కేసీఆర్ కు సినిమా కనిపిస్తోందా? ఓటమి భయం వెంటాడుతోందా? వరుస ప్రెస్ మీట్ల పరామర్థమేంటీ.. 

Publish Date:Nov 8, 2021

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రిలో గతంలో ఎప్పుడు లేనంతగా భయం కనిపిస్తోందా? ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందా? అంటే కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కేసీఆర్ వ్యవహారశైలిని చూస్తున్న వారి నుంచి అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత గులాబీ బాస్ లో గుబులు పెరిగిందని అంటున్నారు. ఈటల రాజేందర్ విజయం తర్వాత మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఇకపై కేసీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తామని చెప్పారు. సంజయ్ చెప్పినట్లే ఇప్పుడు కేసీఆర్ కు సినిమా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. 

 కేసీఆర్ కు ఫాంహౌజ్ ముఖ్యమంత్రిగా పేరు పడింది. ఆయన సచివాలయం అసలే వెళ్లరు. ప్రగతి భవన్ లో ఉన్నా పాలన పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. ప్రగతి భవన్ కంటే ఫౌంహౌజ్ లోనే ఎక్కువ ఉంటారు. అందుకే విపక్షాలు కేసీఆర్ పై ఫౌంహౌజ్ ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేస్తుంటారు.  అయితే రెండు రోజులుగా కేసీఆర్ రూట్ మార్చారు. నెలల తరబడి జనంలోకి వెళ్లని గులాబీ బాస్.. రెండు రోజులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు. గంటల తరబడి మాట్లాడారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. 

కేసీఆర్ నెలల తరబడి మీడియా ముందుకే రారు. అలాంటిది వరసుగా రెండు రోజులు... అది కూడా రెండు గంటల పాటు మీడియాతో మాట్లాడటంతో.. ఆయనలో అంత మార్పు ఎందుకు వచ్చిందన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ షేకవుతున్నారని, ఆయనలో ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోంది. హుజురాబాద్ ఓటమి నుంచి బయటపడక ముందే వరి ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కడం గులాబీ బాస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందట. వరి విషయంలో కేసీఆర్ సర్కార్ తీరుపై రైతన్నలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే రిపోర్టులు ప్రగతి భవన్ కు వెళ్లాయంటున్నారు. ఆ నివేదికలు చూసిన కేసీఆర్ అవాక్కయ్యారని అంటున్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై ఇప్పటికే నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడంతో వారంతా కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా గులాబీ బాస్ ను ఆటాడుకుంటున్నారు. దీంతో నిరుద్యోగుల ఓట్లపై కారు పార్టీ నేతలు ఆశలు వదిలేసుకున్నారు. ఇక ఉద్యోగ వర్గాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. అందుకే కేసీఆర్ తన ఆశలన్ని రైతులపైనే పెట్టుకున్నారు. నిజానికి రైతు బంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతలు ఇప్పటివరకు కేసీఆర్ కు సానుకూలంగా ఉన్నారు. 2018లో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి రైతు బంధు పథకమే ప్రధానమని అంటారు. అలాంటిది ప్రస్తుతం రైతులు కూడా కేసీఆర్ పై రగిలిపోతుండటం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.

వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే రైతులంతా కేసీఆర్ పై తిరగబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తమ పంటను మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజుల తరబడి రైతులు పడిగాపులు పడుతున్నారు. వారం రోజులైనా ధాన్యాన్ని కొనే దిక్కు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు వరి ధాన్యం కుప్పలపైనే గుండెలు పగిలి చనిపోతున్నారు. ఇదిలా ఉండగానే యాసంగిలో వరి పంట వేయవద్దంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల్లో మంట రాజేసింది. ఏడాది క్రితం మక్కలు వద్దు వరి పండించాలని పిలుపిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు వరి ధాన్యం వద్దని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. వరి వద్దంటే మరీ ఏం సాగుచేయాలని నిలదీస్తున్నారు. వరికి ఉరి వేస్తే.. కేసీఆర్ ప్రభుత్వానికి తాము ఉరి వేస్తామంటూ శపథం చేస్తున్నారు అన్నదాతలు.

రైతుల ఆందోళనలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న కేసీఆర్.. ఓటమి ఖాయమని డిసైడ్ అయ్యారని అంటున్నారు. రైతులతో పెట్టుకున్నోడు ఎవడూ బాగు పడినట్లు చరిత్రలో లేదు గతంలో చాలా సార్లు చెప్పారు కేసీఆర్. ఇప్పుడే ఆయన అన్నదాతల జీవితాలతో ఆటలాడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ ను టెన్షన్ పెట్టిస్తుందని అంటున్నారు. అందుకే  ఆ గండం నుంచి బయటపడేందుకు కేంద్రాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.  ఓటమి భయం వల్లే ఆయనలో అసహనం పెరిగిపోయిందని చెబుతున్నారు. రెండు రోజులుగా కేసీఆర్ మాట్లాడుతున్న మాటలను బట్టి... వచ్చే ఎన్నికల్లో తనకు ఓటమి ఖాయమని ఆయన క్లారీటికి వచ్చారని అంటున్నారు.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.