జగన్ కు అమిత్ షా షాక్.. ఇక ఆట మొదలైనట్టేనా?
Publish Date:Jun 6, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఆయన సోమవారం ఢిల్లీకి వెళ్లాలనుకున్నప్పటికీ... కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ల అపాయింట్మెంట్లు ఖరారు కాలేదు. జల వనరుల శాఖ మంత్రి షెకావత్ మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ ఒక్కరిని కలిసేందుకైనా సీఎం ఢిల్లీ వెళతారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, కేంద్ర మంత్రులు ‘బిజీ’గా ఉన్నందున ముఖ్యమంత్రి జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారంటూ ఆదివారం సాయంత్రం వైసీపీ వర్గాలు వెల్లడించాయి. నిజానికి సోమవారం అమిత్‌షా అపాయింట్మెంట్ ఖరారైనట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, సమయం ఇవ్వడం కుదరదని ఆదివారం సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో... కనీసం గురువారమైనా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కోరాయి. దీనిపై హోంశాఖ స్పందన కోసం ఎదురు చూస్తున్నాయి. అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్‌తో సహా ఇతర మంత్రుల అపాయింట్మెంట్ లభించేలా వైసీపీ ఎంపీలు నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఎంపీతోపాటు... మరికొందరు సోమవారం ఢిల్లీకి వెళుతున్నట్లు తెలిసింది. వీరు నేరుగా ఆయా కేంద్ర మంత్రుల కార్యాలయాలకు వెళ్లి... అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. సీఎం జగన్ ఢిల్లీ టూర్ వాయిదాపై రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. జగన్ కు కలిసేందుకు కేంద్రం పెద్దలు ఆసక్తిగా లేరని చెబుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఎంపీ రఘురామ రాజు అరెస్ట్.. దాని తర్వాత జరిగిన పరిణామాలపై కేంద్రం కోపంగా ఉందని తెలుస్తోంది. బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామ వేసిన పిటిషన్.. అటు రఘురామ అరెస్ట్, కస్టడీలో టార్చర్ ఎపిసోడ్‌ను ఢిల్లీ స్థాయిలో న్యాయ, శాసన, రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లడం.. ఇలా సీబీఐ, సీఐడీ కేసులతో జగన్‌రెడ్డి ప్రమాదంలో ఉన్నారని అంటున్నారు. తన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. సీబీఐ, సీఐడీ కేసుల ఇబ్బందుల నుంచి బయటపడటమే.. జగన్, అమిత్‌షాల భేటీ పరమార్థం అని ప్రచారం జరుగుతోంది. రఘురామ ఘటనలో అసలేం జరిగిందనే విషయంపై ఇప్పటికే కేంద్రహోంశాఖ వివరాలు సేకరించిందని సమాచారం. రఘురాం విషయంలో జగన్‌రెడ్డి సర్కారు తీరుపై కేంద్రం చాలా సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమకు డ్యామేజీ జరుగుతుందనే ఆలోచనలో కేంద్ర మంత్రులు ..జగన్ ను దూరం పెట్టారని అంటున్నారు. ఇక కరోనా వ్యాక్సినేషన్ అంశంలో పలువురు సీఎంలకు జగన్ లేఖ రాశారు. దీనిపై కేంద్రం గుర్రుగా ఉందంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లానుకోవడం.. అంతలోనే వాయిదా పడడం.. చర్చనీయాంశమయింది. మరోవైపు జగన్ బెయిలు రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ కేసులో వేగంగా విచారణ జరుగుతోంది. జగన్ బెయిలు రద్దు పిటిషన్లో సీబీఐ తన వైఖరి స్పష్టం చేయకుండా విషయాన్ని కోర్టుకే వదిలేయడం ఆసక్తికర పరిణామం.ఈ ఘటనతో జగన్ ను కేంద్ర సర్కార్ టార్గెట్ చేస్తుందనే చర్చ కూడా మొదలైంది. ఏపీపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ హైకమాండ్.. తమిళనాడు తరహా రాజకీయానికి ప్లాన్ చేసిందంటున్నారు. జగన్ బెయిల్ రద్దై జైలుకు వెళితే.. ఏపీలో చక్రం తిప్పేలా అమిత్ షా టీమ్ పక్కాగా స్కెచ్ వేసిందంటున్నారు. జగన్ పై కేంద్రం తాజా వైఖరి చూస్తూంటే... ఆయనపై ఆట మొదలు పెట్టిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.
http://www.teluguone.com/news/content/why-amith-sha-not-given-appointment-to-cm-jagan-39-117066.html





