టీఆర్ఎస్ సమస్యేమిటి?..మునుగోడు అభ్యర్థిపై ఎందుకీ సస్పెన్స్?

Publish Date:Sep 12, 2022

Advertisement

మునుగోడు టీఆర్ఎస్ కోరుకోని ఉప ఎన్నిక నిజమే. అంత మాత్రాన గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఇంత మల్లగుల్లాలు పడటమేమిటి? పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా రంగంలోనికి దిగినా అసమ్మతి చల్లారకపోవడమేమిటి? దేశ రాజకీయాలలోనే చక్రం తిప్పడానికి సిద్ధపడిన నాయకుడు.. సొంత రాష్ట్రంలో, సొంత పార్టీ అభ్యర్థిని అదీ ఒక ఉప ఎన్నికలో పార్టీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఇంత సమయం తీసుకోవడమేమిటి?

పార్టీలో పరిస్థితి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా లేదనడానికి మునుగోడు అభ్యర్థి ఎన్నికలో తెరాస పడుతున్న ఇబ్బందులు, బుజ్జగింపులకు లొంగని అసమ్మతులే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి అందులో సందేహం లేదు. అంతర్గత కుమ్ములాటలతో నిత్యం సతమతమయ్యే కాంగ్రెస్ కూడా ఏమంత కష్టపడకుండానే, అసమ్మతి భగ్గుమనకుండానే తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేసింది. అయితే  అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతోంది.

మునుగోడులో గెలిచి తీరుతామంటున్న టీఆర్ఎస్‌కు అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోతుండటమే ఆ పార్టీ దయనీయ స్థితికి నిలువెత్తు నిదర్శనమని చెబుతున్నారు. . కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని పార్టీ గతంలో నిర్ణయించింది. మునుగోడులో జరిగిన బహిరంగసభలో ఈ విషయాన్ని కేసీఆర్ అధికారికంగా ప్రకటించాలని కూడా భావించారు. కానీ పార్టీలో అసమ్మతి భగ్గుమనడంతో వెనుకంజ వేశారు.

 అసలు అభ్యర్థి ప్రస్తావనే లేకుండా ప్రసంగం ముగించేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై పై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవ్వడంతో కేసీఆర్ అభ్యర్థి ప్రకటన విషయంలో వెనుకడుగు వేశారని పరిశీలకులు చెబుతున్నారు.  మునుగోడులో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ నుంచి  కర్నె ప్రభాకర్ తో పాటు మాజీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. మొత్తం మీద మునుగోడులో బీసీ అభ్యర్థినే నిలబెట్టాలన్న డిమాండ్ టీఆర్ఎస్ లో రోజు రోజుకూ బలపడుతోంది.  అయితే  కేసీఆర్ మాత్రం  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంవైపే మొగ్గు చూపుతున్నారనీ,  కూసుకుంట్ల అభ్యర్థిత్వం విషయంలో  పార్టీ నేతలను బుజ్జగించేందుకు ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  

By
en-us Political News

  
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.