థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి జనసేన అవకాశం ఇస్తుందా?

Publish Date:Oct 14, 2022

Advertisement

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి.. ఎంత వేగంగా రాజకీయాలలో ఒక వెలుగు వెలిగారో.. అంతే వేగంగా మసకబారిపోయారు. వైసీపీ తరఫున గొంతు చించుకుని మరీ ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడి... ఆ పార్టీ అధికారంలోకి రాగానే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవి సంపాదించిన పృధ్వికి ఆ పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

నోటి దురుసు కారణంగా వచ్చిన పదవి మళ్లీ అదే నోటి దురుసు కారణంగా పోయిందని అప్పట్లో వైసీపీ వర్గాల్లోనే సెటైర్లు పేలాయి.  ఏది ఏమైతేనేం అత్యంత అవమానకరమైన రీతిలో ఆయన పదవినే కాదు పార్టీలో స్థానాన్నీ కోల్పోయారు. సరిగ్గా థర్టీ ఇయర్స్ పృధ్వి ఏ ఆరోపణలతోనైతే పదవీ చ్యుతుడయ్యాడో.. సరిగ్గా అవే ఆరోపణలను ప్రస్తుత మంత్రి అంబటి, మాజీ మంత్రి అవంతి కూడా ఎదుర్కొన్నారు. అయితే వారిపై ఈగ కూడా వాలనీయని జగన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్విపై మాత్రం కఠిన చర్యలు తీసుకున్నారు. అంతే కాదు.. మళ్లీ పార్టీలో ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. పూర్తిగా పక్కన పెట్టేశారు.

దీంతో పృథ్వి పృధ్వీ.. తాను వైసీపీలో చేరి తప్పు చేశానని ఇటీవల మీడియా ముఖంగా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే జనసేన తరఫున పని చేయడానికి సిద్ధమనీ, జగన్ పార్టీలోని అక్రమార్కుల గుట్టు బయటపెడతాననీ కూడా సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ చెంతకు చరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు.. వైసీపీలో చేరడమనే పొరపాటు తన జీవితాన్నే తల్లకిందులు చేసేసిందని పృధ్వి భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆ పొరపాటు సరిదిద్దుకోవాలంటే జనసేనే సరైన వేదిక అని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేన గూటికి చేరి అవకాశం లభిస్తే తాడేపల్లి గూడెం నుంచి   పోటీ చేయాలని పృధ్వి భావిస్తున్నారని ఆయన మాటలను బట్టే అవగతమౌతుంది. తాడేపల్లి గూడెంలో అయితే తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గణనీయంగా ఉండటం కలిసి వస్తుందన్నది ఆయన భావనగా పరిశీలకులు చెబుతున్నారు. మరి జనసేన ఫృధ్విని దరి చేర్చుకుంటుందా? పోటీకి అవకాశం ఇస్తుందా? అంటే దానికి సమాధానం కాలమే చెప్పాలి. 

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.