‘గ్రేటర్’లో పార్టీని బాబు గాలికొదిలేశారా?

Publish Date:Oct 5, 2020

Advertisement

ఇప్పటివరకూ ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్షించని బాబు

 

రమణపై తమ్ముళ్ల తిరుగుబాటు

 

బాబు ఇంటివద్దనే తమ్ముళ్ల ధర్నా
          

రాజకీయాల్లో హత్యలుండవు. అన్నీ ఆత్మహత్యలేనన్నది, తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మౌనం స్పష్టం చేస్తోంది. ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇంకోవైపు దెబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక,  మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముంచుకొస్తున్నా... ఇప్పటిదాకా చంద్రబాబు సమీక్షించని వైనంపై, తెలంగాణ తమ్ముళ్లలో ఆగ్రహం క ట్టలు తెంచుకుంటోంది. కరోనా సీజన్ మొదలయినప్పటి నుంచీ, హైదరాబాద్‌లోనే ఉంటున్న బాబు.. ఇప్పటివరకూ ఈ మూడు ఎన్నికలపై కనీస సమీక్ష నిర్వహించకపోవడంపై, పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అటు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రమణ నిర్లిప్తత కూడా తోడవడంతో, ఎటు పోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో తెలంగాణ తమ్ముళ్లు కనిపిస్తున్నారు. ప్రధానంగా..కేసుల కారణంతో, కేసీఆర్‌తో బాబు యుద్ధం చేసే పరిస్థితి లేదన్న మానసిక భావన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.

 

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా మంచుకువస్తున్నాయి. తొలుత గ్య్రాడ్యుయేట్ ఎన్నికలు, ఆ తర్వాత గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. అయితే, వీటిపై  దృష్టి సారించి స్థానిక నేతలతో సమీక్షించాల్సిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ చేతులెత్తేశారు. పోనీ.. కరోనా సీజన్ నుంచీ హైదరాబాద్‌లోనే ఉన్న, అధినేత చంద్రబాబు నాయడు ఏమైనా వీటిపై పార్టీ నేతలతో సమీక్షించారా, అంటే అదీ లేదు.

 

ఇప్పటికే అన్ని పార్టీలూ ఎన్నికల రంగంలోకి దిగాయి. చిన్నా చితకా పార్టీలు కూడా వ్యూహ రచనలో మునిగిపోయాయి. కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించాయి. అధికార టీఆర్‌ఎస్, హైదరాబాద్‌లో డివిజన్ల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహిస్తోంది. కానీ టీడీపీ మాత్రం ఇప్పటిదాకా గ్రేటర్ సహా, ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించలేదు. దానితో తమ పార్టీ అసలు బరిలో ఉందా? లేదా? అన్న సందిగ్ధం తమ్ముళ్లను వేధిస్తోంది.

 

నిజానికి గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో 25 డివిజన్లలో సెటిలర్ల ప్రభావం తీవ్రంగా ఉంది. మరో 19 డివిజన్లలో విజయంలో వారిదే కీలక పాత్ర. గత ఎన్నికల్లో టీడీపీకి ఒక్క స్థానమే వచ్చినా కాంగ్రెస్-బీజేపీని వెనక్కి నెట్టేసి అనేక డివిజన్లలో టీడీపీనే రెండో స్థానం సాధించిన విషయాన్ని తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు.  ఆ ప్రకారంగా గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ 4,39,047 ఓట్లతో 13.11 శాతం ఓట్లు సాధించింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీనే రెండో స్థానంలో ఉంది. అయినా ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునే నాయకత్వం లేకుండా పోయిందన్నది తమ్ముళ్ల ఆవేదన.

 

స్వయంగా చంద్రబాబు నాయుడే, నగరంలో  కాడి కిందపడేశారన్న భావన వారిలో ఉంది. ఒకవేళ టీడీపీకి ఓటేసి గెలిపిస్తే, గెలిచిన కార్పొరేటర్లు తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరరన్న గ్యారంటీ లేదన్న భావన జనంలో ఉందంటున్నారు. అందుకే సెటిలర్లు ఉన్న డివిజన్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని విశ్లేషిస్తున్నారు.  అలాంటి అభిప్రాయం తొలగించేందుకు,  ఏ స్థాయిలోనూ ప్రయత్నం జరగడం లేదని చెబుతున్నారు.

 

నగరంలో పార్టీకి కొన్ని ప్రాంతాల్లో అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ, చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, పార్టీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోందంటున్నారు. నిజానికి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్-బీజేపీలో చేరిన నేతలకు, అక్కడ సరైన గౌరవం-గుర్తింపు లేదన్న భావన చాలాకాలం నుంచీ ఉంది. కేసీఆర్‌కు భయపడి.. బాబు ఆంధ్రాకు వెళ్లినందున, ఇక పార్టీలో ఉన్నా ఫలితం లేదన్న ముందుచూపుతోనే, వారంతా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అటు సెటిలర్లు కూడా అనివార్య పరిస్థితిలో టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఆ భావనను తొలగించేందుకు, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు చేసిన ప్రయత్నాలేవీ లేవంటున్నారు. అందుకు తగినట్లుగానే రమణ పనితీరు ఉండటం, ఆయనను మార్చాలని యావత్ పార్టీ యంత్రాంగం సంతకాలు చేసినా, బాబు స్పందించకపోవడం చూస్తే.. హైదరాబాద్ సహా, తెలంగాణలో చంద్రబాబు పార్టీని గాలికొదిలేశారన్న అభిప్రాయం కార్యకర్తల్లో స్థిరపడిపోయింది.

 

చివరకు దుబ్బాక ఉప ఎన్నికపైనా, బాబు ఇప్పటివరకూ దృష్టి సారించని వైనాన్ని పార్టీ నే తలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్-బీజేపీలు దాదాపు అభ్యర్ధుల పేర్లు ప్రకటించేశాయి. కానీ త మ పార్టీ మాత్రం ఇప్పటి దాకా దానిపై దృష్టి సారించలేదంటున్నారు. తాజాగా.. అధ్యక్షుడు రమణ బీజేపీతో కుమ్మక్కయారంటూ, బాబు నివాసం వద్ద తమ్ముళ్లు ధర్నా చేయడం కలకలం సృష్టించింది. ఖమ్మంలో ఎమ్మెల్సీ పోటీ విషయంలో రమణ, బీజేపీతో కుమ్మక్కయ్యారని తమ్ముళ్లు ఆరోపించారు. తాము సూచించిన నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఓ కార్పొరేటర్ అభ్యర్ధి.. బాబు నివాసం వద్ద, పార్టీ వైఖరిని తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

దుబ్బాకలో పార్టీ అధ్యక్షుడు రమణను పోటీ చేయించి, ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నన్నూరు నర్శిరెడ్డిని బరిలోకి దించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నర్శిరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బరిలోకి దించితే, ఉస్మానియా యూనివర్శిటీ నేపథ్యంతోపాటు, రెడ్డి సామాజికవర్గం కూడా కలసి వస్తుందని విశ్లేషిస్తున్నారు. అయితే, ఇప్పటి పరిస్థితిలో పార్టీ నాయకత్వం నయాపైసా ఇచ్చే పరిస్ధితి లేదంటున్నారు.  హైదరాబాద్-రంగారెడ్డి-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎన్నికలో, ఇతర పార్టీల నుంచి రెడ్లు ఎవరూ పోటీ చేయనందున, ఆ సమీకరణ టీడీపీకి పనికివస్తుందంటున్నారు. నర్శిరెడ్డిది ఉస్మానియా యూనివర్శిటీ నేపథ్యమే అయినందున, అది ఎన్నికల్లో అక్కరకొస్తుందని విశ్లేషిస్తున్నారు. కానీ స్థానికంగా ఎలాంటి పట్టు లేని రమణ, ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తుండంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 

టీఆర్‌ఎస్‌పై చంద్రబాబు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని, నగరంపై దృష్టి సారిస్తే ఇప్పటికీ సానుకూల వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల తీన్మార్ మల్లన్న, బ్యాలెట్‌పై నిర్వహించిన సర్వేలో తెరాసకు 50 శాతంపైగా రాగా, టీడీపీకి 25 శాతం వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి.. తమ అధినేత చంద్రబాబు నాయుడే, తెలంగాణలో పార్టీ కాడి కింద పడేశారన్న వాస్తవం అర్ధమవుతోందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.