Publish Date:Jul 26, 2023
బీఆర్ఎస్ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రెండు దశల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా? 60 మందిని జూలై 24న ప్రకటిస్తానని, మిగిలిన 59 మంది అభ్యర్థులను ఆగస్టు 24న ప్రకటిస్తానని కెసీఆర్ సెలవిచ్చారు. ఆగస్టు 24వ తేదీన ప్రకటించడానికి కెసీఆర్ ఓ లాజిక్ కూడా చెప్పారు రెండు తేదీలు కలిపి తన అదృష్ట సంఖ్య 6ని చెప్పారు. అయితే కెసీఆర్ ఇలా తొందరపడి అభ్యర్థులను ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
దాదాపు 14 మంది మంత్రులు, ఇతర పార్టీల నుంచి మారిన 16 మంది ఎమ్మెల్యేలకు తొలి దశలో టిక్కెట్లు దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ తో సహా 31 మందికి తొలి దశలో సీట్లు వస్తాయి అని ప్రచారం జరుగుతోంది. సర్వే నివేదికలను బట్టి జాబితాను మార్చడానికి పార్టీ అధినేతకు అవకాశం, సమయం ఉంటుందని బిఆర్ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ ఎన్నికల్లో కొత్త ముఖాలను రంగంలోకి దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌లో టిక్కెట్ల కోసం డిమాండ్ ఉన్న నేపథ్యంలో వామపక్ష పార్టీలతో ముందస్తు ఎన్నికల పొత్తుకు కేసీఆర్ సిద్దంగా లేరు అని తెలుస్తోంది.
గత అనుభవాలను పరిశీలిస్తే ఎన్నికలు అనగానే కేసీఆర్ కు ఉత్సాహం ఉరకలేస్తుంది.
2019 జూన్‌లో పదవీకాలం ముగియడానికి తొమ్మిది నెలల ముందే అంటే 2018 సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసారు. అదే రోజు 105 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సెప్టెంబర్ 6న ప్రకటించడానికి కారణం లేకపోలేదు. 6 కెసీఆర్ లక్కీ నెంబర్. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించే కేసీఆర్ ఈ సారి కూడా తొలి జాబితాను ప్రకటించడానికి ఉవ్వీళూరుతున్నారు. ఎన్నికలు జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆగస్టు 24లోపు రెండు జాబితాలను ప్రకటిస్తానని ప్రకటించి అన్ని పార్టీలను అబ్బురపరుస్తున్నారు. మెజారిటీ రాజకీయ పార్టీలు సాధారణంగా అభ్యర్థుల జాబితాను ముందే ప్రకటించకుండా సస్పెన్స్ కొనసాగిస్తాయి.నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తాయి. చివరి క్షణం వరకు ఉత్కంఠ నెలకొనేలా చేస్తాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-brs-list-earliar-39-159028.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.