మునుగోడులో ముగ్గురిలో ముందుండేదెవరో ?

Publish Date:Oct 14, 2022

Advertisement

మూడు పార్టీలకే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకే కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియలో ఒక ప్రధాన ఘట్టం ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు (శుక్రవారం) తో నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెరాస అభ్యర్ధి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ముందుగానే నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. మరోవంక మునుగోడు బరిలో దిగేందుకు ఇప్పటికే 30 మందికి పైగా అభ్యర్ధులు నామినేషన్లు దాఖాలు చేశారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఇంకెంత మంది నామినేషన్ వేస్తారనేది పక్కన పెడితే, ఈ నెల 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత ఎంతమంది బరిలో మిగులుతారో చూడవలసి వుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే, మునుగోడు బరిలో ఎందరున్నా, ప్రధాన పోటీ మాత్రం తెరాస, బీజీపీ, కాంగ్రెస్ అభ్యర్ధుల మధ్యనే ఉంటుందని పరిశీలకులు ముందు నుంచి చెపుతూనే ఉన్నారు. అయితే, పోటీలో నిలిచే ఇతర పార్టీలు, అభ్యర్ధులను బట్టి, ప్రధాన పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములు నిర్నయమవుతాయ్నై అంటున్నారు. పొతే ముగ్గురి మధ్యనే, కానీ, ఫలితాన్ని నిర్ణయించేది మాత్రం, ఇతరులే అంటున్నారు.   

అయితే, మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలో దించడంతో ఇతర సామాజిక వర్గాలు ఎలా స్పందిస్తాయనేది, ఆసక్తికరంగా మారింది. బీస్పీపీ తరపున  దళిత బహుజన వర్గానికి చెందిన  అందోజు శంకరా చారి నామినేషన్ దాఖలు చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇతర ముఖ్యనేతలు నియోజక వర్గంలోని ఏడు మండలాలలో ప్రచారం సాగిస్తున్నారు.మరో వంక , కేఏ పాల్ పార్టీ ప్రజా శాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, ఆయన నామినేషన్ అయితే వేయలేదు. అలాగే, వైఎస్ షర్మిల పార్టీ  వైఎస్సార్ - టీపీ కూడా పోటీ చేస్తుందని ప్రచారం జరిగినా,షర్మిలఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆ ప్రచారం ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ప్రజాప్రస్థానం పాద యాత్రలో ఉన్న, షర్మిల మునుగోడు ఉపఎన్నికలు నేపధ్యంగా తెరాసపై జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మునిగి తేలుతున్నారని ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

అదలా ఉంటే, వివిద సంస్థలు నిర్వహిస్తున్న అధికార, అనధికార సర్వేలు మునుగోడులో అధికార తెరాస,  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటోందనే సంకేతాలు ఇస్తున్నాయి. ఒక దశలో తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకంటే చాలా ముందున్నా, ఇప్పడు తెరాస, బీజేపీల మధ్య దూరం రోజురోజుకు తగ్గిపోతోందని అంటున్నారు. ముఖ్యంగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత పరిస్థితి వేగంగా మారిపోతోందని అంటున్నారు. కూసుకుంట్లకు పార్టీలోనే మద్దతు లేదని, దీంతో కింది స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల మద్దతు ఏ మేరకు ఉంటుందనే విషయంలో అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. 

మరో వంక కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి, పాల్వాయి గోవర్ధన రెడ్డి పలుకుబడి పై ఎక్కువగా ఆధార పడుతున్నారు, అలాగే, మహిళా కార్డును ఉపయోగిస్తున్నారు. ఇంతవరకు ప్రధాన పార్టీలు ఏవీ మహిళలకు అవకాశం ఇవ్వలేదని, తొలి సారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక మహిళకు అవకాశం ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్. రెడ్డి  మహిళలను గెలిపించే బాధ్యత మహిళలే తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్రవంతిని గెలిపిస్తే, ములుగు ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే  స్రవంతి సమ్మక్క సారలమ్మలలా అసెంబ్లీలో మహిళల గళం వినిపిస్తారని రేవంత్ రెడ్డి మహిళా కార్డ్’ను ప్రయోగించారు.అయితే, కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రచారంలో పాల్గొనకపోవడం కాంగ్రెస్ పార్టీకి మైనస్సే అవుతుందని అంటున్నారు. 

ఇక బీజేపే అభ్యర్ధి రాజగోపాల రెడ్డి, కోమటి రెడ్డి సోదరుల కార్డును, వ్యక్తిగత పలుకుబడి, కేంద్ర ప్రభుత్వ పథకాలను  ప్రధాని మోడీ, షా నాయకత్వం ప్రధాన అస్త్రాలుగా ప్రచారం సాగితున్నారు. అలాగే నియోజక వర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని ప్రచారం చేస్తున్నారు. తన రాజీనామాతో నియోజక వర్గంలో పనులు జరుగుతున్నాయని ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మూడు ప్రధాన పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నా, ఇంకా ప్రచారపర్వం పతాక స్థాయికి చేరుకోలేదు. మూడు పార్టీల ముఖ్యనేతలు పూర్తి స్థాయిలో ప్రచార బరిలో దిగలేదు. దీంతో ముందు ముందు ప్రచారం జోరందుకున్న తర్వాత గానీ, వాస్తవ పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని పరిశీలకులు అంటున్నారు. 

అదలా ఉంటే, మునుగోడు ఉపఎన్నికకు ఈ నెల 3న ఈసీ షెడ్యూల్ విడుదల చేయగా.. 7న నోటిఫికేషన్ వచ్చింది. 7వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 14తో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్లను అధికారుల స్వీకరిస్తారు. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. 6న కౌంటింగ్ జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.

By
en-us Political News

  
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.