అందుకేనా.. కేటిఆర్ దూరం?

Publish Date:Jan 21, 2023

Advertisement

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తరువాత సీఎం కేసీఆర్ నోటి వెంట జై తెలంగాణ నినాదం స్థానంలో జై భారత్ నినాదం వచ్చింది. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌ను బలోపేతం చేయడానికి కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది పక్కన పెడితే.. టీఆర్ఎస్ తరహాలోనే బీఆర్ఎస్‌ కూడా విజయవంతం అవుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

బీఆర్ఎస్ తరపున తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.  అయితే బీఆర్ఎస్ కీలక కార్యక్రమాలకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీ రామారావు దూరంగా ఉంటున్నారు.  ఇంత వరకూ బీఆర్ఎస్ తరఫున జరిగిన ఏ కార్యక్రమంలోనూ ఆయన పెద్దగా కనిపించలేదు.  

మంత్రి కెటిఆర్ కావాలనే దూరంగా బీఆర్ఎస్ తరఫున పార్టీ కార్యక్రమాలకుదూరంగా ఉంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  రాజకీయ వర్గాల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనే కాదు.. తెలంగాణ ప్రజల్లో కూడా ఈ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ తరఫున జరిగిన  కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొనకపోవడంతో టీఆర్ఎస్ ను కనుమరుగు చేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తనయుడు కేటీఆర్ స్వాగతించడం లేదా అన్న సందేహం ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

టీఆర్ఎస్‌ బీఆర్ఎస్‌గా మార్చేందుకు  తీర్మానం చేయడానికి  ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్..  ఆ తరువాత ఏ కీలక సమావేశానికీ హాజరు కాలేదు.  ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం, ఏపీ నేతలు బీఆర్ఎస్‌లో చేరే సందర్భం, ఇటీవల బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిర్వహించిన ఖమ్మం సభ వీటి వేటిలోనూ కూడా కేటీఆర్ పాల్గొనలేదు.   కేటీఆర్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్లే ఆయన వీటికి హాజరుకాలేక పోతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కేటీఆర్ ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న చర్చ రాజకీయ వర్గాలలోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా జోరుగా సాగుతోంది. జాతీయ రాజకీయాలపై మంత్రి కేటీఆర్‌కు ఆసక్తి  లేదని..  అందుకే బీఆర్ఎస్‌కు సంబంధించిన  కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని ఇటు పార్టీ వర్గాలూ, అటు తెలంగాణ ప్రజలూ భావిస్తున్నారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా.. తాను కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమనే సంకేతాలు ఇవ్వడానికే మంత్రి కేటీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ జాతీయస్థాయి కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగా ఉండొచ్చని.. అదే జరిగితే తాను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమనే సంకేతాలను కేటీఆర్ ఇచ్చినట్టు స్పష్టమవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. ఇక్కడ ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు తీసుకుంటారని బీఆర్ఎస్ నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వచ్చే ఎన్నికల తరువాత ఇదే జరుగుతుందనే వాదన కూడా ఉంది. అందుకే కేటీఆర్ తెలంగాణకు పరిమితమయ్యే విధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.