ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చాంపియన్స్ ట్రోఫీలో విజేత ఎవరన్న ఉత్కంఠ కంటే.. వైసీపీ హయాంలో ప్రత్యర్థి పార్టీల నేతలపై బూతులతో రెచ్చిపోయిన నేతల అరెస్టులపైనే ఎక్కువ ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఔను దేశమంతా ఇప్పుడు క్రికెట్ ఫీవర్ తో ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా వరుస విజయాలతో ఫైనల్స్ కు చేరుకుంది. ఫైనల్స్ లో న్యూజిలాండ్ తో తలపడుతోంది. చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ సునాయాస విజయాలతో దుమ్ము లేపిన టీమ్ ఇండియా ఫైనల్స్ లో కూడా విజయం సాధించి ముచ్చటగా మూడో సారి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలుస్తుందా, లేదా చివరిమెట్టు మీద తడబడి న్యూజిలాండ్ కు దాసోహం అంటుందా అన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొని ఉంది. ముఖ్యంగా కింగ్ కోహ్లీ తన పూర్వ ఫామ్ ను అందిపుచ్చుని చెలరేగి ఆడుతుండటంతో దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ చర్చే జరుగుతోంది.
అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం క్రికెట్ మానియా పెద్దగా కనిపించడం లేదు. ఇక్కడ అందరి దృష్టి పోసాని తరువాత ఎవరు? జగన్ హయాంలో నోటికొచ్చినట్లు దుర్భాషలాడి రెచ్చిపోయిన నేతలలో పోసాని తరువాత అరెస్టయ్యేది ఎవరు? కోడాలి నాని, గోరంట్ల మాధవ్, దువ్వాడ శ్రీనివాస్ అంటే ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా హూ ఈజ్ నెక్స్ట్ అన్న ఉత్కంఠే, ఆసక్తే కనిపిస్తోంది. అయితే తరువాత వంతు దువ్వాడ శ్రీనివాస్ దే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. ఇందుకు రాజకీయాలలో పరుష వ్యాఖ్యలకు దూరంగా ఉండే జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలను ఉదాహరణగా చెబుతున్నారు.
నిజమే జగన్ హయాంలో వైసీపీ నాయకులు బరితెగించారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడంలో ఆరితేరిపోయారు. నరం లేని నాలుక కదా ఏం మాట్లాడినా చెల్లిపోతుం దన్న ట్లుగా నోటికి హద్దూ పద్దూ లేకుండా బూతుల పంచాంగం విప్పి మరీ తెలుగుదేశం, జనసేన అగ్రనాయకులపై తిట్ల దండకంతో రెచ్చిపోయారు. అలా ఇష్టారీతిగా మాట్లాడిన వారిలో వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఒకరు.
ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గుంటూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మాణిక్యాల రావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దువ్వాడను విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు విషయానికి వస్తే.. పోసాని కృష్ణమురళిపై కూడా జనసేన అధినేతపై చేసిన అనుచిత వ్యాఖ్యలపైనే కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇప్పుడు అదే విధంగా దువ్వాడ శ్రీనివాస్ పై కూడా పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపైనే కేసు నమోదైంది. దీంతో ఆయనను విచారించి అరెస్టు చేయడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. బూతుల పంచాంగంతో వైసీపీ హయాంలో రాజకీయాలను కలుషితం చేసిన నేతల అరెస్టుల పట్ల సామాన్య జనంలో కూడా హర్షం వ్యక్తం అవుతోంది. అందుకే వంశీ, పోసానిల అరెస్టులను జనం స్వాగతించారు. నెక్స్ట్ ఎవరంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/who-is-next-after-posani-arrest-39-193965.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.