ముఖ్యమంత్రి శివకుమార్? సిద్ద రామయ్య?

Publish Date:May 13, 2023

Advertisement

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో వాడి వేడి చర్చ జరుగుతోంది. 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ద రామయ్యకి మళ్లీ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. గాంధీ ఫ్యామిలీకి విధేయుడుగా ఉన్న డికె శివకుమార్ పేరు కూడా ముఖ్యంత్రి అభ్యర్థి రేసులో ఉన్నారు. 
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే ,  రాహుల్ గాంధీ ఆలోచనను బట్టే ముఖ్యమంత్రి అభ్యర్థి డిసైడ్ కానున్నారు. 2024 లోకసభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా సిద్ద రామయ్యను ప్రకటించాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి సీనియర్ కాంగ్రెస్ నేత సిద్దరామయ్యను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి శివకుమార్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా  ప్రకటించే అవకాశం  కనిపిస్తుంది.
డికె శివకుమార్ అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న రాజకీయ నేత. అతన్ని ఎంపిక చేస్తే  వచ్చే లోకసభ ఎన్నికల్లో పార్టీకి ఆర్థిక సహకారం అందించవచ్చని పార్టీ భావిస్తోంది. ఒక వేళ శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో నిందితుడు. ప్రస్తుతం అతను బెయిల్ మీద ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివకుమార్ ను ప్రకటిస్తే బిజెపీ ప్రభుత్వం పాత కేసులను తోడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. శివకుమార్ పై సిబిఐ, ఈడీ, ఐటీ శాఖ లలో అనేక కేసులున్నాయి.  దర్యాప్తు సాగుతుంది. శివకుమార్ ఇప్పటకే 104 రోజులు తీహార్ జైలులో గడిపారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.