వైసీపీ మళ్లీ ఛాన్స్ ఎందుకివ్వాలి?

Publish Date:Oct 14, 2022

Advertisement

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, అధికార పీఠం ఎక్కాలని పార్టీలన్నీ రకరకాల వ్యూహాలతో జనం ముందుకు వస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పోటీ పడుతున్నాయి. తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారం వెలగబెడుతున్న వైసీపీ కూడా అధికారపీఠాన్ని అంటిపెట్టుకుని కూర్చోవాలని ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతోంది. మనిషి మాంసం రుచిమరిగిన పులిలా అధికారం రుచి మరిగిన వైసీపీ కుర్చీ పట్టుకుని వేళ్లాడడం కోసం ఫీట్ల మీద ఫీట్లు చేస్తోంది.

ఒక్క ఛాన్స్ అంటూ ఊరూరా తిరిగి మరీ వేడుకుని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి సర్కార్ ఈ మూడున్నరేళ్లలో తమకు ఒరగబెట్టిందేంటనే సూటి ప్రశ్న జనం నుంచి దూసుకొస్తోంది. వైసీపీ పాలన ఏమాత్రం మెప్పించలేదని జనం చెబుతున్నారు. వైసీపీ అధినేతకు భయపడో, మరో కారణం వల్లో అంత చేశాం, ఇంత చేశాం అంటూ పైకి చెబుతున్నప్పటికీ జగన్ పాలనపై ఆ పార్టీ నేతల అనుచరులు కూడా అక్కడక్కడా పెదవి విరుస్తున్న సందర్భాలు ఉంటున్నాయి.

అభివృద్ధిని పట్టించుకోకుండా, సంక్షేమ పథకాల పేరుతో తమను మభ్యపెట్టిన జగన్ సర్కార్ పై ప్రజల్లో మబ్బులు వీడిపోతున్నాయంటున్నారు. ఏపీలో అభివృద్ధి నేతిబీరలో నెయ్యి చందంగా మారిందంటున్నారు. నిజానికి జగన్ పాలనపై ఏపీని ఏ సామాజికవర్గమూ సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ సర్కార్ ఏపీలో వస్తున్న ఆదాయాన్ని దేనికి ఖర్చు పెడుతోంది? లెక్కకు మించి తెస్తున్న అప్పుల సొమ్మును ఎందుకు వినియోగిస్తోందో తెలియని అయోమయస్థితి నెలకొందంటున్నారు. జగన్ రెడ్డి సర్కార్ తెచ్చిన అప్పుల్ని తీర్చే దెలా? అనే ప్రశ్న సామాన్యులు మొదలు రాజకీయ పండితులు, మేధావుల దాకా ప్రతి ఒక్కరూ వేస్తున్నారు.

విభజిత ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వ పాలన ముగిసే నాటికి 3 లక్షల కోట్లు అప్పు ఉండేది. ఏపీకి అప్పుడు 16 వేల 78 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. లోటు బడ్జెట్ తో ఏర్పాటైన నవజాత ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు టీడీపీ పాలనా కాలం పూర్తయ్యే సరికి అప్పటి సీఎం చంద్రబాబు సర్కార్ 3 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. అయితే.. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు అహర్నిశలు కృషిచేశారు. అమరావతి రాజధాని పేరిట సరికొత్త నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు.

కానీ.. జగన్ సర్కార్ పాలన మూడేళ్లలో ఏపీ అప్పులను 7 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లింది. ఇంత భారీగా చేసిన అప్పుల్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తీర్చ గలుగుతుందా? అనే సందేహాలు ఆర్థిక రంగ నిపుణుల నుంచి వస్తున్నాయి. వైసీపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే మరో రెండేళ్లు ఏపీలో అధికారంలో ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉచిత పందేరాల నెపంతో అప్పటికి ఏపీ అప్పును దాదాపు 10 లక్షల కోట్లకు పెంచేసే అవకాశాలు లేకపోలేదనే ఆందోళన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. తలకు మించి వైసీపీ సర్కార్ చేసిన అప్పుల భారాన్ని ‘కల్లు తాగినోడే కట్టాలి తాటిచెట్టు పన్ను’ చందంగా వైసీపీకి ఓటు వేసి గెలిపించిన జనమే భరించక తప్పదంటున్నారు.

ఇంత అప్పు చేసినా.. ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి ఆధారిత, ఆదాయం వచ్చే  కార్యక్రమాలకు వైసీపీ సర్కార్ ఖర్చు చేయకపోవడం గమనార్హం. విద్యుత్, రవాణా చార్జీలు పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేసిన దుర్మార్గానికి పాల్పడింది. ఏపీకి ఇలా ప్రజలపై వేసిన పన్నుల రూపంలో వస్తున్న ఆదాయమే తప్ప మరే ఇతర మార్గాల్లోనూ ఆదాయం లేని వైనాన్ని జనం గమనిస్తున్నారు.

ఏపీలోని 66 కులాలకు 56 కార్పొరేషన్లు పెట్టి, వాటికి నిధులు ఇవ్వలేదు. దాంతో కార్పొరేషన్లు పెట్టి ప్రయోజనం ఏమిటనే సూటి ప్రశ్న ఆయా సామాజికవర్గాల నుంచి ఎదురవుతోంది. పంచాయతీలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకుంటోంది. దీంతో ఆయా పంచాయతీల సర్పంచ్ లు స్థానికంగా పనులు చేసేందుకు భిక్షాటన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంపైనా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రామ స్థాయిలో జగన్ పాలనపై విమర్శలు వస్తున్నాయి. గతంలో వైసీపీకి గ్రామ స్థాయిలోనే ఓట్లు అధికంగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రజలే ఇప్పుడు జగన్ పార్టీకి ఎందుకు మళ్లీ ఛాన్సివ్వాలని చర్చించుకుంటున్నారు.

మూడు రాజధానుల ఏర్పాటు సాకుతో ఏపీకి అసలు రాజధాని కూడా లేకుండా చేసిన జగన్ సర్కార్ పై జనం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మద్య నిషేధం పేరు చెప్పి గతంలో ఓట్లు అడిగిన జగన్ ఇప్పుడు మద్యం ధరలను పెద్ద ఎత్తున పెంచేసి సొంత బ్రాండ్లు పెట్టి జనం నుంచి లక్షల కోట్లు దోచేస్తున్న వైనాన్ని ఎక్కడికక్కడ చెప్పుకుంటున్నారు. ‘ఏపీలో ఏమున్నది గర్వకారణం ఏ రోడ్డు చూసినా గోతులు.. గతుకుల మయం’ అని ప్రజలు వైసీపీ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ఏ విధంగా చూసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు ఎందుకు వేయాలనే ప్రశ్న జనం నుంచి వస్తోంది.

By
en-us Political News

  
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.