అందాల పోటీలకు లేని ముప్పు ఐపీఎల్‌కి ఎందుకు?

Publish Date:May 14, 2025

Advertisement

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, డ్రోన్ దాడులు, వార్ మాక్ డ్రిల్స్ నడుస్తున్న సమయంలో.. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఇండియాలో ఆందోళనకరమైన పరిస్థితులు లేవని స్పష్టం చేస్తోంది. ఉద్రక్తతల తీవ్రత అంతగా లేని దేశంగా భారత్ ఫోకస్ అవుతోంది. సరిహద్దులకు హైదరాబాద్ దూరంగా ఉండటం, ప్రశాంతంగా ఈవెంట్ కొనసాగుతుండటంతో.. దేశంలో భద్రతపై అందరికీ స్పష్టత వచ్చింది. అయితే.. మిస్ వరల్డ్ పోటీలకు లేని ముప్పు.. ఐపీఎల్‌కు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయ్. 

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై.. రెండు వైపులా బలమైన వాదనలు వినిపిస్తున్నాయ్. ఓ వైపు.. ఈ మెగా ఈవెంట్‌ని తెలంగాణని అంతర్జాతీయ వేదికపై ప్రమోట్ చేసే అధ్బుతమైన అవకాశంగా చెబుతున్నారు.  మరో వైపు జాతీయ భద్రతా సంక్షోభ సమయంలో అందాల పోటీల నిర్వహణ కరెక్ట్ కాదనే విమర్శలూ వినవస్తున్నాయి. అయితే సర్కార్ చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో హైదరాబాద్ సురక్షితమైన గమ్యస్థానమనే సందేశాన్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగూ చూసే ఇలాంటి మెగా ఈవెంట్లు సక్సెస్ కావాలంటే భద్రతా చర్యలు అత్యంత పకడ్బందీగా ఉండాలి. సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతల ప్రభావం ఈ పోటీలపై పడకుండా చూడాలి.  ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా.. మిస్ వరల్డ్ పోటీలు విజయవంతమైతే.. హైదరాబాద్, తెలంగాణ సేఫ్ డెస్టినేషన్‌ అనే గుర్తింపు వస్తుంది. దాంతో భవిష్యత్తులో ఇలాంటి వరల్డ్ క్లాస్ ఈవెంట్లు మరిన్ని నిర్వహించేందుకు హైదరాబాదే ఫస్ట్ ఆప్షన్‌గా మారుతుంది.  గ్లోబల్ కాన్ఫరెన్స్‌లకు హైదరాబాద్ వేదిక అవుతుంది. పరోక్షంగా రాష్ట్రంలో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశముంది. అందు కోసమేప్రభుత్వం ఈ ఈవెంట్‌ని సమర్థవంతంగా నిర్వహించి సిటీ ఇమేజ్‌ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది. 

అయితే ఇదే సమయంలో ఐపీఎల్ ఎందుకు వాయిదా వేశారనే చర్చ కూడా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు లేని ముప్పు  ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.   ఐపీఎల్ , మిస్ వరల్డ్ అందాల పోటీలు రెండూ మెగా ఈవెంట్లే. కానీ మిస్ వరల్డ్ పోటీలు ఇండోర్ ఈవెంట్.  అందువల్ల  భద్రతాపరంగా రిస్క్ తక్కువనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫుల్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసింది. జనం కూడా ఎక్కువగా గ్యాదర్ అయ్యే పరిస్థితి లేదు. అందుకోసమే మిస్ వరల్డ్ పోటీలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు. కానీ ఐపీఎల్ అలా కాదు. ఒకే చోట పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది. వేలాది మంది ఒకచోటుకి చేరతారు. పైగా సరిహద్దులకు దగ్గరలో ఉన్న స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతున్నాయ్. 

ఇప్పటికే పాకిస్తాన్‌లోని రావల్పిండి స్టేడియంపై భారత ఆర్మీ డ్రోన్‌తో దాడి చేసింది. దాంతో బోర్డర్‌కు దగ్గరలో ఉన్న స్టేడియాలకు డ్రోన్ దాడుల ముప్పు పొంచి ఉంది. పాక్ ఏ క్షణమైనా డ్రోన్లతో దాడి చేయొచ్చనే సమాచారం ఉంది. ఒకవేళ అదే జరిగితే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. స్టేడియంలో ఒక్క డ్రోన్ పేలినా భయంతో జనం పరుగులు పెడితే తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. అప్పుడు డ్రోన్ దాడితో జరిగే నష్టం కంటే ఇలా తొక్కిసలాట జరిగితే సంభవించే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఐపీఎల్ మ్యాచ్‌లను తాత్కాలికంగా వాయిదా వేశారు. దేశంలో పరిస్థితులు మెరుగై సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడంతో మళ్లీ ఐపీఎల్ మొదలకానుంది.
దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా భారత్‌లోని మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కగానే ఉన్నాయ్, చాలా ప్రాంతాల్లో శాంతియుత వాతావరణమే కొనసాగుతుందనే సందేశం ఇవ్వడంలో హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు  సక్సెస్ అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇందుకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్ ఓపెనింగ్ సెర్మనీని విజయవంతంగా నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది. పైగా.. ఈ ఈవెంట్‌లో 110 దేశాల సుందరీమణులు తమ జాతీయ జెండాలతో.. ఫ్లాగ్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ మెగా ఈవెంట్.. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు మరల్చింది.

పైగా.. ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి, చారిత్రక స్థలాలు, ఆధునిక, మౌలిక సదుపాయాలను.. అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో ప్రభుత్వం విజయవంతమైంది. టూరిజం పరంగా.. ఈ ఈవెంట్ తెలంగాణని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా ప్రమోట్ చేస్తోంది. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు రాష్ట్రంలోని ప్రముఖ టూరిజం స్పాట్‌లను సందర్శిస్తున్నారు. ఇది.. స్టేట్ బ్రాండ్ ఇమేజ్‌ని మరింత పెంచింది. ఎన్ని విమర్శలు ఎదురైనా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈవెంట్‌ని కొనసాగించడంతో.. తెలంగాణ ప్రభుత్వం కమిట్‌మెంట్ ఏమిటో కూడా అందరికీ తెలిసింది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.