వెంకటరెడ్డిపై చర్యలకు ఉపేక్ష ఎందుకు.. కాంగ్రెస్ అంత బలహీనమా?

Publish Date:Aug 23, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నిక ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్యే. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ కే ఎక్కువ కీలకం, ఎక్కువ అవసరం. ఎందుకంటే మునుగోడులో ఫలితం కాంగ్రెస్ కు ప్రతికూలంగా వస్తే... ఇంత కాలంగా శ్రేణులలో పెరుగుతూ వస్తున్న ఉత్సాహం నీరుగారిపోతుంది. ఆ ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది. అంతటి కీలక ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ తన బలహీనతను వదులుకోవడంలో ఆమోదయోగ్యం కాని తాత్సారం ప్రదర్శిస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అధిష్ఠానం నిర్ణయం తీసుకోకుండా చేస్తున్న తాత్సారం వెరసి మునుగోడుపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన పార్టీ క్యాడర్ లో వ్యక్తమౌతోంది. వెంకటరెడ్డి సోదరులను ఇంత కాలం ఉపేక్షించడమే కాంగ్రెస్ చేసిన తప్పు అని, ఇప్పుడు కూడా వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోకపోతే మునుగోడుపై ఆశలు వదిలేసుకోవడమే మంచిదని క్యాడరే అంటున్నదంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ లో వ్యక్తులు కాదు.. పార్టీయే ముఖ్యం అని చెబుతుంటారు. అయినా మునుగోడు విషయానికి వచ్చే సరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధిక్కార స్వరాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు భరిస్తోందన్నది అర్ధం కావడం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు. మునుగోడు కాంగ్రెస్ కు కంచుకోట అనడంలో సందేహం లేదు. అటువంటి కంచుకోటలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామాతో  ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ ఎమ్మెల్యే బీజేపీ పంచన చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేస్తున్నారు. అటువంటప్పుడు కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని రంగంలోనికి దింపి క్యాడర్ చెక్కు చెదరకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ ఆ పని చేయడం లేదు. టీపీసీసీ చీఫ్ కోమటిరెడ్డి సోదరుల విమర్శలను గట్టిగా తిప్పి కొట్టేందుకు అధిష్ఠానం వైపు చూడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అదే సమయంలో సోదరుడు పార్టీ వీడిన విషయాన్ని పక్కన పెట్టి టీపీసీసీ చీఫ్ పై విమర్శల వర్షం కురిపిస్తూ పార్టీకి నష్టం చేకూరుస్తున్న వెంకటరెడ్డిపై హై కమాండ్ చూసీ చూడనట్లు వదిలేసే వైఖరి అవలంబిస్తోంది. ఇదే అలుసుగా తీసుకుని వెంకటరెడ్డి రెచ్చిపోతున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి పదవులు ఎలా ఇస్తారని అధిష్ఠానాన్నే నిలదీస్తూ టీపీసీసీ చీఫ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనతో కలిసి పని చేసే ప్రశక్తే లేదని ఖరాకండీగా చెప్పేశారు. మునుగోడుతో తనకు సంబంధం లేదనీ, అక్కడ ప్రచారానికి వెళ్లననీ తెగేసి చెప్పేశారు. అంతటితో ఆగకుండా పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జిపై ఆరోపనలు గుప్పించారు. ఆయనను తెలంగాణ నుంచి పంపేయాలనీ.. కమల్ నాథ్ నో.. లేదా అటువంటి మరో వ్యక్తినో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు.

ఆయన ఇంతలా రెచ్చిపోతున్నా.. పార్టీ రాష్ట్ర చీఫ్ మాత్రం మేం కలిసే పని చేస్తామనీ, వెంకటరెడ్డి మునుగోడులో ప్రచారం చేస్తారనీ చెప్పుకుంటున్నారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండా మునుగోడులో పార్టీ ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. కఠిన నిర్ణయాలకు వెరిస్తే పార్టీ మునుగోడులోనే కాకుండా ఆ తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పార్టీ క్యాడర్ ఆందోళనలో ఉంది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ మారినా.. కాంగ్రెస్ క్యాడర్ ఆయన ఆశించిన విధంగా రాజగోపాలరెడ్డి వెంట నడవలేదు. కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉంది. కొద్ది మంది అనుచరులు వినా ఎవరూ కమలం గూటికి చేరలేదు. ఏకంగా అమిత్ షా సభ పెట్టినా కూడా కాంగ్రెస్ నుంచి పెద్దగా వలసలు లేవు.

అటువంటప్పుడు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి ఉప ఎన్నికకు క్యాడర్ ను కార్యోన్ముఖులను చేసేందుకు ఉపక్రమించాల్సిన కాంగ్రెస్ ఆయన సోదరుడి నోటికి కళ్లెం వేయడానికి కూడా జంకే పరిస్థితిలో ఉండటమేమిటని పరిశీలకులు అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరాజయమే లక్ష్యమన్నట్లుగా తోస్తున్నదని.. పార్టీలో ఉంటూనే శల్యుడిలా పార్టీ పురోగమనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు సైతం అంటున్నారు. ఇప్పటికైనా ఆయన విమర్శలకుకళ్లెం వేసి.. మునుగోడులో ప్రచారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పరిశీలకులే కాదు.. పార్టీ కేడర్ సైతం అభిప్రాయపడుతోంది.    ప్రియాంకా గాంధీతో జరిగినసమావేశానికి కోమటిరెడ్డి గైర్హాజర్ కావడమే కాదు.. రేవంత్‌పై ఆరోపణలు చేశారు. సోనియాకు లేఖ రాశానంటూ దాన్ని మీడియాకు విడుదల చేశారు.

ఎయిర్ పోర్టుకే మీడియాను పిలిపించి మునుగోడుపై ప్రియాంకా గాంధీ మీటింగ్ కంటే ఎక్కువ హంగామా చేశారు.  అయినా రేవంత్ రెడ్డి కానీ సీనియర్లు కానీ.. ఆయన సమయాభావం వల్ల రాలేకపోయారని సమర్ధించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు ఆయన కాంగ్రెస్ లో ఉంటూ.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి సోదరుడు రాజగోపాలరెడ్డి విజయానికి మార్గం సుగమం చేసేలా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డిని  ఇంకా బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూండటం ఆ పార్టీ కార్యకర్తల్లోనేఅసహనానికి కారణం అవుతోంది.

రాజగోపాల్ రెడ్డి .. అన్న మాట జవదాటడు. అంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహంలో భాగంగానే జరుగుతోందని రాజకీయా పరిశీలకులు అంటున్నారు. సోదరులిరువురూ కలిసి కాంగ్రెస్ కు దెబ్బకొట్టే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తుంటే కాంగ్రెస్ ఇంకా మీనమేషాలు లెక్కించడమే  ఆ పార్టీ బలహీనత అంటున్నారు.

By
en-us Political News

  
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.