ట్రోఫీ వైఫ్.. పెళ్లైన ఆడవాళ్లలో చాలామంది పరిస్థితి ఇదే.. మీరూ ఇంతేనా..!
Publish Date:Nov 11, 2025
Advertisement
ట్రోఫీ భార్య అంటే.. ట్రోఫీ భార్య అంటే.. భర్త కేవలం భార్య బాహ్య రూపానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. అతని దృష్టిలో భార్యకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. మూడు ముళ్లు వేసి పెళ్లి పేరుతో తన ఇంటికి తీసుకుని వచ్చి భార్యను కేవలం తన అవసరానికి వాడుకోవడం చేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న బార్యలు అందరూ ట్రోఫీ భార్యలే. ట్రోఫీ భార్యల పరిస్థితులు.. భార్యాభర్తల బంధంలో ఏ నిర్ణయం తీసుకున్నా భార్యాభర్తలు ఇరువురూ కలిసి తీసుకోవాలి అనుకుంటారు. భర్త అయినా, భార్య అయినా తమ పార్ట్నర్ తమను కూడా అబిప్రాయం అడగాలని అనుకుంటారు. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం ఇలాంటి ప్రాధాన్యతకు నోచుకోరు. భర్త ఏ నిర్ణయం తీసుకున్నా తన సొంతంగా తీసుకుంటాడు. భార్య అభిప్రాయంతో కానీ, భార్య ఆలోచనలతో కానీ అతనికి ఆసక్తి ఉండదు. భార్యాభర్తల బంధంలో ప్రేమ ఉండాలని చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా భర్త చూపించే ప్రేమ భార్యకు ఎంతో ముఖ్యం. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం భర్త ప్రేమకు నోచుకోరు. భర్తలు ఒక వేళ ప్రేమ చూపించినా అదంతా షో-ఆఫ్ కే.. అంటే నలుగురు చూడాలని, తనను మంచి భర్తగా ట్యాగ్ వేయాలనే కోరికతో నలుగురిలో భార్యల పట్ల ప్రేమ చూపిస్తుంటారు. భార్యాభర్తలు అంటే.. ఒకరి వల్ల మరొకరు సంతోషంగా ఉండాలి. కానీ కొందరు మాత్రం తమ సంతోషాన్ని మరచి ఇతరులకు బాగా కనిపించాలని, ఇతరుల దృష్టిలో ఏది సరైనది అయితే.. అలాగే తాము ఉండాలని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉండే భార్యలు అందరూ ట్రోఫీ భార్యలే. భర్త ఎప్పుడూ భార్యను అన్ని విషయాలలో నియంత్రణ చేస్తుంటే.. ఆ బార్య ట్రోఫీ భార్య అని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఏం మాట్లాడాలి? ఏం తినాలి? ఏ దుస్తులు ధరించాలి? ఇలా ప్రతి విషయంలో భర్త జోక్యం చేసుకుంటూ ఉంటారు. భార్య ఎమోషన్స్ ను ఎప్పుడూ పట్టించుకోకుండా కేవలం తనకు నచ్చినది జరగాలని భర్త డిమాండ్ చేస్తుంటే ఆ భార్య ట్రోఫీ వైఫ్ అని అర్థమట. వివాహం అయిన తరువాత ఆడపిల్లను కేవలం తనకు భార్య అనే కోణంలో మాత్రమే చూస్తూ ఆమెకంటూ ఎలాంటి వ్యక్తిగత జీవితం, స్పేస్ లేకుండా చేస్తుంటారు కొందరు భర్తలు. ఇలా తమను తాము కోల్పోయే భార్యలు అందరూ ట్రోఫీ వైప్ లు. *రూపశ్రీ.
ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది. వేర్వేరు ప్రాంతాలలో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం పేరుతో కలిసి జీవించడం, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకరికి ఒకరు తోడుండటం ఈ బంధాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే భార్యాభర్తల బంధంలో తమదే పై చేయి ఉండాలనే పిచ్చి ఆలోచన చాలామందిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా మగవారు భార్యల విషయంలో ఆధిపత్య ప్రవర్తన కలిగి ఉంటారు. ఈ వివాహ బంధంలో చాలామంది ఆడవారు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అదే ట్రోఫీ వైఫ్.. అసలు ట్రోఫీ వైఫ్ అంటే ఏంటి? ఇలాంటి పరిస్థితిలో ఎక్కువమంది భార్యలు ఎందుకు ఉన్నారు? ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పడానికి భార్యాభర్తల మధ్య ఉండే పరిస్థితులు ఏంటి? తెలుసుకుంటే..
http://www.teluguone.com/news/content/wife-and-husband-relationship-35-209312.html





