Publish Date:Jan 25, 2022
మీరెప్పుడైనా వాఘా సరిహద్దుకు వెళ్లారా? అది ఇండియా-పాకిస్తాన్ బోర్డర్. అట్నుంచి ఇటు చీమను కూడా రానివ్వరు. సరిహద్దులు మూసేసి ఉంటాయ్. టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఏమాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారు. భద్రతా బలగాలకు ఒళ్లుమండితే.. కాల్చిపారేస్తారు కూడా. ఇదంతా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. కానీ, గుడివాడలో పోలీసులు, వైసీపీ శ్రేణులు పాకిస్తాన్ బోర్డర్ మాదిరి ఓవరాక్షన్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గుడివాడ దేశంలో అంతర్భాగం కాదా? అక్కడ అడుగుపెట్టే హక్కు ప్రజలందరికీ లేదా? టీడీపీ, బీజేపీని గుడివాడలో నిషేధించారా? అని ప్రశ్నిస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు.
మొన్నటికి మొన్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వస్తే.. వైసీపీ వాళ్లు దాడులకు తెగబడి భయాందోళనలు సృష్టించారు. టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారు. తెలుగుదేశం నాయకులను కొట్టారు. బోండా ఉమా కారు అద్దాలు పగలగొట్టారు. టీడీపీ నాయకులపై రాళ్ల దాడి చేసి.. గుడివాడలో గుండాయిజం చేశారు.
మొన్న టీడీపీ.. ఇవాళ బీజేపీ. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న బీజేపీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు వాహనాల్లో బయల్దేరగా పోలీసులు అడ్డుతగిలారు. గన్నవరం సమీపంలోని నందమూరు అడ్డురోడ్డు దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకలకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమని బీజేపీ నేతలు మండిపడ్డారు.
కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్‌లో జరిగిన కేసినో వల్లే గుడివాడలో ఇంతటి హైటెన్షన్. పాకిస్తాన్ మాదిరి అల్లకల్లోలం అవుతోంది. కె కన్వెన్షన్‌లో అసలేమీ జరగనప్పుడు టీడీపీని కానీ, బీజేపీని కానీ.. అడ్డుకోవడం ఎందుకు? వైసీపీ మూకల రాళ్ల దాడి ఇంకెందుకు? ఖాకీల బలప్రయోగం అవసరమేముంది? అని నిలదీస్తున్నారు. అంటే, కొడాలి కన్వెన్షన్‌లో ఏదో జరిగిందనేగా? అక్కడ కేసినో ఏర్పాటు చేసినట్టు పరోక్షంగా ఒప్పుకున్నట్టేగా? లేదంటే ఎందుకంత భయం? ఇందుకిలా అడ్డగింపు? వెళ్లే వాళ్లను వెళ్లనిస్తే పోతుందిగా.. వాళ్లే అక్కడ ఏముందో చూసి చెబుతారుగా? గుడివాడలోనే అడుగుపెట్టొద్దంటే ఎట్టా? అని మండిపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-that-much-high-tension-in-gudiwada-25-130716.html
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.