతున్న ఉద్యోగాలు ఎందువ‌ల్ల పోతున్నాయ్? అస‌లు ఐటీ రంగంపై ఏఐ ఎఫెక్ట్ ఎంత‌?  అన్న ప్రశ్నలు అందరినీ ఆందోళనకు, అయోమయానికీ గురి చేస్తున్నాయి.  ఐటీ రంగంలో ఏఐ ప్రభావంపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే..  ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వ‌రూప‌- స్వభావాలు మారిపోతాయంటున్నారు. ఉద్యోగాల ముప్పు ఎవరికి అంటే..  ముప్పు ఎవరికి? అంటే, రొటీన్ పనులు చేసేవారు, కేవలం కోడింగ్ మాత్రమే వచ్చి లాజిక్ తెలియని వారు.  డేటా ఎంట్రీ స్థాయి పనులు చేసేవారికి  కొలువుల ముప్పు పొంచి ఉంది.

ఇక ఐటీ వల్ల ఎవరికి లాభం? అని ప‌రిశీలిస్తే.. ఏఐని ఒక సాధనంగా వాడుకుంటూ తమ నైపుణ్యాలను పెంచుకునే  వారికి ఏఐ  వరంగా మారుతుంది. ఉదాహరణకు..  గతంలో ఒక సాఫ్ట్‌వేర్ రాయడానికి వారం పట్టే పని, ఇప్పుడు ఏఐ సాయంతో రెండు రోజుల్లోనే నాణ్యంగా పూర్తి చేయవచ్చు. ఇక ప్రస్తుతం ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి? అని చూస్తే.. ప్రస్తుతం ఐటీ రంగంలో జరుగుతున్న లేఆఫ్స్‌కు కేవలం ఏఐ మాత్రమే కారణం కాదు. దీని వెనుక ఇతర కీలక కారణాలు ఉన్నాయి. అతిగా నియామకాలు కూడా ఒక రీజ‌నే అంటారు మార్కెట్ ఎన‌లిస్టులు. కోవిడ్ సమయంలో డిజిటల్ అవసరాలు పెరగడంతో కంపెనీలు అవసరానికి మించి ఉద్యోగులను తీసుకున్నాయి. ఇప్పుడు ఆ డిమాండ్ తగ్గడంతో వారిని తొలగిస్తున్నాయి.

ఆర్థిక మాంద్యం భయాలు కూడా మరో కార‌ణంగాచెబుతున్నారు.  అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి వల్ల ప్రాజెక్టులు తగ్గిపోయాయి. ఐటీ కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తీసేస్తున్నాయి. నైపుణ్యాల అసమతుల్యత విష‌యానికి వ‌స్తే..  పాత టెక్నాలజీలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు మూతపడుతున్నాయి. క్లౌడ్, ఏఐ, డేటా సైన్స్ వంటి కొత్త టెక్నాలజీల్లో నైపుణ్యం లేని వారు వెనకబడిపోతున్నారు.

ఐటీ రంగంపై ఏఐ ఎఫెక్ట్ ఎంత?  అని  ఎన‌లైజ్ చేస్తే.. ఐటీ రంగంపై ఏఐ ప్రభావం మూడు ప్రధాన దశల్లో ఉంటుంది. వాటిలో ఒక‌టి ఉత్పాదకత పెరగడం. గిట్‌హబ్ కోపైలట్  వంటి టూల్స్ వల్ల డెవలపర్లు వేగంగా కోడ్ రాయగలుగుతున్నారు. దీనివల్ల కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది.

రెండోది..  క్వాలిటీ అస్యూరెన్స్. టెస్టింగ్ విభాగంలో ఏఐ పాత్ర చాలా పెరిగింది. మ్యాన్యువల్ టెస్టింగ్ చేసేవారి అవసరం తగ్గిపోతోంది.  ఇక మూడోది.. కొత్త ఉద్యోగాల సృష్టి. ఏఐ వల్ల  ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ఎథిక్స్ నిపుణులు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ వంటి సరికొత్త కెరీర్ అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేయదు..  కానీ ఏఐని వాడటం తెలిసిన వ్యక్తి మిమ్మల్ని రీప్లేస్ చేస్తాడు. ప్రస్తుత ఐటీ ఉద్యోగులు కేవలం కోడింగ్‌కు పరిమితం కాకుండా.. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని, ఏఐ టూల్స్‌ను ఉపయోగించుకునే నైపుణ్యాన్ని పెంచుకుంటే ఇక ఉద్యోగ భయం అక్కర్లేదు. ఐటీ రంగం ఎప్పుడూ మార్పులకు లోనవుతూనే ఉంటుంది, ఇది కూడా అందులో ఒక భాగమే అంటారు నిపుణులు.

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.