Publish Date:Jun 17, 2025
కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తెగా మాత్రమే కాదు.. ఎంపీగా, పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన నేత. తండ్రి కేసీఆర్ వాగ్ధాటిని పుణికి పుచ్చుకున్న నేత. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరినప్పటి నుంచీ కవిత పార్టీలో మమేకమై పార్టీలో మమేకమై ఉద్యమంలో ముందుండి నడిచారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉద్యమాన్ని వేరే లెవెల్ కు తీసుకు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ విజయంలో కవిత పాత్ర కూడా గణనీయంగా ఉంది. వరుసగా రెండో సారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అంత వరకూ ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగానే సాగింది.
ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైందో.. అప్పటి నుంచీ కేసీఆర్ కుటుంబంలో విభేదాలు పొడసూపాయి. కేసీఆర్ కు ఇద్దరు పిల్లలు కేటీఆర్, కవిత. పార్టీ పరాజయం తరువాత కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తలెత్తాయని పార్టీ వర్గాలలోనే గుసగుసలు వినిపించడం మొదలైంది. ఎప్పుడైతే కవిత బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీకైందో.. అప్పటి నుంచే ఇరువురి మధ్యా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కవిత తన సొంత దారి చూసుకుంటున్నారా? అన్న చర్చ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే కవిత అడుగులూ పడ్డాయి. తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని తన ఇంటికి సమీపంలోకి మార్చుకున్న కవిత.. బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ద్వారానే రాజకీయం చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే యువతనుజాగృతిలోకి ఆహ్వానించారు. ఆమె పిలుపు మేరకు ఇటీవల పెద్ద ఎత్తున యువత జాగృతి సంస్థలో చేరారు. వారికి కవిత సంస్థ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒక మీడియా సంస్థ మాత్రం కవిత ఇంటిపేరును కల్వకుంట్ల అని కాకుండా దేవనపల్లి అని పేర్కొంది. దేవనపల్లి కవిత భర్త అనీల్ ఇంటి పేరు. ఇంత కాలంగా కవితను కల్వకుంట్ల కవితగానే అంతా పేర్కొంటూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా అదీ ఓ మీడియా సంస్థకు కవిత ఇంటిపేరు కల్వకుంట్ల కాదు అంటూ ప్రచురించాలనీ. ప్రచారం చేయాలనీ అనిపించింది. అంటే కేసీఆర్ కుటుంబం నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచీ ఆమెను వేరు చేసే ప్రయత్నమే ఇదని పరిశీలకులు విశ్లేషించారు.
సరిగ్గా సోదరుడితో విభేదించిన తరువాత వైఎస్ షర్మిల పేరుకు ముందు ఆమె భర్త ఇంటిపేరు ఎలా అయితే చేర్చి అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ సొంత మీడియా ప్రచురించాయో, ప్రచారం చేశాయో.. సరిగ్గా అలాగే ఇప్పుడు కవిత విషయంలో జరగడం యాధృచ్చికం ఎంత మాత్రం కాదని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-a-particular-media-change-kavitha-surname-39-200158.html
భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడి చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కూతురు వైయస్ షర్మిల, కుమారుడు వైయస్ జగన్ లు వేరు వేరుగా నివాళులర్పించారు. గత మూడేళ్ళకు పైగా వారి వద్ద విభేదాలు మరింత పెరిగాయి.
నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి- ఆరు సార్లు ఎమ్మెల్యే. అంతే కాదు ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అతి పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజీని బురద కాలవలో కలిపేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కేవలం కోవూరు మాత్రమే కాదు నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నలో కలిపేస్తున్నారా? అన్న మాట వినిపిస్తోంది.
పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదరింపు వచ్చింది. కోర్టు మొత్తాన్ని బాంబులతో పేల్చేస్తామన్న బెదరింపుతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఔను.. చాలా మంది అభిప్రాయం ఇదే. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ ప్రసంగాలలో విషయం కంటే అతిశయం ఎక్కువగా ఉంటుందన్న భావన చాలా మందిలో వ్యక్తం అవుతుంటుంది.
దేశవ్యాప్తంగా అందరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని అర్థమయ్యేలా తెలియజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందు కోసం పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టింది.
క్రీడా రంగ ప్రముఖుడు, 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం (జులై 7) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై ఆయన సీఎంతో చర్చించారు.
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో అజయ్ దేవగణ్ సోమవారం (జులై7) కలిశారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకే రోజు ఇద్దరు సినీ క్రీడా సెలబ్రిటీలను కలిశారు. వారిలో ఒకరు 1983 వరల్డ్ కప్ విజేత లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కాగా. మరొకరు నటుడు, నిర్మాత అజయ్ దేవ్ గన్.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా సోమవారం (జులై 7) రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 6) శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.