వంగవీటి రంగా ఎపిసోడ్‌తో.. పవన్ తనను తాను పోల్చుకున్నారా?
Publish Date:Sep 30, 2021
Advertisement
పవన్ కల్యాణ్ మంచి ఎమోషన్‌లో ఉండాలే కానీ అనేక ఆసక్తికర విషయాలు చెబుతారు. బాగా బుక్స్ చదివే అలవాటు ఉండటం.. బాగా సమాజాన్ని, మనుషుల్ని, కులమతాల్ని, రాగాధ్వేషాల్ని, రాజకీయాల్ని విస్తృతంగా అధ్యయనం చేసిన అనుభవం ఉండటంతో.. ఏ విషయంలోనైనా చాలా స్పష్టమైన అభిప్రాయాలను, లోతైన ఆలోచనారీతులను కలిగి ఉంటారు. పలుమార్లు ఆయన ప్రసంగాల్లో పలు అంశాలను తనదైన శైలిలో విశ్లేషణాత్మకంగా మాట్లాడటం మనం చూశాం. తాజాగా, మంగళగిరి మీటింగ్‌లోనూ పవన్.. వంగవీటి రంగా ఉదంతం ప్రస్తావిస్తూ.. కొన్ని మౌళిక ప్రశ్నలను సంధించారు. టాపిక్ రంగాదేనైనా.. అందులో నర్మగర్భంగా తనకు జరిగిన ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించారని అంటున్నారు. ఇంతకీ రంగా గురించి జనసేనాని ఏమన్నారంటే.... ‘‘వంగవీటి రంగా బతికి ఉన్న రోజుల్లో నెల్లూరు, చెన్నైలో ఉండేవాడిని. నా కజిన్ మెహర్ రమేశ్ గుడ్ల వల్లేరులో చదువుకునే వాడు. ఒకసారి ఇంటికి వచ్చేశాడు. సెలవులు కాదుకదా ఎందుకు వచ్చావు? అని అడిగితే.. కులాల గొడవలు జరుగుతున్నాయి.. పాలిటెక్నిక్ కాలేజీ మూసేస్తే వచ్చానని చెప్పాడు. నాకు అప్పటి నుంచి ఈ గొడవలేంటి? ఎందుకు ఉంటాయి? అనేది అర్థం కాలేదు. ఆ తర్వాత నేను అధ్యయనం చేయటం మొదలుపెట్టాను. రంగా చనిపోయినప్పుడు విజయవాడ నెల రోజులు తగలబడిపోతున్నది చూశాను. అవన్నీచూసి.. ఎందుకిలా అయిపోయిందని అనుకున్నా. .తర్వాత తర్వాత అర్థం చేసుకున్న కొద్దీ.. అందరికి అర్థమైందే నాకు అర్థమైంది’’ ‘‘నాకు వచ్చిన మౌలికమైన ప్రశ్న ఏమంటే.. రంగా సభలు పెడుతున్నప్పుడు క్రిష్ణా నది తీరమంతా నిండిపోయేదని. మరి.. అలాంటి రంగా.. అప్పటి రాష్ట్ర పాలకుల నుంచి నాకు ప్రాణ భయం ఉందని ఆయన సత్యాగ్రహం చేస్తుంటే.. నాకు వచ్చిన సందేహం ఏమంటే.. క్రిష్ణా నది తీరమంతా నిండిపోయేంత జనం వచ్చారు కదా? వీరిలో రోజుకు వంద మంది ఆయన పక్కన ఎందుకు కూర్చోలేకపోయారు? అనిపించింది. ఏమై పోయారు వీరు? ఒక సభకు వచ్చారు..అలాంటి వారు ఆయన పక్కన కూర్చొని ఎందుకు రక్షించుకోలేకపోయారు? అన్నది ఈ రోజుకు నన్నుపట్టి పీడించే ప్రశ్న’’ అని అన్నారు పవన్‌కల్యాణ్. నిజమే. అంతమంది అభిమానులున్న రంగాకు.. రోజుకు వందమంది రక్షణగా ఉండిఉన్నా.. ఆయన బతికుండే వారుగా? పవన్ ప్రశ్న సరైనదే. సరే రంగా విషయం వదిలేద్దాం. పవన్‌కల్యాణ్ సంగతికి వద్దాం. రంగాలానే పవన్‌కల్యాణ్‌కు సైతం విశేష అభిమానగణం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పీకేకు ఉన్నంత మంది ఫ్యాన్స్ మరే సినీ హీరోకీ, పొలిటికల్ లీడర్‌కీ లేరు. 150 సీట్లకు పైగా గెలిచిన జగన్ కంటే కూడా పవన్‌కే ఎక్కువ సంఖ్యలో డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారనేది నిజం. జగన్‌కు ఓటర్లు ఉన్నారేమో గానీ, అభిమానులు మాత్రం పవన్‌కే చాలా చాలా ఎక్కువంటారు. ఇక రంగా చావును, పవన్ ఓటమిని పోల్చి చూస్తున్నారు విశ్లేషకులు. పవన్ అన్నట్టే.. రంగాకు రక్షణగా అభిమానులు ఉండి ఉంటే.. అన్నట్టే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్‌కు సపోర్ట్‌గా ఫ్యాన్స్ ఓట్లేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండకపోయేది కదా అంటున్నారు. జనసేనాని తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయి ఇంతటి దారుణ పరాభవాన్ని మూట కట్టుకోకపోయేవారుగా అని ప్రశ్నిస్తున్నారు. రంగాకు జనం తోడుండి ఉంటే.. అన్నట్టుగానే.. పవన్‌కు ఫ్యాన్స్ ఓట్లేసి గెలిపించి ఉండుంటే.. అంటున్నారు. రంగా విషయంలో పవన్ కల్యాణ్ లేవనెత్తిన మౌళిక ప్రశ్న.. జనసేనాని అభిమానుల విషయంలోనూ అప్లై అవుతుందని విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/why-vangaveeti-ranga-topic-from-pawan-kalyan-25-123793.html





