మహమ్మద్ ప్రవక్త  మేకలు  ఎందుకు పెంచుకున్నాడు?

Publish Date:Sep 27, 2024

Advertisement

జాఫర్ బాయ్ ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చాడు.
జాఫర్ భాయ్: సలాం వాలేకూం  మౌలానా సాబ్ 
మౌలానా: వాలేకూం సలాం జాఫర్ భాయ్ 
జాఫర్ భాయ్: నా చిన్న కొడుకు సిరాజ్  సతాయిస్తున్నాడు. కుక్క కోసం  నాతో గొడవపడుతున్నాడు మౌలానాసాబ్ 
మౌలానా దివాన్ ఖానాలో  జాఫర్ భాయ్ ను కూర్చోబెట్టి  తన తక్రీర్ ప్రారంభించాడు. 

 మౌలానా:  అల్లా సందేశాన్ని మానవాళికి చేరవేసిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. ఇటీవలె ఆయన జన్మదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం. మహమ్మద్  ప్రవక్త దగ్గర అనేక రకాల  పెంపుడు జంతువులు ఉండేవి. . వీటిలో కుక్క లేదు. కుక్క విశ్వాసం గల జంతువు కాని పెంచుకునే జంతువు కాదు. కుక్క వల్ల మనిషికి అనర్థాలు కూడా ఎక్కువే. కుక్క మాంసాహారి. మాంసాహార జంతువుల్లో కోపం కూడా ఎక్కువ. కోపం ఎక్కువైతే యజమానినే కొరుక్కు తింటుంది. చాలాదేశాల్లో కుక్క వల్ల యజమాని చనిపోయిన వార్తలు పత్రికల్లో చూస్తున్నాం. కుక్క మల మూత్రాల వల్ల దాన్ని పెంచుకున్న యజమానులు అనారోగ్యపాలవుతారు. మహమ్మద్ ప్రవక్త మేకల మందను మేపే వాడు. మేకల వల్ల అనేక లాభాలున్నాయి. మేకలు పెంచుకోవడం వల్ల ఓపిక, సహనం పెరుగుతుంది. అల్లాతో ప్రేమ పెంచుకున్నవాళ్లమవుతాం. మేకలు పెంచుకోవడం వల్ల ఇంట్లో చెత్తా చెదారం మాయమవుతుంది. కిచెన్ వేస్ట్ తిని పెట్టి మేకలు మనకు మేలు చేస్తాయి. మేక వ్యర్థాల వల్ల అనారోగ్యం చెందే అవకాశం లేదు. మేకలు పెంచుకునే క్రమంలో సహనం పెంచుకునే అవకాశముంది. ప్రకృతికి ఎంత దూరం ఉంటే అనారోగ్యాలు అంత దగ్గర అవుతాయి. మేకలు ప్రకృతి ఇచ్చిన వరం. మేకలు అన్ని రకాల ఆకు కూరలు, గడ్డి తింటాయి. కాబట్టి అన్ని రకాల పోషకాలు మేకలకు అందుతాయి. పేద కుటుంబాలు అవసరం కొద్దీ అమ్ముకుంటే ఆర్థిక చేయూత నిస్తాయి. మేకలు ఉన్నాయంటే ఎటిఎమ్ కార్డు మన వద్ద ఉన్నట్టు భావించాలి. కోళ్లు పెంచుకోవడం కూడా ఇస్లాంలో హలాల్ అని చెప్పొచ్చు. వేకువ జామున కోడిపుంజు పెట్టే కూతకు మేలుకుంటాం. ఫజర్ నమాజు (ప్రాత: కాల నమాజు) చేసుకోవచ్చు. కోడిగుడ్ల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు. పౌల్ట్రీ ఫాంలో లక్షలాది కోళ్లు చనిపోయినా మనిషి ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు మేకలు, కోళ్లు ఆర్థికంగా చేయూతనిస్తున్నాయి. షోకుల కోసం కుక్కలను పెంచుకుంటున్నారు. దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ.   ఇస్లాం కేవలం ఎనిమిది రకాల పెంపుడు జంతువులకు అనుమతించింది. అందులో కుక్క , పిల్లి వంటి జంతువులు లేవు.  మహమ్మద్ ప్రవక్త కూడా మేకలు పెంచుకున్నాడు.  కాబట్టి మహమ్మద్ ప్రవక్త బాటలో మనమూ వెళ్లాలి. ప్రతీ ముస్లిం ఐదుసార్లు నమాజు చేయాలి. అల్లాకు దగ్గరవ్వాలి. ఇస్లాం మే  హలాల్ జాన్వర్ కో పాలో, హరామ్ జాన్వర్ కో మత్ పాలో . బక్రీ అప్నీ కిద్మత్ కే లియే హై...   కుదాఫీస్ అంటూ మౌలానా తన తక్రీర్ ముగించాడు. 

                                                                                      బదనపల్లి శ్రీనివాసాచారి

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.