ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్.. ఆయనే ఎందుకంటే?

Publish Date:Aug 18, 2025

Advertisement

చివరాఖరుకు  ఎన్డీఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెర పడింది. నిజానికి మాజీ ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్ ఖడ్  అనారోగ్య కారణాల వలన తన పదవికి రాజీనామా చేసిన మరు క్షణం నుంచీ ఆయన వారసుడి వేట మొదలైంది. ఊహాగానాలు ఊపందుకున్నాయి. చాలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి, అయితే..  చివరాఖరుకు  ఊహాగానాలలో అంతగా వినిపించని మహారాష్ట్ర గవర్నర్  సీపీ రాధాకృష్ణన్ ను అధికార ఎన్డీఎ తమ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. బీజీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలోతీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డా  ఆదివారం (ఆగస్టు 17)మీడియా సమావేశంలో ప్రకటించారు. 

అయితే.. ఎన్నో పేర్లు పరిశీలనకు వచ్చినా, బీజీపీ నాయకత్వం ఆయన్నే ఎందుకు ఎంపిక చేసింది ? ఇదీ ఇప్పడు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినవస్తున్న ప్రశ్న. ఇందుకు ఒకటికంటే ఎక్కువ కారణాలే కనిపిస్తున్నాయి. అయితే ఇతర కారణాలు ఎన్నున్నా..  సైధాంతిక పునాదులే అయన ఎంపిక వెనక ఉన్న ప్రధాన కారణంగా’పేర్కొనవచ్చునని  పరిశీలకులు అంటున్నారు. అవునుజ. జగదీశ్ ధన్ ఖడ్ ను బలవంతంగా బయటకు పంపవలసి వచ్చిన  చేదు అనుభావాన్ని దృష్టిలో ఉంచుకునే  బీజేపీ నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేసిందని, అందుకే..  బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయం సేవం సఘ్(ఆర్ఎస్ఎస్) భావజాలంతో, భారతీయ జన సంఘ్ (బీజేఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లతో కలిసి నడిచిన సీపీ రాధాకృష్ణన్ ను ఎన్డీఎ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అదొకటి అయితే వివిధ కీలక పదవులకు బాధ్యులను ఎంపిక చేసే విషయంలో బీజేపీ నాయకత్వం, ఆలోచనా తీరు కొంత భిన్నంగా ఉంటుంది.  విభిన్న కోణాల్లో ఆలోచించి కానీ తుది నిర్ణయం తీసుకోదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర శాఖలఅధ్యక్షులు,ఇతర బాధ్యుల ఎంపిక విషయంలో బీజేపీ ఎంతో కసరత్తు చేస్తుంది. ఇప్పడు ఉపరాష్ట్రపతి అబ్యర్ది ఎంపిక విషయంలోనూ అదే కసరత్తు ఇంకొంచెం ఎక్కువగా చేసిందని పరిశీలకులు అంటున్నారు. 

అందుకే సైద్ధాంతిక కట్టుబాట్లతో పాటుగా  రాజకీయ సమీకరణాలు, అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుందని అంటున్నారు. దక్షిణాదిలో మరీ ముఖ్యంగా  తమిళనాడులో పట్టు పెంచుకునేందుకు ఎంతో కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న కమల దళం, తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీపీ రాధాకృష్ణన్‌ ను వ్యుహ్తంకంగానే   ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిందని అంటున్నారు. 

ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికయ్యే సమయానికి ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నా, ఆయన స్వరాష్ట్రం తమిళనాడు. తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించిన సీపీ రాధాకృష్ణన్‌  తమిళ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  సంపాదించుకున్నారు. 16 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ తీర్ధం పుచ్చుకున్న ఆయన  అదే బాటలో రాజకీయ ప్రస్థానం సాగించారు. బీజేఎస్, బీజేపీలో కీలక బాధ్యతలు  నిర్వహించడంతో పాటుగా, 1998, 1999లో కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 

అంతే కాకుండా రాధాకృష్ణన్‌ కు అన్ని పార్టీలతో, అందరు నాయకులతో సన్నిహిత సంబంధా లున్నాయి. డిఎంకే అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు. రాధాకృష్ణన్ ఒక వారం పదిరోజుల క్రితం కూడా, ఇటీవల అనారోగ్యానికి గురైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను ఆయన  ఇంటికెళ్ళి మరీ పరామర్శించారు. అలాగే..  ఇతర పార్టీలలోని ముఖ్యనేతలతోనూ రాధాకృష్ణన్‌కు మంచి సంబంధాలున్నాయని అంటారు. అలాగే.. ఆయన ఓబీసీ కులానికి చెందిన వారు కావడం కూడా కలిసి వచ్చిందని అంటారు. నిజానికి బీజేపీ అన్ని కోణాల్లో ఆలోచించే..  తమిళ మోదీగా పిలుచుకునే సీపీ రాధాకృష్ణన్‌ ను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అదలా ఉంటే,సెప్టెంబర్ 9 న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్ట్రోరల్ కాలేజీలోని బలా బలాల దృష్ట్యా ఎన్డీయే అభ్యర్ధి రాధాకృష్ణన్ గెలుపు ఇంచు మించుగా ఖరారు అయినట్లే అంటున్నారు.

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.