దుబ్బాకలో గెలుపెవరిది! ఓటర్ల నాడి ఎలా ఉంది? 

Publish Date:Nov 3, 2020

Advertisement

తెలంగాణలో రాజకీయంగా కాకరేపిన దుబ్బాక ఉప ఎన్నికలో ఓటరు తీర్పు ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకుని ప్రచారం చేయడంతో భారీగా ఓటింగ్ నమోదైంది. పోలింగ్ చివరి నిమిషం వరకు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ప్రయత్నించాయి. దీంతో గతంలో ఎప్పుడు లేనంత హోరాహోరీగా దుబ్బాక ఉప ఎన్నిక జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ ముగియడంతో ఇప్పుడు దుబ్బాక ఓటర్లు ఎటు వైపు మెగ్గుచూపారన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. పోలింగ్‌ సరళిని బట్టి ఫలితాలను అంచనా వేస్తున్నాయి ప్రధాన పార్టీలు. గ్రామాలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయో అంచనా వేసుకుంటున్నారు బరిలో నిలిచిన అభ్యర్థులు. 
  

దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోలు, దౌల్తాబాద్, నార్సింగి, చేగుంట మండలాలు ఉన్నాయి. తమకు అన్ని మండలాల్లో లీడ్ వస్తుందని, 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామని అధికార టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు దుబ్బాక రూరల్, నార్సింగ్ , చేగుంట, రాయపోల్ మండలాల్లో తమకు మంచి లీడ్ వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. యువత, ఉద్యోగుల ఓట్లన్ని గంపగుత్తగా తమకే పడ్డాయని, దుబ్బాకలో ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ గెలవబోతుందని చెబుతోంది కమలదళం. ఇక మల్లన్నసాగర్ ముంపు గ్రామాలున్న తోగుంట మండలంలో పోలింగ్ కాంగ్రెస్ కు వన్ సైడ్ గా జరిగిందని, మిరుదొడ్డి, చేగుంట, దుబ్బాక అర్బన్, రూరల్ లోనూ లీడ్ సాధిస్తామని హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
                  

గెలుపుపై ప్రధాన పార్టీలు ఎవరికి వారే ధీమాగా ఉన్నా రాజకీయ విశ్లేషకులు, వివిధ సర్వే సంస్థల లెక్కల ప్రకారం దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే టఫ్ ఫైట్ నడిచిందంటున్నారు. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు నార్సింగ్ మండలాల్లో బీజేపీకి లీడ్ కనిపించిందని, రాయపోల్, చేగుంట మండలాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు నడిచిందని అంచనా వేస్తున్నారు. మిరుదొడ్డి, దౌలతాబాద్, దుబ్బాక రూరల్ మండలాల్లో కారు కు ఆధిక్యత రావొచ్చని లెక్కలు వేస్తున్నారు. తోగుంట మండలంలో మాత్రమే టీఆర్ఎస్, బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సొంత మండలం కావడం, మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. 

 

దుబ్బాక  నియోజకవర్గంలో 78,187 మంది రైతులు రైతుబంధు, 52,823 మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. 5,599 మందికి కల్యాణలక్ష్మి, 322 మందికి షాదీ ముబారక్‌ చెక్కులతోపాటు, 30,732 మందికి కేసీఆర్‌ కిట్స్‌ అందజేశారు. ఇలా నియోజకవర్గంలో 1,67,663 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాయని, వీరందరి ఓట్లు తమకే పడతాయనే ధీమాతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఉంది. ఇక నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు 30 వేలకు పైగా ఉన్నారు. వీరిపై ఆశలు పెట్టుకుంది బీజేపీ. రైతు బంధు తీసుకున్నా కేసీఆర్ సర్కార్ పై రైతులు ఆగ్రహంగా ఉన్నారని, లక్ష రుణమాఫీ అమలు చేయకపోవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మద్దతు ధర, నియంత్రిత పంటల సాగు విధానాలతో ప్రభుత్వానికి రైతులు వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు. నిరుద్యోగులంతా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారని చెబుతున్నారు. 

 

దుబ్బాక నియోజరవర్గంలో మొత్తం లక్షా 98 వేల 807 మంది ఓటర్లున్నారు. మొత్తం ఏడు మండలాల్లోని 148 గ్రామాల్లో 315 పోలింగ్‌ స్టేషన్లలో ఓటింగ్ జరిగింది. 2018లో జరిగిన ఎన్నికల్లో  లక్షా 90 వేల మంది ఓటర్లకు గాను 1,63,658 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85.92% ఓటింగ్‌ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు  రామలింగా రెడ్డికి 89,299 ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటి చేసిన మద్దుల నాగేశ్వరరెడ్డి  26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు కేవలం 22 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.