చేత్తో ఆహారం తినాలని పెద్దలు చెప్పేది ఇందుకే..!
Publish Date:Oct 6, 2025
Advertisement
భారతీయులు భోజన ప్రియులు అనే మాట అందరికీ తెలిసిందే.. భారతదేశంలో ఉన్నన్ని ఆహార రకాలు మరే ఇతర దేశాలలోనూ ఉండవు. అయితే ఆహారాన్ని తినడంలో చాలా మార్పులు వచ్చాయి. చాలా దేశాలలో ఆహారం తినడానికి స్పూన్లు, ఫోర్క్ లు, చోప్ స్టిక్స్ వంటివి వాడతారు. అయితే భారతదేశంలో మాత్రం చాలా ఏళ్ల నుండి చేత్తో ఆహారం తినేవారు. కానీ పాశ్చాత్య సంస్కృతి ఇలా చేతులతో ఆహారం తినడాన్ని అనాగరిక అలవాటుగా రూపొందిస్తూ వచ్చింది. దీంతో చేత్తో తినగలిగే ఆహారాలు కూడా చాలా మంది స్పూన్లతోనూ, పోర్కులతోనూ తింటున్నారు. అయితే చేత్తో ఆహారం తింటే కలిగే లాబాలేంటి? అనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. తినడం అంటే కడుపు నింపుకోవడం మాత్రమే కాదు. ఇది శరీరం, మనస్సు, ఆత్మను అనుసంధానించే అనుభవం. ఈజిప్ట్, మెసొపొటేమియా, గ్రీస్ వంటి ప్రాచీన నాగరికతలు కూడా తినడానికి చేతులనే ఉపయోగించాయి. భారతదేశంలో చేత్తో ఆహారం తినడం అనే సంప్రదాయం ఆయుర్వేద మూలాలను కలిగి ఉంది. చేతులు పంచభూతాలకు ప్రతినిధులుగా పరిగణించబడతాయి. చేతులతో తినడం వెనుక ప్రాముఖ్యత.. చేతులతో తినడం అనే సంప్రదాయం శతాబ్దాల నాటిది. ఆయుర్వేదంలో.. బొటనవేలు అగ్ని తత్వం, చూపుడు వేలు వాయు తత్వం, మధ్య వేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు నీరు అనే గుణాలను నింపుకుని ఉంటాయి. ఇవన్నీ పంచభూతాలు అనబడతాయి. చేతులతో తినేటప్పుడు ఇవన్నీ సక్రియం చేయబడతాయి. శరీర శక్తిని సమతుల్యం చేస్తాయి. చేతులతో ఆహారాన్ని తాకడం వల్ల ఆహారం వడ్డించబోతున్నట్లు మెదడుకు సంకేతాలు అందుతాయి. ఇది లాలాజలం, జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రయోజనాలు.. చేతులతో తినడం వల్ల ఆహారం ఆకృతి, ఉష్ణోగ్రత, స్థిరత్వాన్ని అనుభూతి చెందడానికి వీలు ఉంటుంది. ఇది నెమ్మదిగా తినడానికి, అతిగా తినడం నివారించడానికి సహాయపడుతుంది. తద్వారా బరువు నిర్వహణకు సహాయపడుతుంది. జీర్ణక్రియను ప్రభావితం చేసే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ను తగ్గిస్తుంది. లాలాజల ఉత్పత్తికి సహాయపడటం వల్ల జీవశక్తిని పెంచుతుంది. ఆయుర్వేదంలో లాలాజలాన్ని జీవశక్తిని పెంచే ఎంజైమ్ గా పిలుస్తారు. *రూపశ్రీ. గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
http://www.teluguone.com/news/content/why-adults-tell-us-to-eat-food-with-our-hands-34-207417.html





