అన్న క్యాంటిన్ అంటే వైసీపీకి ఇంత వణుకెందుకు?

Publish Date:Sep 7, 2022

Advertisement

నిరుపేద అన్నార్తులకు అతి తక్కువ ధరకే పట్టెడన్నం పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం.. అన్న అని అందరూ పిలుచుకునే ఎన్టీ రామారావు పేరు మీద టీడీపీ ప్రభుత్వం ఈ క్యాంటీన్లను ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. అన్నా క్యాంటీన్ల కోసం అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు సక్రమంగా నడిచాయి. వేలాది మందికి ప్రతిరోజూ ఇంత అన్నం ముద్ద దొరికేది. అయితే.. అన్నా క్యాంటీన్లు అంటేనే వైసీపీ నేతల్లో వణుకు వచ్చేస్తోంది. టీడీపీ నేతలు ఎక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు సిద్ధమైనా వైసీపీ శ్రేణులు దాడులు, విధ్వంసాలకు దిగుతున్నారు.

అయితే.. 2019 ఎన్నికల తర్వాత ఏపీలో ఏర్పడ్డ వైసీపీ సర్కార్ అన్న క్యాంటీన్లను పట్టించుకోలేదు. దాంతో అన్నా క్యాంటీన్లను కొనసాగించాలనే డిమాండ్ అన్నార్తుల నుంచి గట్టిగా వినిపించింది. కానీ.. ప్రతిపక్షంలోకి వచ్చిన టీడీపీ ముద్ర ఈ క్యాంటీన్లపై ఉండడంతో జగన్ రెడ్డి సర్కార్ ఏ మాత్రం సహించలేకపోయింది. నిరుపేదల డిమాండ్ ఎక్కువైన క్రమంలో అన్నా క్యాంటీన్ల పేరు రాజన్న క్యాంటీన్లుగా మార్చేసి నడిపించాలని భావించింది. ఆ వెంటనే అన్న క్యాంటీన్ భవనాల రంగులు కూడా మార్చి, కొన్నాళ్ల తర్వాత వాటిని నిర్వహిస్తామని కాలయాపన చేసింది. ఆ తర్వాత క్యాంటీన్ల ఊసే లేకుండా వైసీపీ సర్కార్ చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ పేరుతో కొన్నాళ్లు అన్నదానం నిర్వహించారు. పేదల కడుపు నింపే ఆ క్యాంటీన్ అతీ గతీ ఏమైందో ఎవ్వరికీ తెలియదు.

ఏపీలోని నిరుపేదల ఆకలి తీర్చేందుకు వైసీపీ సర్కార్ కు ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించిన ప్రతిపక్ష టీడీపీ నేతలే స్వయంగా రంగంలోకి దిగారు. పలు చోట్ల సొంత నిధులతో అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు యత్నించారు. ఈ క్రమంలో మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు టీడీపీ నేతలు రెడీ అయితే.. వైసీపీ శ్రేణులు, పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఆ తదుపరి చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో అన్న క్యాంటీన్ ప్రారంభించే సమయానికి వైసీపీ నేతలు, శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. అక్కడితో ఆగకుండా అన్న క్యాంటీన్ ను ప్రారంభించేందుకు వెళ్లిన చంద్రబాబుపై దాడికి యత్నించే దాకా పరిస్థితి వెళ్లింది.

తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వద్దకు ఆకలితో వచ్చిన నిరుపేదలపై ఆడా మగా తేడా లేకుండా పోలీసులు లాఠీలు ఝళిపించడం విమర్శలకు దారితీసింది. పేదలకు అన్నదానం చేసేందుకు వచ్చే టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇనుప ముళ్ల కంచెల, బారికేడ్లతో అడ్డుకున్నారు. ట్రాఫిక్ సాకు చూపించి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదేశారు. ఆహార పదార్థాలను బూటు కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తొక్కేశారు. తెనాలి మార్కెట్ సెంటర్ ను పోలీసులు రణరంగంలా మార్చేశారు.

ఏపీలో ఎక్కడ అన్న క్యాంటీన్ ప్రారంభం అవుతున్నా.. లేక ఇప్పటికే నడుస్తున్న చోట్ల వైసీపీ నేతలు, పోలీసులు దౌర్జన్యకాండ జరిగిపోతూనే ఉంది. టీడీపీ నేతలను అరెస్టులు చేయించడం, కేసులు పెట్టించడం లాంటివి జనంలో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. పేదల పక్షాన టీడీపీ నేతలు నిలబడుతుంటే.. వైసీపీలో రోజు రోజుకూ ఆందోళన పెరిగిపోతోందంటున్నారు. అన్న క్యాంటీన్ల కోసం వేసిన పందిళ్లను, ఫ్లెక్సీలను తొలగిస్తోంది. అన్న క్యాంటీన్లు నడిస్తే.. టీడీపీ పట్ల ప్రజల్లో సింపతీ పెరిగిపోతుందనే వణుకు వైసీపీలో వచ్చేస్తోంది. అన్నా క్యాంటీన్లకు క్యూలు కట్టి మరీ నిరుపేదలు అన్నం కోసం పోటెత్తి వస్తుంటే.. చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు ఇలా దారుణాలు, దౌర్జన్యకాండకు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్న క్యాంటీన్లు ఒక విధంగా టీడీపీకి ప్లస్ పాయింట్ గా మారితే.. వైసీపీకి పెద్ద మైనస్ పాయింట్ అవుతున్నాయనే వాస్తవం అధికార పార్టీ అస్సలు సహించలేకపోతోందంటున్నారు. అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడవడం ఇష్టం లేకే ఇలా ఎక్కడికక్కడ వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. నందమూరి నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన సొంత నిధులతో హిందూపురం నియోజకవర్గంలో 2 రూపాయలకే నిరుపేదలకు చికెన్, గుడ్డుతో కూడిన ప్రత్యే మాంసాహార భోజనాన్ని కడుపు నిండా పెడుతున్న అన్న క్యాంటీన్ 100 రోజులగా నిరాటంకంగా సాగుతుండటం పూర్తిచేసుకోవడం కొసమెరుపు.

By
en-us Political News

  
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.