దాడి జరిగితే చూద్దాం.. ఫిర్యాదు ఎందుకు చేశారు.. పవన్ కు పోలీసుల నోటీసు

Publish Date:Oct 5, 2023

Advertisement

ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. భరోసా ఇవ్వాల్సిన పోలీసులు ఫిర్యాదు దారుడికే నోటీసులు ఇస్తున్నారు. భద్రత కల్పించాల్సిన వారు.. మీకు భద్రత ఎందుకు కల్పించాలో చెప్పండంటూ నిలదీస్తున్నారు. దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ స్పష్టమైన సంకేతాలు చూపి మరీ భద్రత కోరితే.. ఆ ఆధారాలు చాలవు.. ముందు దాడి జరగనివ్వండి తరువాత చూద్దాం అంటున్నారు. ఏపీలో పోలీసులు విపక్షాల విషయంలో వ్యవహరిస్తున్న తీరిది.

పోనీ  దాడి జరిగిన తరువాతైనా బాధితులవైపు నిలబడతారా అంటే అదీ లేదు. బాధితులపైనే కేసులు. నిరసన తెలపడంలో దాడులు ఒక భాగమంటూ భాష్యాలు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా లేదు. తాజాగా వారాహి యాత్రలో భాగంగా పెడనలో తనపై దాడి జరిగే అవకాశాలున్నాయనీ, ఇందుకు సంబంధించి తన వద్ద  విశ్వసనీయ సమాచారముందనీ భద్రత కల్పించాలనీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకోగానే  పోలీసులు చేయాల్సిన పని భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడం, దాడులు జరిగే అవకాశాలున్నాయన్న ఫిర్యాదుపై దర్యాప్తు చేయడం, దాడులు చేస్తారన్న అనుమానం ఉన్న వారిని అదుపులోనికి తీసుకోవడమో, నియంత్రించడమో చేయాలి. కానీ మన పోలీసులు మాత్రం భిన్నంగా ఆలోచించారు. అసలు  మీ మీద దాడి జరుగుతుందని భావించడానికి ఉన్న ఆధారాలేమిటో చూపండి అంటూ పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చారు. 

ఇంతకీ పవన్ కల్యాణ్ తన ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే.. అధికార పార్టీకి చెందిన వారే పెడనలో అసాంఘిక శక్తులతో తనపై దాడి చేయించేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. దాంతో ఠాట్ అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడడమేమిటని పోలీసులకు చిర్రెత్తుకొచ్చినట్లుంది. అందుకే రివర్స్ లో పవన్ కల్యాణ్ కు ఆధారాలు చూపడం అంటూ నోటీసులు ఇచ్చారు. 

అధికార పార్టీ విపక్షాలపై, విపక్ష నేతలపై, కార్యకర్తలపై, వారి కార్యాలయాలపై దాడులు జరపడం కొత్తేమీ కాదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే జోగి రమేష్.. (ఆయన ఇప్పుడు మంత్రి) ఆధ్వర్యంలో జరిగిన దాడి, అంతకు ముందు, ఆ తరువాత  విపక్షాలపై జరిగిన దాడుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన ఫిర్యాదుకు వేరే ఆధారాలు చూపాల్సిన అవసరమే లేదు. పైపెచ్చు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి నేతృత్వం వహించి మంత్రిగా ప్రమోషన్ పొందిన జోగి రమేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పెడన. అటువంటి పెడనలో తనపై దాడి జరిగే అవకాశం ఉందన్న పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేస్తే.. ఆ అవకాశాలపై ఆధారాలివ్వండి అంటూ పోలీసులు పవన్ కల్యాణ్ కు ఎదురు నోటీసులు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మందికి కాదంటూ జనసేనానికి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా హితవచనాలు చెప్పారు.

ముందు దాడి జరగనివ్వండి.. ఆ తరువాత ఫిర్యాదు చేయండి అన్నదే ఆయన హిత వచనాల సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీ  పోలీసులు అధికార పార్టీకి చెందిన వారి ఫిర్యాదులు తప్ప మరెవరి ఫిర్యాదులూ పట్టించుకోరనీ, అందుకే దాడులు చేసి.. దాడికి గురైన వారిపై వైసీపీ మూకలు ఇస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుని బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారనీ అంటున్నారు. అంతే తప్ప.. దాడి జరగకుండా తాము భద్రత కల్పిస్తామన్న భరోసా మాత్రం విపక్షాలకు ఇవ్వడానికి ఏపీ పోలీసులుర రెడీగా లేరు.  దాడి జరుగుతుందనడానికి ఆధారం చూపమంటూ తామిచ్చిన నోటీసుకు పవన్ కల్యాణ్ నుంచి సమాధానం రాలేదని పేర్కొంటూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పవన్  కల్యాణ్ కు మళ్లీ  నోటీసులు ఇచ్చారు.

సరే చివరకు జరిగిందేమిటంటే.. పెడనలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  జనసేన నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను  వైసీపీ శ్రేణులు తొలగించారు. ఆ సందర్భంగా జనసేన, వైసీపీల మధ్య ఘర్షణ జరిగింది.   వైసీపీ కౌన్సిలర్‌ను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. అంగళ్లు, భీమవరం, మాచర్ల ,నందిగామ, కుప్పం సహా పలు ప్రాంతాలలో పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ దాడులకు పాల్పడింది. దాడికి పాల్పడిన వారిని అదుపులోనికి తీసుకుని తరువాత వదిలేయడం, దాడికి గురైన వారిపై మాత్రం హత్యాయత్నం  సహా తీవ్రమైన కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడం అన్నది ఏపీ పోలీసులకు రివాజుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.