ఇంతకీ మోడీ షాలకు మిత్రుడు చంద్రబాబా.. జగనా?

Publish Date:Mar 6, 2025

Advertisement

వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో  చివర కూర్చున్నా ఫరవాలేదన్నది నానుడి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తీరు అందుకు భిన్నంగా ఉంది.   కేంద్రంలో  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబునాయకత్వంలో  అధికారంలో ఉన్నది కూడా ఎన్డీయే సర్కారే.  అయినా మోడీ మద్దతు, సహకారం ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ కే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.   

వైఎస్ వివేకానండ రెడ్డి హత్య కేసులో ప్రధాన, ప్రత్యక్ష సాక్షి వాచ్ మ్యాన్ రంగన్న  బుధవారం (మార్చి 5) రాత్రి కడప రిమ్స్ హాస్పిటల్లో మృతిచెందారు.  రంగన్న మృతిపై తనకు అనుమానాలున్నాయంటూ ఆయన భార్య పిర్యాదు చేయడంతో పులివెందుల పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  వివేకా హత్య కేసులో ఇప్పటికే పలువురు సాక్షులు మృతి చెందారు. ఇప్పుడు  ప్రత్యక్ష సాక్షి రంగన్న కూడా మృతి చెందారు. గత 5 ఏళ్ళుగా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. కానీ నేటికీ వివేకాని ఎవరు హత్య చేశారో? ఆయన హత్య వెనుక ఎవరెవరున్నారో సీబీఐ నిర్ధారించి కోర్టులో నిరూపించలేకపోయింది.  పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే బలమైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసుని కొట్టివేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్నారు కనుక కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని తెలుగుదేశం ఆరోపించింది. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే అప్పుడు పరిస్థితులు ఉన్నాయి.

సీబీఐ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కనీసం తాకలేకపోయింది. అవినాష్ రెడ్డిపై అరెస్టు వారెంట్ ఉన్నా అప్పటి జగన్ ప్రభుత్వం ఆయన అరెస్టు కాకుండా అడ్డుకోగలిగింది. దీంతో సీబీఐ చేసేదేం లేక అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండానే అరెస్టు చూపించి స్టేషన్ బెయిలు ఇచ్చేసి వదిలేసింది. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ అండతో జగన్ ఇవన్నీ చేయించగలిగారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అయినా కేసు ముందుకు సాగడం లేదు. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వివేకా కుమార్తె సునీత చంద్రబాబును కలిసి కేసు విచారణ వేగవంతం చేయాలని కోరారు. అయినా పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు లేదు. దీనిని బట్టి చూస్తుంటే కేంద్రం పెద్దల వద్ద ఇంకా జగన్ మాటే చెల్లుబాటు అవుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశీలకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చే స్తున్నారు.

అసలింతకీ మోడీ షా చంద్రబాబు వైపా, జగన్ వైపా ఎవరి వైపు ఉన్నారన్న సందేహిలు సామాన్యులలో కూడా వ్యక్తం అవుతున్నాయి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండి, కనీసం విపక్ష హోదా కూడా దక్కకపోయినా జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద తన పలుకుబడి ఉపయోగించి వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరించకుండా నిలువరించగలుగుతున్నారనీ, అదే సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం వివేకా సహా జగన్ కేసుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి దర్యాప్తు సంస్థలు చురుకుగా వ్యవహరించేలా చేయడంలో విఫలమౌతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.