యువతలో స్ట్రోక్ ప్రమాదానికి ఈ మూడే ముఖ్య కారణం!

Publish Date:Jul 27, 2023

Advertisement

కొన్ని సంవత్సరాల  క్రితం వరకు పక్షవాతం, మెదడు సంబంధిత వ్యాధులను వృద్ధాప్య సమస్యలుగా చెప్పేవారు.  ఇప్పుడు కూడా ఎవరైనా ఏదైనా మరచిపోయినా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నా అప్పుడే ముసలాడివైపోయావా ఏంటి? అని అంటుంటారు. ఇది కాస్త వెటకారంగా అనిపిస్తుంది కానీ ఇందులో నిజం అదే..  ఇవన్నీ వృద్దాప్యంలో శరీర సామర్థ్యం తగ్గడం వల్ల ఏర్పడేవి. కానీ  ఇప్పుడు యువత కూడా వీటి బారిన పడుతున్నారు. ప్రస్తుతం యువతలో పెద్ద సంఖ్యలో  ఈ ప్రమాదం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెదడులో రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏర్పడే ఈ సమస్య కొన్ని సందర్భాల్లో పక్షవాతం,  మరణానికి కూడా దారి తీస్తుంది. ఏ వయసు వారైనా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని  కూడా  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నరాల సమస్యలు కూడా అనేక రకాల సమస్యలను పెంచుతున్నాయి. యువకులలో స్ట్రోక్ రావడానికి,  వృద్ధులలో స్ట్రోక్ రావడానికి కారణాలు ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే వృద్దులలో వయసు పైబడటం వల్ల ఈ సమస్య వస్తే, యువతలో  ఇతర కారణాల వల్ల వస్తుంది.  స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు యువతలో ఈ ప్రమాదం వేగంగా పెరుగుతోంది. ఈ కింది సమస్యలు స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి.

 అధిక రక్తపోటు సమస్య..

యువతలో అధిక రక్తపోటు సమస్య చాలా సాధారణమైనదిగా కనిపిస్తుంది. చాలా మంది ఉడుకు రక్తం, అందుకే ఆవేశపడతారు అని సమర్థించుకుంటూ ఉంటారు. కానీ ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న స్థితిలో, ధమనుల గోడలపై అధిక ఒత్తిడి ఉంటుంది. ఇది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో  చీలిక ఏర్పడటం లేదా  రక్త సరఫరాకు అడ్డుపడటానికి దారితీస్తుంది. ఇస్కీమిక్ స్ట్రోక్ వంటి అథెరోస్క్లెరోసిస్‌కు హైపర్‌టెన్షన్ ప్రధాన కారణమని తేలింది. ఇప్పట్లో అధిక రక్తపోటు 20-40 సంవత్సరాల వయస్సు గల ఎనిమిది  మందిలో  ఒకరిని  ప్రభావితం చేస్తోంది.

మధుమేహం..

నేటికాలం యువతలో మధుమేహం సమస్య కూడా చాలా వేగంగా పెరుగుతోంది. అది కూడా స్ట్రోక్ రిస్క్‌తో ముడిపడి ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువ. మధుమేహం సమస్య  నరాలను ప్రభావితం చేస్తుంది, దీని కారణంగా స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది.

 ధూమపానం...

యువతకు ధూమపానం ఒక ఫ్యాషన్ గా తయారయింది. సిగరెట్ తాగేవారు హీరోలన్నట్టు, అసలైన మగాళ్లు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఈ ధూమపానం  స్ట్రోక్ ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది. 2018 అధ్యయనం ప్రకారం  15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల మగవారిని సుమారు మూడు సంవత్సరాల పాటు పరిశీలించింది. ఇందులో ప్రతిరోజూ సిగరెట్ తాగే వ్యక్తులకు ఇతర వ్యక్తుల కంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని పరిశోధకులు కనుగొన్నారు.

ధూమపానం స్ట్రోక్‌కు దారితీసే అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పెంచుతుంది.  శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తనాళాల్లో ఉండే కణాలకు నష్టం చేకూరుస్తుంది. రక్త నాళాలు చిక్కగా లేదా ఇరుకైనవిగా మారుస్తుంది.

కాబట్టి ఈ మూడు విషయాల్లో యవత జాగ్రత్తగా ఉంటే స్ట్రోక్ ప్రమాదం నుండి గట్టెక్కవచ్చు.

                                                          *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.