ఆదినారాయణరెడ్డి సహకారం.. వైనాట్ పులివెందుల సాకారం

Publish Date:Aug 14, 2025

Advertisement

రాయలసీమ జిల్లాలు.. ముఖ్యంగా కడప జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది. వైఎస్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట.  అక్కడ నుంచి అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన వాళ్లు లక్షలు, వేల ఆధిక్యంతో గెలవడాన్ని సాధారణ విజయంగా భావిస్తారు. ఇక అటువంటి కడప జిల్లాలో  పులివెందుల కు ఒక మరింత ప్రత్యేకత ఉంది. అది వైఎస్ సొంత ఖిల్లా. వైఎస్ తదననంతరం ఆయన కుమారుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పెట్టని కోటగా మారింది. ప్రస్తుతం ఆయనే పులివెందుల ఎమ్మెల్యే. అటువంటి పులివెందులలో ఒక చిన్న ఉప ఎన్నికలో జగన్ పార్టీ వైసీపీ డిపాజిట్ కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రభావం పులివెందులపైనా, కడప జిల్లాపైనే కాదు మొత్తం రాష్ట్రంపై పడుతుంది.  జగన్ కు కంచుకోట లాంటి స్థానంలో తెలుగుదేశం  వేయడం, అదీ వైసీపీ అభ్యర్థిని డిపాజిట్ కూడా గల్లంతయ్యేలా ఓడించి జెండా ఎగరేయడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎణ్నికలలో చంద్రబాబు అత్యంత పకడ్బందీగా చేసిన వ్యూహరచన సత్ఫలితాలను అందించింది.  ఈ రెండు జడ్పీటీసీ స్థానాలలోనూ వైసీపీ పరాజయం, తెలుగుదేశం విజయం రాష్ట్ర రాజకీయాలలో ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ విజయాలు వైసీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తాయి.  

ముందుగా పులివెందుల విషయమే తీసుకుంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇక్కడ ఎన్నికల బాధ్యతను మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి అప్పగించారు. ఆదినారాయణ రెడ్డి వరుసగా మూడు సార్లు జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పులివెందుల జెడ్సీటీసీ ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్ధి ఎంపిక నుంచి ప్రతి విషయంలోనూ ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పులివెందుల నియోజకవర్గ ఇన్ చార్జ్  బీటెక్ రవి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత  పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం నుంచి పోల్ మేనేజ్ మెంట్ వరకూ అన్నిటినీ పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. అలాగే ఆదినారాయణరెడ్డికి తెలుగుదేశం నేతలూ, శ్రేణులూ పూర్తిగా సహకారం అందించారు. ఫలితమే అద్భుతమనదగ్గ విజయం.

జగన్ కంచుకోటలో ఆయన పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కని ఘోర పరాజయం. ఇక ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ పకడ్బందీ ప్రణాళిక రచించి ప్రచారం నుంచి పోల్ మేనేజ్ మెంట్ వరకూ తనకు అప్పగించిన బాధ్యతను మంత్రి మంత్రి మందపల్లి రాం ప్రసాద్ తు.చ. తప్పకుండా నిర్వహించారు. పార్టీ నాయకులూ, శ్రేణులూ ఆయనకు పూర్తిగా సహకారం అందించారు. దీంతో రెండు స్థానాలోనూ తెలుగుదేశం జయకేతనం ఎగురవేసి వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 

By
en-us Political News

  
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.