ఇంతకీ కిడ్నాపర్ల వెనుక ఉన్నది ఎవరు ?

Publish Date:Jun 21, 2023

Advertisement

విశాఖపట్నం ఎంపీ, వైసీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం అనంతరం ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల పోలిటికల్ సర్కిల్‌లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. తన వ్యాపారాన్ని విశాఖపట్నం నుంచి పక్క రాష్ట్రంలోని హైదరాబాద్‌ మహానగరానికి మారుస్తానని ఆయన స్పష్టం చేయడం, ఆ తర్వాత తన సొంత పార్టీ అధినేతకు చెందిన మీడియాలో ఒకే రోజు.. కోట్ల రూపాయిల విలువైన ప్రకటనలు ఇవ్వడం.. అనంతరం తన ప్యామిలీతో కలిసి ఎంపీ  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్‌ని కలసి రావడం.. చూస్తుంటే.. ఈ కిడ్నాప్‌ స్కెచ్ పక్కా పకడ్బందీ ప్రణాళికతోనే జరిగిందనే ఓ చర్చ   పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

మరోవైపు ఎంపీ  కంటే.. ఆయన ఫ్యామిలీని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లకు అండ దండ.. చాలా చాలా గట్టిగా ఉన్నాయనే ఓ టాక్ సైతం ఆ  సర్కిల్స్ లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆయన.. ఇకపై వ్యాపారం.. విశాఖపట్నం నుంచి కాక.. హైదరాబాద్ కేంద్రంగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదీకాక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం డబ్బు కోసమేనంటూ పైకి చెబుతున్నప్పటికీ.. ల్యాండ్ సెటిల్‌మెంట్లలో భాగంగా జరిగిందనే ప్రచారం సైతం వాయువేగంతో నడుస్తోంది.  అలాగే ఈ కిడ్నాప్ వ్యవహారంతో తన పరువు హుళక్కి అయిందని ఎంపీ ఎంవీవీ తనలో తానే రగిలిపోతున్నారని అంటున్నారు.

అసలు అయితే రాష్ట్రంలో  వైసీపీ ఎంపీలు రెండంకెల సంఖ్యలో ఉన్నా.. ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు.   ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. గత ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ మీద పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలోనే ఆయన ఓ బిల్డర్ అనీ టాలీవుడ్ సినిమా ప్రోడ్యూసర్ అని అందరికీ తెలిసింది.  

ఆ తర్వాత ఆయన్ని అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ.. అందులో పని చేస్తున్న కార్మికులు చేపట్టిన ఆందోళన 200వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా కార్మికులు మానవ హారంగా ఏర్పడి.. తమ నిరసన తెలిపారు. ఆ క్రమంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయాణను కార్మికులు ఘెరావ్ చేశారు. దీంతో ఆయన కామ్‌గా కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఇక విశాఖ రైల్వే జోన్ అంశంలో సైతం సదరు ఎంపీ ఏ స్థాయిలో స్పందించిందీ అందరికీ తెలిసిందేననే చర్చ సైతం నేటికి కొనసాగుతోంది.  

మరోవైపు గతంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌గా ఉన్న విజయసాయిరెడ్డికి విశాఖ ఎంపీకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని.. ఈ పంచాయతీ అప్పట్లో తాడేపల్లి ప్యాలెస్‌కు  చేరిందనే వార్తలు సైతం వెల్లువెత్తాయి. 

ఇంకో వైపు ఎంపీ ఎంవీవీ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కించిన చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రంలో కథాంశం.. ప్రస్తుత ఎంపీ ప్యామిలీ కిడ్నాప్ వ్యవహారం కథ కమామిషు అంతా ఒకే విధంగా ఉన్నాయనే టాక్ సైతం ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. 

ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని సదరు ఎంపీ సత్యనారాయణ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని... ఆ క్రమంలోనే ఎంపీగారు ఏపీలో దుకాణాన్ని బంద్ చేసి.. తెలంగాణలో తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారనే చర్చ వాడి వేడిగా నడుస్తోంది. 

అదీకాక.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులు టచ్ చేసేందుకు పోలీసులే జంకుతున్నారని... అటువంటి పరిస్థితుల్లో  రేపో మాపో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా అవతరించబోతున్న విశాఖపట్నానికి  లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఫ్యామిలీని ఇలా కిడ్నాప్ చేయడం అంటే అంత అషామాషీ వ్యవహారం కాదనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా వైరల్ అవుతోంది.

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.