వరంగల్ లో మొగుడు...హైదరాబాద్ లో రెండో మొగుడు...చిక్కిన కిలాడీ లేడీ !
Publish Date:Jul 9, 2019
Advertisement
పురుషులకు ఏమాత్రం తీసిపోమంటూ మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. మరి మోసాల్లో వెనకబడ్దాం అనుకుందో ఏమో కానీ ఒక మహా ఇల్లాలు మొగుడికి తెలీకుండా రెండో పెళ్లి చేసుకుని ఏకంగా కాపురం పెట్టి షాకిచ్చింది. పెళ్లి చేసుకున్న మొగుడు వరంగల్ లో ఉండగానే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో కాపురం పెట్టింది ఈ మహా సాధ్వి. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన పూర్వాపరాలు పరిశీలిస్తే వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సీతారామపురానికి చెందిన ప్రశాంత్ రాధిక అనే యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఐదేళ్ల క్రితమే వీరి వివాహం జరిగినా కుటుంబ సభ్యుల సహాకారం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతుండేవారు. ఇక ఈ కష్టాలు పడడం ఇష్టం లేని ఆ భార్య ఆరునెలల క్రితం ఉద్యోగం చేస్తానని భర్తకు చెప్పి హైదరాబాద్ చేరుకుంది. ఎల్బీనగర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో జాబ్ చేస్తూ కొత్తపేట విజయపురి కాలనీలోని రాయల్ హాస్టల్ లో చేరింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మద్య కాలంలో తన భార్య తనతో మాట్లాడే సమయంలో మార్పును గమనించాడు తన భర్త, అనుమానిస్తే అనుమానం మొగుడు అంటారని భార్య తమ్ముడిని తీసుకుని రాధిక ఉండే హాస్టల్ వద్దకు వెళ్ళగా వారి రాకను గమనించిన రాధిక తన బంఢారం ఎక్కడ బయటపడుతుందోనని మదనపడింది. హాస్టల్ నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. అదేంటి అని ఆరా తీస్తే .. అక్కడున్న వారు జరిగిన దానిని గురించి వివరించారు. శశికుమార్‌ను పెళ్లి కూడా చేసుకుందని చెప్పడంతో షాక్ తిన్నారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధికేనా ఇలా చేసింది అని ప్రశాంత్ మదనపడ్డాడు. తనను మోసం చేసిన రాధికపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె ఇక్కడే శశికుమార్ అనే వ్యక్తితో స్నేహం ముదిరి ప్రేమ నుంచి పెళ్లికి దారితీసింది. వారిద్దరూ ఏంచక్కా పెళ్లి చేసుకున్నారు. ఏ భయం లేకుండా కాపురం కూడా చేస్తున్నారని తేలింది. ఆమెకు తన భర్త, కుటుంబం ఉందనే బెంగ లేకుండా రెండో భర్తతో జాలీగా గడుపుతుందని పోలీసులు తేల్చారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధికేనా ఇలా చేసింది అని ప్రశాంత్ మదనపడ్డాడు. తనను మోసం చేసిన రాధికపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసి సోమవారం అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.
http://www.teluguone.com/news/content/wife-and-husband-arrested-second-marriage-case-39-87915.html





