రాష్ట్రంలో.. బలిపీఠంపై ఉద్యోగులు.. పరస్పర దూషణ పర్వంలో ఉద్యోగ సంఘాల నేతలు

Publish Date:Jan 21, 2023

Advertisement

జీతాల కోసం, ప్రైవేటు ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చును. ఆందోళనకు దిగారంటే సరిపెట్టుకోవచ్చు. సమ్మెకు దిగారంటే ఔను మరేంచేస్తారని సమాధాన పడొచ్చు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు వీధుల్లోకి రావడం, ఆందోళనలకు దిగడం, సమ్మె చేయడం కాదు ఏకంగా గవర్నర్  ను కలిసి, ప్రతి నెలా ఫస్ట్  కు జీతాలు ఇప్పించండి మహా ప్రభో అని మొరపెట్టుకోవడం బహుశా  దేశ చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చు. ఆ మొదటి గౌరవం ఆంధ్రప్రదేశ్ కే దక్కింది. ఇప్పటికే అక్షర క్రమంలో కాదు అప్పుల్లో కూడా ఏపీయే ఫస్ట్ అనిపించుకున్న ఏపీ ఇప్పుడు.. ఉద్యోగులే జగన్  ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసి.. గౌరవ ముఖ్యమంత్రి నిర్వాకం ఎలా ఉందో యావద్దేశానికీ చాటారు.  

 రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభత్వ ఉద్యోగులు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ఏదైతే వుందో అది నభూతో న భవిష్యతి.. అన దగిన అద్భుత సన్నివేశం. ఇటువంటి ఘటన అంటే ప్రభుత్వోద్యోగులు  జీతాలకోసం గవర్నర్ ని కలవడం అనేది దేశచరిత్రలో  గతంలో ఎన్నడూ జరగలేదు.. భవిష్యత్తులో జరిగే అవకాశం లేదు. ఔను భవిష్యత్ లో జరిగే అవకాశం లేదని ఉద్యోగులే చెబుతున్నారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాదు కనుక అంటున్నారు. మరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా  ఇంతటి అధ్వాన పాలన చేయడం జగన్ కు వినా మరెవరికీ సాధ్యం అయ్యే పని కాదని వారు అంటున్నారు. సరే ఉద్యోగులు గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు ఇచ్చిన ఘటన ఉద్యోగ సంఘాల మధ్య చీలికకు కారణమైందంటే అదే వేరే విషయం.  

కానీ  ఉద్యోగసంఘం నేతలు రాష్ట్ర గవర్నర్ ని కలవడం, రాష్ట్ర ఆర్థికపరిస్థితి దిగజారిందనడానికి నిదర్శనం. ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇప్పించాలని, రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇప్పించాలని ఉద్యోగసంఘాలు గవర్నర్ ని కోరాయి. ఉద్యోగ సంఘాలు గవర్నర్ ని కలవడం అనేది సాధారణమే. కానీ జీతాల కోసం గవర్నర్ ని కలవడం దేశంలో ఇదే తొలిసారి. ప్రభు త్వం స్పందించకుంటే ఏప్రిల్ లో సమ్మె చేస్తామన్నారు..  సమ్మె చేసినా ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి? అసలు ఉద్యోగ సంఘాలను నమ్మి ఉద్యోగులు వస్తారా?  గతంలో వారిని నమ్మించి మోసగించారు కదా! ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులకు మధ్య అభిప్రాయ బేధాలు సృష్టించి, ప్రభుత్వం పబ్బం గడుపు కుంటోంది. ఉద్యోగ సంఘాల్ని బెదిరించి, వేధించి ప్రభుత్వం ఉద్యోగుల్ని నియంత్రిస్తోంది. ఉద్యోగ సంఘాల్ని విడదీసి, కొత్త సంఘాలను సృష్టించి, ఉద్యోగ సంఘాల నేతలను ప్రలోభపెడుతూ, ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ఈ పద్ధతి ఎన్నాళ్లు అమలు చేస్తారో చూడాలి.   జనవరి జీతాలు ఫిబ్రవరి నెల్లో కూడా ఇవ్వలేమని, ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.

అప్పులు పుడితేనే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉంది. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. జీతాల కోసం ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వాన్ని కాకుండా గవర్నర్ ను ఆశ్రయించి గోడు వినిపించుకునే పరిస్థితి వచ్చిందంటే ఫైనాల్షియర్ ఎమర్జెన్సీ అని కాక ఇంకేం అనాలి.  ఉద్యోగులు బలిపీఠంపై ఉన్నారు. ఉద్యోగ సంఘాల మధ్య చీలికలను ప్రోత్సహించి సర్కార్ వారిలో వారు విమరశించుకుంటుంటూ నీరో చక్రవర్తిలా జగన్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 7 వేల కోట్ల డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది.  గతం లో పీఆర్సీ సందర్భంలో ఉద్యోగులకు రూ.2,500కోట్లు ఇవ్వాల్సి ఉందని, మార్చి 2022 నాటికి ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికీ ఆ బకాయిలు ఇవ్వలేదు. జీపీఎఫ్ అడ్వా న్స్ లు కూడా ఇవ్వని ప్రభుత్వం, వాటినికూడా వాడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.480 కోట్లు వాడుకుందని కేంద్రమే చెప్పింది.

ఈ ప్రభుత్వానికి హక్కులపై ఉన్న అవగాహన బాధ్యతలపై లేదు. అలవెన్సుల విషయంలో పోలీస్ శాఖ కన్నీళ్లు పెట్టుకుంటోంది. చాలా మంది పోలీసు లు వారి జీతాల్లో 25శాతం సొమ్ముని టీ.ఏ, డీ.ఏలకు ఖర్చుపెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు  ఏడుపే మిగిల్చింది. గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 50 జీవోలు ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ,  పీఆర్సీ, ఇతర త్రా ప్రయోజనాలన్నీ నెరవేర్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తాన న్నారు. తరువాతేమో దాని గురించి తెలియక చెప్పామని నాలుక మడ తేశాడు. ముఖ్యమం త్రికి చేతగాకపోతే తక్షణమే రాజీనామా చేయాలి. ఆ పని చేయకపోతే రాష్ట్రమే మునిగి పోతుంది.

 ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం పెట్టేవారికి బిల్లులు చెల్లించడంలేదు, ఆరోగ్యశ్రీ  బకాయిలు ఇవ్వడంలేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన వైద్యులు, నర్సులకు హై కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప, ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు. ఆప్కాస్ లోని లక్షమంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ ప్రభుత్వం ఏనాడూ కరెక్ట్ గా జీతాలు ఇవ్వలేదు?  ప్రభుత్వం చేయాల్సింది సకాలంలో జీతాలు, ఇతరత్రా ప్రయోజ నాలు ఉద్యోగులకు కల్పించడం.  ఆ పని చేయని ప్రభుత్వం.. మాట్లాడితే కేసులంటూ, ఉద్యమం చేస్తామంటే నిర్బంధాన్ని ప్రయోగిస్తుంటే.. ఉద్యోగులు గవర్నర్ ను కలవకుండా ఇంకేం చేస్తారు. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగ నేత.. ఉద్యోగులకు కాకుండా జగన్ కు ప్రతినిథిగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి.  మొత్తంగా ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఇప్పుడు జరుగుతున్న మాటల యుద్ధం ఒక విధంగా ఉద్యోగులు సమస్యలపై నిరసన గళం విప్పకుండా అడ్డుకుంటూ పరోక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తోందనడంలోసందేహం లేదు. 

By
en-us Political News

  
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో వైఎస్సార్‌సీపీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.