Publish Date:Feb 28, 2025
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం కమలం పార్టీలో తీవ్ర పోరు నెలకొంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలన్న నిర్ణయానికి పార్టీ అధిష్ఠానం వచ్చింది. త్వరలో జరగనున్న పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికకు పార్టీలో తీవ్ర పోటీ నెలకొని ఉంది. మరో ఐదేళ్ల పాటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం బలమైన నాయకుడిని జాతీయ అధ్యక్ష స్థానానికి ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రధానంగా రేసులో నలుగురు ముందు వరుసలో ఉన్నారు. వారిలో మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజె, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, మహారాష్ట్ర బీజేపీ నేత వినోద్ థావ్డే ఉన్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ నలుగురిలో ఒకరు పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వచ్చే నెల 15 నాటికి పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక పూర్తి చేయాలని కమలం అధిష్ఠానం భావిస్తున్నది. అయితే పార్టీ నిబంధనల మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి అయిన తరువాత మాత్రమే జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంటుంది. పార్టీ రాష్ట్ర శాఖలలో కనీసం సగం రాష్ట్రాల ఎన్నికలైనా పూర్తైతే కానీ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక చేపట్టడానికి పార్టీ రూల్స్ అంగీకరించవు. ఇప్పటి వరకూ 12 రాష్ట్రాలలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్ష ఎన్నిక జరపాలంటే మరో ఆరు రాస్ట్రాలలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్, అసోం రాష్ట్రాలలో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చూసింది. అదే సమయంలో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి పేర్లు సూచించాల్సిందిగా కూడా పార్టీ హైకమాండ్ రాష్ట్రాల ఇన్ చార్జ్ లకు సూచించింది. కాగా పోటీ తీవ్రంగా ఉండటంతో బీజేపీ శ్రేణులలో కూడా బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరన్న ఉత్కంఠ నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/who-will-be-nadda-successor-39-193610.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.