కవిత మాటల మర్మంమేటి? కామారెడ్డి మతలబేంటి?

Publish Date:Aug 23, 2023

Advertisement

రోగం ఒకటైతే మందు మరొకటి అన్నట్లుగా ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీరు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు స్థానాల నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గజ్వేల్ లో ఓటమి భయంతోనే ఆయన సేఫ్ సైడ్ గా  కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నారని విపక్షాలు అంటుంటే.. సొంత పార్టీలోని అసమ్మతి నేతలు, నిరాశ చెందిన ఆశావహులు మాత్రం తన కుమార్తె కల్వకుంట్ల కవిత కోసమే ఆయన కామారెడ్డిని కూడా ఎంచుకున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు.

రెండు స్థానాలలోనూ విజయం సాధించి.. ఆ తరువాత కామారెడ్డి స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో కవితకు టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలన్న వ్యూహం కేసీఆర్ ది అని అంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం లక్ష్యంగా కసరత్తులు ప్రారంభించేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, అసమ్మతి వంటి అంశాలను అధిగమించడానికి తనదైన శైలిలో వ్యూహాలు రూపొందిస్తున్నారు. అన్నిటికీ మించి మిగిలిన రాజకీయ ప్రత్యర్థుల కంటే ముందుగానే 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేశారు. అలా ప్రకటించి తాంబూలాలిచ్చేశాను ఇక తన్నుకు చావండి అన్నట్లుగా పార్టీలోని అసమ్మతికి ఆయన టార్గెట్ నిర్దేశించేశారు. అసమ్మతి ఏమైనా భగ్గు మంటే రోజుల వ్యవధిలో అది పార్టీపై చూపే ప్రభావాన్ని తగ్గించేయవచ్చన్నది ఆయన వ్యూహంలా కనిపిస్తోంది.

అలాగే జాబితా అనంతరం పార్టీలో ఉండేవారెవరు? వెళ్లే వారెవరు అన్నది తేలిపోతే ఇక ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించవచ్చన్నది ఆయన భావనగా కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే జాబితాలో పేరుండి  కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్న మైనంపల్లిని ఎలా డీల్ చేయాలన్న విషయంలో ఆయన తొలుత ఉదారంగా వ్యవహరించినా.. రోజులు గడిచే కొద్దీ కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చారు. బుధవారం (ఆగస్టు 23)  ఆమె మీడియాతో మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అయితే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్న నిర్ణయం తనకోసమే అంటూ వస్తున్న విమర్శలకు ఆమె ఇసుమంతైనాన స్పందించలేదు.

అలసా విషయమే తనకు తెలియనట్లుగా పూర్తిగా నాన్ సింక్ ఇష్యూ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పార్టీలను చెరిగి పారేశారు. నెహ్రూ నుంచి మొదలు పెట్టి మోడీ వరకూ అందరిపైనా విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని తాను టేకప్ చేస్తాననీ, ఈ విషయంలో అన్ని పార్టీలనూ కలుపుకుని పోవడానికి ప్రయత్నిస్తానని వెల్లడించారు. ఆమె మాటలు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ అంశాన్ని డైవర్ట్ చేసి డైల్యూట్ చేయడమే లక్ష్యంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మహిళలకు సరైన ప్రాతినిథ్యం లేదంటూ వస్తున్న విమర్శలపై ఆమె మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల అంశం పూర్తిగా తన సొంత అంశమన్నారు.  దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలకు చట్ట సభలలో సరైన ప్రాతినిథ్యం లేకపోవడం దారుణమని పునరుద్ఘాటించిన కవిత..  దేశ వ్యాప్తంగా 14 లక్షల పైచిలుకు మహిళలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారన్నారు.

కానీ పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా వుందన్నారు.   తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో  మహిళలకు సముచిత స్థానం దక్కలేదన్న విమర్శలకు ఆమె బదులిస్తూ కేసీఆర్ ను సమర్ధించారు. నెహ్రూ కేబినెట్ లో ఒకే ఒక్క మహిళలకు స్థానం ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు.  అలాగే ప్రస్తుత మోడీ కేబినెట్ లో నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ మాత్రమే ఉన్నారని ఎత్తి చూపారు.  బీజేపీ పాలిత రాష్ట్రమైన  యూపీలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవని విమర్శించారు. 1996 లో తొలిసారి దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. 2010 లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందన్నారు. కానీ ఇప్పటి వరకూ ఆ బిల్లుకు మోక్షం కలగకపోవడానికి కారణమెవరని నిలదీశారు.  

దశాబ్ద కాలంగా  లోక్ సభలో  సంపూర్ణ మెజారిటీ ఉన్నా..  మహిళా రిజర్వేషన్ బిల్లు ను పాస్ చేయకుండా మోడీని అడ్డుకున్నదెవరని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో  డిసెంబర్ లో ధర్నా చేస్తానని తెలిపారు. సోనియాగాంధీకి, ప్రియాంక గాంధీకి, బీజేపీ మహిళా నేతలకు ఆహ్వానాలు పంపుతామన్నారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీకి పడుతుంది అన్న ఎంపీ ఆరవింద్ వ్యాఖ్యలతో ఈవీఎంలపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానం వాస్తవమేనని అనిపిస్తోందని కవిత అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

By
en-us Political News

  
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.