హ‌రిహ‌ర‌మ‌ల్లుకు అడ్డొస్తున్న ఆ న‌లుగురెవ‌రు?

Publish Date:May 24, 2025

Advertisement

ఒక్క‌రిలోనే న‌లుగుర్ని చూసుకుంటున్నారా?
అల్లంత దూరంలో క‌నిపించే ఆ ఒక్క‌రే న‌లుగురా?
తీస్తే మ‌రో సినిమా అయ్యే ఆ క‌థ‌, క‌మామిషు!

ఆ న‌లుగురూ.. ఆ న‌లుగురూ.. అనే పాట జ‌న‌సేన నాయ‌కుల‌కు మ‌ళ్లీ గుర్తుకు వ‌స్తోంది.  కార‌ణం.. జూన్ 12న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు విడుద‌ల కావ‌ల్సి ఉన్న సంద‌ర్భంలో క‌రెక్టుగా థియేట‌ర్ల మూత అనే వార్త విడుద‌ల కావ‌డం వెన‌క ఆ న‌లుగురి పాత్ర ఏదైనా ఉందా? అన్న చర్చోపచ‌ర్చ‌లు సాగుతున్నాయ్.  ఈ మ‌ధ్య ఈ థియేట‌ర్ల గొడ‌వ ఒక‌టి గంద‌ర‌గోళానికి గురి చేస్తోంది. ఆ న‌లుగురిలో ఎప్పుడూ ముగ్గిరి పేర్లు బాగా హైలెట్ అవుతాయి కానీ ఆ నాలుగో పేరు ఎవ‌రిదో తెలీదు. కానీ ఆ న‌లుగురు ఆ న‌లుగురు అన‌డానికి బాగుంద‌ని అంటున్నారులా ఉంది చూస్తుంటే.

అద్స‌రే ఆ న‌లుగ‌రిలో మ‌న‌కు కావ‌ల్సిన ఒక‌రైతే ఉన్నారుగా. ఇక‌నే! ఆ ఒక్క‌రినే న‌లుగురు అనుకుని గ్లాసు పార్టీ లీడ‌ర్లు, ఆ న‌లుగురినీ ఒక్క‌రిలోనే అల్లంత దూరంలో చూసుకుని.. ఆ న‌లుగురు ఆ న‌లుగురు అనేసుకుంటున్నారు బాగానే ఉంది. ప్ర‌తిసారీ ఈ న‌లుగురి గొడ‌వేంద‌ని? జూనియ‌ర్ సినిమా వ‌స్తే.. ఒక‌లా, అల్లు హీరో మూవీ రిలీజైతే మ‌రోలా.. ఇక ప‌వ‌న్ సార్ సినిమా అంటే ఇంకోలా.. సినిమాల‌కూ రాజ‌కీయాల‌కూ ఎంత సంబంధ బాంధ‌వ్యాలున్నా.. ఈ థియేట‌ర్ల గొడ‌వేంటో అర్ధం కాదు. అంతా ఒక్క‌టే అంటారు. ప‌వ‌న్ గెలిచి ఉప ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. త‌మ‌దైన శైలిలో ఆయ‌న్ను  క‌ల‌వ‌డం.. అందులో త‌న ఆత్మీయ అల్లువారు కూడా ఉండ‌టం.. అదో టైపు.

ఇక్క‌డ మ‌రో అనుమానాస్ప‌దం.. ఆలోచ‌నాత్మ‌కం.. ఏంటంటే స‌రిగ్గా ఇదే అల్లువారు ప‌వ‌న్ ఇక్క‌డ ఉప‌ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తుంటే.. ఎక్క‌డో విదేశాల్లో ఉండి రాలేక పోవ‌డం ఇదో టైపు. ఇది దూరం మెయిన్ టైన్ చేయ‌డంలో భాగ‌మా.. లేక యాధృచ్చిక‌మా అర్ధం కానంత అయోమ‌యంలో జ‌న‌మేమీ లేరిక్క‌డ ఇది మ‌రో ఇంకో టైపు. ఇద‌లా ఉంచితే.. పుష్ప‌రాజ్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే స‌రికి.. అడ‌వుల‌ను దోచేవాడు క‌థ‌నాయ‌కుడు ఎలా అవుతాడ‌న్న ప్ర‌శ్న‌ల‌కు బ‌దులివ్వ‌డంలో థియేట‌ర్ల మూత కార్య‌క్ర‌మం దాగి ఉందా? ఇదింకో సందేహాత్మ‌కం!!!

ఏమో కౌంట‌ర్లు ఎన్ కౌంట‌ర్లు ఎప్పుడూ ఒక‌లాగానే ఉంటాయ‌ని ఎలా చెప్ప‌గ‌లం? కొంద‌రు నోటితో అంటారు. కొంద‌రు నొస‌టితో చెప్ప‌క చెబుతారు. మ‌రికొంద‌రు ఏకంగా చేసి చూపిస్తారు. ఇది ఆ టైపేమో..    ప్ర‌తీకార‌ముల యందు అతీకార‌ములు వేర‌యా విశ్వ‌దాభిరామ విన‌రా మామా! అంటూ కొంద‌రు అంటూ ఉంటారు. అందులో భాగంగా చూస్తే.. ఇది ప్ర‌తీకారానికే అతీ..కారమూ కావ‌చ్చు.  వీరీ వీరీ గుమ్మ‌డి పండు ఆ న‌లుగురి పేరేమీ అంటే ఎవ‌రు మాత్రం ఏం చెప్ప‌గ‌లం.. అందులో న‌లుగురు కాదు.. ఆ ఒక్క‌రే అని మ‌నం మాత్రం ఎందుకు చెప్పాలి.. వారికి వారికి ల‌క్ష ఉంటాయో కోటి కూడా ఉంటాయో ఎలా గెస్ చేయ‌గ‌లం?

ఆ ప్ర‌తీకారం కొద్దీయే క‌దా.. జానీ చిత్ర‌ణ‌లో రోజుకు ఒక షాట్ మాత్ర‌మే తీసి.. ఆ క‌సీ క్రోధం చ‌ల్లార్చుకుంది.. అనంటారు మ‌రి కొంద‌రు. అబ్దో అదో పాత క‌థ‌.. పెద్ద క‌థ‌.. ఇప్పుడెందుకూ.. కాస్త డీటైలింగ్ లోకి వెళ్తే.. బేసిగ్గా రోజుకు నాలుగు సీన్లు తీస్తారు. కావాల‌ని నాలుగు షాట్లు కూడా తీయ‌కుండా అలా నాన్చి నాన్చి తీయ‌డం అందులో భాగ‌మే అంటారుగా. ఇలాంటివి అనుకోకుండా ఉండ‌లేం. ఇదో జ‌బ్బు జాడ్యం మ‌న‌ది. 

హీరో మా వాడు. ఆట మాది. కానీ కాసు నీదా? స‌న్నాఫ్ స‌త్య‌మూర్తీ! అన్న గొడ‌వ ఈనాటిదా.. చెప్పండి. ఏనాటిదో. మా న‌డిపోడు తినాల్సిన తిండి.. ఎవ‌డో బావ‌గాడు తినిపోయాడ‌న్న బాధ ఇప్ప‌టిది కాదాయె. దీంతో ఆ ఇంటి వార‌సుడు పిల్ల ముందా- గుడ్డు ముందా?  అన్న కొచ్చిన మార్క్ రైజ్ చేశాడాయె. ఇలా కాంపౌండ్లు చీలి.. త‌లోదిక్క‌య్యింది క‌ల‌హాల కుటుంబ‌కం!!! ఇందులోనే సోష‌ల్ మీడియా అకౌంట్లు ఫాలో అవ‌క‌డం కాక పోవ‌డం.. ఇందులో మ‌రో ట్విస్టు- లేటెస్టూ...

ఈ క్ర‌మంలో వాళ్ల‌ల్లో వాళ్లు నంద్యాల హైడ్రామాలాడి హైపులు తెచ్చుకుని.. ఇప్పుడు మ‌రో స‌రికొత్త థియేట‌ర్ డ్రామాకు తెర‌లేపితిరి.. ఆ తెర దించ‌చేదెపుడు.. ఈ నాట‌కానికి ముగింపు ఎప్పుడు? తీస్తే ఇదీ ఒక సినిమా అవుద్దేమో హ‌రి హ‌ర మ‌ల్లూ.. మాలీవుడ్ అదే మ‌ల‌యాళంలో బాగా ఆడొచ్చేమో!!!
 

By
en-us Political News

  
ఏటా జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిఈ ఏడాది ఎపిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీసు స్టేషన్ లో యశ్వంత్ కుమార్ పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో భక్తులు తిరమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సీబీ విజయంలో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ఫైనల్ లో 191 పరుగుల స్కోరు డిఫెండ్ చేసుకోవడమంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ లో భాగమైన కోహ్లీ ఈ 18 ఏళ్లూ అదే జట్టు తరఫున ఆడాడు. ఆర్సీబీతో ఎమోషనల్ గా పెనవేసుకుపోయాడు.
ఆర్సీబీ విజయంతో క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ కరిగి కన్నీరయ్యాడు. ఉద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్లుగా ఆర్సీబీ విజయం కోసం తన సర్వశక్తులూ ధారపోసిన కోహ్లీ అది సాధించిన అనంతరం ఆనందం పట్టలేక కన్నీరు పెట్టుకున్నాడు.
ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆహ్మదాబాద్ వేదికగా మంగళవారం (జూన్ 3)న జరిగిన ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల ఆధిక్యతతో గెలిచి విజేతగా నిలిచింది.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిల్ సాల్ట్.. కైల్ జెమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
మధుర ఫలం మామిడిని పండించే రైతు ధర లేక కుదేలవుతున్నాడు. ఈసారి మామిడి దిగుబడి బాగా వచ్చినా ధర అధ్వాన్నంగా ఉండడంతో ఢీలా డ్డారు. ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు మామిడి కి రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరుంది
తెలంగాణలో కరోనా కలకలం సష్టించున్నాయి. రాష్ట్రంలో నాలుగు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌లు, ఫిషింగ్ హార్బర్లపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్ బెంగళూరుతోో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
చాలా మంది జ‌గ‌న్ అనేవాడు. చాలా చాలా బాధ ప‌డుతున్నాడు. నీర‌సించి పోయాడు..అస్స‌లు డ‌బ్బులు లేవంట‌ క‌నీసం ఆఫీసు రెంటు కూడా క‌ట్ట‌లేక పోతున్నాడంట‌..అని తీవ్ర నిరాశా నిస్పృహ‌ల‌తో అల‌మ‌టించిపోతున్నారుగానీ.. జ‌గ‌న్ ప‌రిస్థితి అలాగేం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.