ఈ విషయాలు తెలుసుకుంటే చాలు.. భార్యాభర్తల మధ్య ఎంత గొడవ జరిగినా పరిష్కారమవుతుంది..!

Publish Date:Sep 9, 2025

Advertisement

 

 

రెండు వేర్వేరు కుటుంబాలలో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం పేరుతో ఒక్కటవుతారు. అయితే మూడు ముళ్లు పడినంత సులువుగా ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు, అభిప్రాయాలు కలవవు.  వివాహం తర్వాత భార్యాభర్తలు ఎన్నో విషయాలను సర్దుబాటు చేసుకుంటూ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భిన్న దృవాల్లాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో ఒక గొడవ, వాదన రావడం చాలా సహజం. అయితే ఎలాంటి వాదనలు జరిగినా, ఎంత గొడవలు అయినా సరే.. అవి సులువుగా పరిష్కారం కావాలన్నా.. భార్యాభర్తల బంధం ఎప్పటికీ దృఢంగా ఉండాలన్నా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.  ఇవి తెలుసుకుని అర్థం చేసుకుంటే ఆ బంధం ఇక సేఫ్ జోన్ లో ఉన్నట్టే.. భార్యాభర్తలు కొట్టుకునే స్టేజ్ కు వెళ్లినా సరే.. ఆ తర్వాత ఇద్దరూ హాయిగా కలిసిపోతారు.  ఇంతకీ భార్యాభర్తలు ఇద్దరూ తెలుసుకుని, అర్థం చేసుకోవాల్సిన ఆ 5 విషయాలు ఏంటంటే..

మాట్లాడటం ఆపకూడదు..

ఎంత పెద్ద గొడవ జరిగినా భాగస్వామితో మాట్లాడటం మానేయకూడదు. మాట్లాడటం మానేయడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా భాగస్వామితో మాట్లాడవద్దని సలహా ఇచ్చినా సరే.. వారి మాటలు పట్టించుకోకుండా భాగస్వామితో మాట్లాడాలి.  గొడవ కారణంగా కోపం ఉంటే..  కోపం తగ్గిన వెంటనే.. కూర్చుని  భాగస్వామితో  మాట్లాడాలి.  సమస్య పెరగకుండా ఉంటుంది.

తప్పులను ఎత్తి చూపడం మానుకోవాలి..

గొడవ జరిగితే ఒకరినొకరు నిందించుకోవడం ఎక్కువమంది చేసే పని . కానీ ఇలా  నిందించుకుంటే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. "ముఖ్యంగా నువ్వు ఇలా చేసావు", "నీ వల్లే ఇలా జరిగింది"  లాంటివి గొడవను పెంచుతాయి. కాబట్టి అలాంటి మాటలు అనకూడదు.

సమయం తీసుకోవాలి..

చాలా మందికి గొడవ తర్వాత విరామం అవసరం అవుతుంది.  కాబట్టి వారికి సమయం ఇవ్వాలి.  కోపంతో ఎప్పుడూ ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. కోపంతో తీసుకున్న నిర్ణయం  జీవితంలో చాలా పెద్ద సమస్యలు తెస్తుంది.  గొడవ తర్వాత ఎప్పుడూ టైం తీసుకొని ఆలోచించి, ఆపై మాట్లాడాలి.  విషయం ప్రశాంతమైన తర్వాత మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకోండి.

పాత విషయాలను పునరావృతం చేయవద్దు..

భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు తరచుగా ఏం చేస్తారంటే..  నువ్వు ఇంతకు ముందు ఇలాగే చేసావు, గతసారి కూడా అదే తప్పు చేశావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావు.. ఇలాంటి మాటలను గొడవలో ప్రతిసారీ పాత తప్పులను ఎత్తి చూపడం వల్ల ఒకరి మీద మరొకరికి నమ్మకం  దెబ్బతింటుంది. ప్రస్తుతం ఏం జరిగింది?  దాని గురించి మాత్రమే మాట్లాడాలి. దాని గురించే డిస్కస్ చేయాలి.  పాత విషయాలు ప్రస్తావించి గొడవను పెంచేలా చేయకూడదు.

క్షమించడం,  క్షమాపణ చెప్పడం..

 అహంకారం భార్యాభర్తల బంధాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అవసరమైనప్పుడు క్షమించడం,  క్షమాపణ చెప్పడం సంబంధంలో బలాన్ని, బంధాన్ని పదిలంగా ఉండేలా చేస్తుంది. క్షమించడం, క్షమాపణ చెప్పడం ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకున్నట్టు కాదు.  ఇది పరిణితి చెందిన వ్యక్తిత్వానికి సంకేతం. కాబట్టి కొన్నిసార్లు తలవంచి క్షమాపణ చెప్పడంలో తప్పు  లేదు.  భాగస్వామి క్షమాపణలు కోరుతుంటే వారిని క్షమించడం కూడా చాలా ముఖ్యం.  మూడవ వ్యక్తి సలహాలతో ఎప్పుడూ భాగస్వామిని దూరం పెట్టడం చేయకూడదు.  ఇది చాలా తప్పు.

                                       *రూపశ్రీ 

By
en-us Political News

  
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.